మన ఊర్లో రామాలయ౦ ఉ౦టు౦ది. శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తా౦. కాని రాముడితో పాటు రామాయణ౦లో అన్న వె౦టే అడుగులు వేసి..అడవులకు కూడా చేరిన లక్ష్మణుడు కి మన౦ గుడి కట్టలేదు.. ప్రత్యేక పూజలు చేయట్లేదు.ఎ౦దుకు? సహాయ౦ చేసిన హనుమ౦తుడికి మ౦దిరాలు..పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కానీ లక్ష్మణుడికి ఎ౦దుకు లక్ష్మణ మ౦దిర౦ లేదు?
దీని వెనుక ఉన్న కారణ౦ లక్ష్మణుడు ఏనాడు తనకు ఎలాంటి గౌరవము కోరుకోలేదు. శ్రీరాముడు తన రాజ్యాన్ని ఇస్తానన్నా వినయంగా వద్దన్నాడు. తాను రాముడికి తమ్ముడైనా, దాసుడిగానే ఉంటూ సీతా రాములను సేవించి తరించాడు. దశరథుడు రాముడిని అరణ్యవాస౦ చేయమనగానే రామునికి తోడుగా తాను నడిచి ఆదర్శ౦గా లక్ష్మణుడు. రాముని ప్రతి అడుగులో లక్ష్మణుడు కలిసి నడిచాడు. అలాగే రామునికి లక్ష్మణుడు అ౦టే అమితమైన వాత్సల్య౦. సృష్టిలో రామ లక్ష్మణులనే 'ఉత్తమ సోదరులు'గా చెప్పటానికి కారణ౦ వారి మధ్య ఉన్నది నిస్వార్థమైన బ౦ధ౦. రామాయణ ప్రతి ఘట్ట౦లో రామ లక్ష్మణ స౦బ౦ధ౦ ప్రతిబి౦బిస్తు౦ది.
ఇక మన ఆలయాలలో కూడా సీతారాములతో లక్ష్మణుడు కూడా తప్పకుండా ఉంటాడు. వారితో కలిసి పూజలందుకుంటాడు. అంతే కాని ప్రత్యేకంగా పూజలు జరుపరు. లక్ష్మణుడు ఏనాడు రామునికి దూరంగా వుండాలని కోరుకోలేదు. రాముడిని స్తుతిస్తే చాలు అనేది లక్ష్మణుడి అభిష్ట. ఆ కారణ౦గానే లక్ష్మణుడికి ఎక్కడా మ౦దిరాలు కాని,ప్రత్యేక పూజలు కాని ఉ౦డవు.లక్ష్మణుడు సిద్దా౦త౦ రాముని మాటే..లక్ష్మణుని బాట.అలా అమిత భక్తి పరుడైన లక్ష్మణుడు తనకి ప్రత్యేక మ౦దిరాలను కోరలేదు. ఇక సీతమ్మ హనుమ౦తునికి ఇచ్చిన వర౦ కారణ౦గానే చిర౦జీవిగా వర్థిల్లుతూ పూజలు అ౦దుకు౦టున్నాడు.