(An Improvised Version of Letter written by 11 year old boy behind his notebook)
అమ్మా నేనిప్పుడు చెప్పేది నీకు ఫోన్ చేసినప్పుడే చెప్పాలనుకున్నా కానీ,ఎక్కువసేపు మాట్లాడనివ్వరు కదా,అందుకే ఈ లెటర్ రాస్తున్నా. అమ్మా, డాడీకి చెప్పు నాకు ఈసారి సమ్మర్ క్యాంప్ వొద్దు అని,ఈ 2 మంత్స్ మాత్రమే కదా నాకు హాలిడేస్, మళ్లీ హాస్టల్ ఏ కదా, నువ్వే చెప్పు, ఇయర్ మొత్తం హాస్టల్లో ఉంటా కదా,ఇప్పుడు సమ్మర్ క్యాంపు వొద్దమ్మా. నేను ఇప్పడు గూడఁబోయ్ ని ,అసలు అల్లరి చేయట్లే, నిజ్జంగా. మా క్లాస్ కి నేనే క్లాస్ లీడర్ని. ఎవరూ అల్లరి చేయకుండా నేనే చూస్తా, ప్రామిస్ అమ్మా, ఇంట్లో అసలు అల్లరి చేయను,నిన్ను విసిగించను, రోజూ చదుకుంటా కూడా,చెల్లిని కూడా ఏడిపించను, డోరేమాన్ అసలు చూడను, డాడీని అది కొనివ్వమని ఇది కావాలని సతాయించను. ఎగ్జామ్స్ అయిపోగానే నన్ను ఇంటికి తీసుకెళ్లండి. మొన్న మెస్ లో తిని వొస్తుంటే లిఫ్టులో వేలు ఇరుక్కుంది, చాలా బ్లడ్ వచ్చింది, నేనేం ఏడవలేదు నొప్పిగా ఉన్నాకూడా, నేనే కట్టు కట్టేసుకున్నా, నిన్న వర్షం పడినప్పుడు పెద్ద సౌండ్స్ వచ్చాయి, అప్పుడు భయం అయ్యింది అయినా కూడా ఒక్కడినే పడుకున్నా,రాహుల్ గాడు భయపడితే నేనే వాడిని ఊరుకోమన్నా, నేను పెద్దోడ్ని అయిపోయా,నాకు బొమ్మలు కూడా వొద్దు, నేను నీ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడను, చెల్లితో గొడవ పడను.రోజూ పొద్దునే లేచి చన్నీళ్లే స్నానం చేసేస్తున్నా, నా షేల్వ్ అన్నీ నేనే సర్దుకుంటున్నా ఇక్కడ వార్డెన్ సర్, మా క్లాస్ టీచర్ కూడా నన్ను గూడఁబాయ్ అంటారు,నిజ్జంగా, నువ్వే అడుగు వాళ్ళని. హాస్టల్ లో ఉప్మా కూడా తినేస్తున్నా, నీ ఉప్మా ఎంత బాగుంటుందో కదా, ఇక్కడ అసలు ఏది బాలేదు, అయినా తినేసా,నాకు మ్యాగీ కూడా చేయమని అడగను,ప్లీజ్ అమ్మ,హాస్టల్ లో ఉండాలనిపించట్లేదు,చెల్లితో ఆడుకోవాలని ఉంది, నువ్వే చెప్పు చిన్న పిల్లాడిని కదా నేను.నీ పక్కన పడుకోవాలని ఉంది, డాడీ ఆఫీస్ కి వెళ్లేముందు నన్ను చెల్లిని బండి మీద ట్రిప్ కి తీసుకెళ్లి ఏదోటి కొనిస్తారు కదా, అట్లా వెళ్లి చాలా రోజులైంది . నేను బాగా చదుతున్నా, రోజూ నా హోంవర్క్ మొత్తం నేనే ఫస్ట్ చేస్సేస్కుంటున్నా, నాకిప్పుడు 15th టేబుల్ కూడా వొచ్చు, మొన్న ఎగ్జామ్స్ లో కూడా మంచి మర్క్స్ ఒచ్చాయని నువ్వే మెచ్చుకున్నావ్ కదా. ఈ 2 మంత్స్ నేను మీతోనే ఉంటా అమ్మా,రోజూ ఇక్కడ కిటికీ నుండి బయటకి చూస్తుంటే, ఇంటికి వోచేయాలని అనిపిస్తుంది.
నిజం చెప్పాలంటే ఈ హాస్టల్ లో ఉండాలని లేదు,రోజూ స్టడీ హావర్ అప్పుడు,పడుకునేటప్పుడు మీరే గుర్తొస్తున్నారు,మీరు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా ఏడుపొస్తుంది,అప్పుడు ఏడిస్తే మాట్లాడడానికి టైం ఉండదని ఏడవట్లే, నాకు ఇక్కడ ఉండాలని లేదంటే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్లారు,ప్లీజ్ అమ్మా …నువ్వు పాట పాడుతూ డాడీ కథలు చెబుతూ పడుకోపెడతారు కదా,కానీ ఇక్కడ ఎప్పుడూ తిడుతూనే ఉంటారు,లేవగానే కూడా త్వరగా రెడీ అవ్వాలని స్టిక్ చేతిలో పెట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటారెప్పుడూ. ఫ్యామిలీ అంటే అమ్మా,నాన్నా,చెల్లి నేను అందరం కదా అమ్మా,మరి నన్ను ఎందుకమ్మా ఈ హాస్టల్ లో వేశారు,ఇంట్లో ఉండి కూడా ఇంకా బాగా చదుకోవోచ్చు కదా …ఈ హాలిడేస్ మాత్రం తీసుకెళ్లండి,తర్వాత మీ ఇష్టం,మీరు చెప్పినట్టే వింటా,డాడీకి నువ్వే చెప్పు,నాకు భయం అవుతుంది అప్పుడప్పుడు ఇక్కడ ఉండాలంటే,మళ్ళీ నేనేమైనా అంటే నా కోసమే ,బాగా చదుకోవోచ్చు అందుకే హాస్టల్ అని అంటావ్ , నేను ఇంకా ఏది అడగను,ఈ హాలిడేస్ మాత్రం మీతోనే ఉంటా ,ఒప్పుకో,నువ్వే డాడీని ఒప్పించు,అసలు ,అస్సలంటే అసలు విసిగించను, అల్లరి చేస్తే మళ్ళీ పంపిచేయండి . డాడీని నువ్వే చెప్పి ఒప్పించు, టాటా బై
పవన్ 5th క్లాస్