Contributed By Praveen Kumar Rejeti
రామాయణం నిజంగా జరిగిందా??రాముడు విష్ణు అవతారమా కాదా?రాముణ్ణి పూజిస్తే కష్టాలు తీరిపోతాయా????
నా సమాధానం ఒక్కటే... ఏ మహిమా మంత్రం లేకుండా...ఒక కొడుకుగా,శిష్యుడు గా,అన్నగా,భర్త గా, స్నేహితుడుగా,సన్నిహితుడు గా, ప్రభువుగా ...ఒక మనిషిగా ఎలా బ్రతకాలో...బ్రతకచ్చో.. 10,000 సంవత్సరాల పాటు ఈ నేల పై ఒక అద్భుత శిక్షణ జరిగిందన్న రామకధ నుండి మనం రాముడు దేవుడా కాదా అన్న విషయం చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి సాధించేది ఏదీలేదు. అణువణువు ఒక పాఠమైన రామాయణం నుండి నేర్చుకుని అనుసరించి తరించాల్సిన ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి.
రామాయణాన్ని ఎందరో... ఎన్నో సార్లు తమదైన శైలి లో రాసుకుని తరించారు.ఎన్ని సార్లు రామాయణాన్ని కేవలం కథగా చదివి పక్కనపెడతాం?
|} రావణ సంహారమంటే మనలో దుర్లక్షణ రాక్షస సంహారం.
|} కోరికల పుట్ట అయిన మన మసస్సు ..వజ్ర సువర్ణ భరితమైన రావణ లంక...
|} శుద్ధ సత్వ గుణమే లంకలో చిక్కుకున్న సీతమ్మ ...రాక్షస కోరికల మధ్య ఆ లంకలో రాముని రాకకై (అంటే మనలో మార్పు కోరుకుంటూ) నిరీక్షిస్తుంది.
|} భక్తి, నమ్మకమే స్వామి హనుమ...మనలో సత్వ గుణాన్ని(సీతమ్మని) వెతికి పట్టుకునే ప్రయత్నం .
|} రామ నామమే రామ బాణమై రావణ కాష్టాన్ని వెలిగించి మనలో రాక్షస భావాల్ని సంహరించే ఘట్టం.
|} లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధనతో వెలిగించిన మనలో ఆత్మ జ్యోతి లో మిగిలిన అనుమానాలు కాలి ....(అగ్ని ప్రవేశం)శుద్ధమైన బంగారం లా మెరిసిపోయే క్రమం...
|} సత్వ గుణం నుండి శుద్ధ సత్వాన్ని పొందటం మన మనస్సుకు చేసే శ్రీ రామ పట్టాభిషేకం .
|} రామ కళ్యాణం మనస్సుని ....సత్వాన్ని ఎట్టి పరిస్థితి లో వడాలనని చేసే ప్రమాణం.
ఇలా రజో గుణ ...తమో గుణాలను వదిలి....సత్వ గుణం వైపు నిత్యం ప్రయాణం చేసే క్రమం మనలో రోజు జరిగే రామాయణం. ప్రయత్నించే ప్రతి సారి రామాయణం మనకి ఏదో ఒక కొత్త కోణం లో కనబడుతుంది.
రామాయణ పఠనం... పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కాదు...మనలో పాత్రతను పెంచుకోవడానికి. రామ నామ జపం, రామ కోటి రచన... మనం బాధ్యతలను గుర్తు చేసుకోవడానికి.రాముణ్ణి కొలవడమంటే ....విగ్రహ పూజ కాదు...రాముడిలాంటి జీవితం అలవరచుకోవడమే నిజమైన భక్తి.
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షల తో..!!!!