వెతకాలే కానీ, ఒంటరి తనం లో ఒక ఆనందం ఉంది. అది కూడా అనుభవాన్ని ఇస్తుంది. నీతో నువ్వు గడిపే క్షణాలే నీ గురించి నీకు తెలిసేలా చేస్తాయి. One must love his own company. 96 సినిమాలో "Life of ram" పాట ఇందుకు మంచి ఉదాహరణ. 96 తెలుగు రీమేక్ జాను లో "Life of Ram" ని సిరివెన్నెల గారు రాశారు. తనతో తను గడిపే ప్రతి ఒక్క అంతర్ముఖుడి అంతరార్థం ఈ పాట లో ఉంది. అందరి దృష్టి లో ఒంటరి అయినా తనతో తను, తన ప్రపంచం లో తను గడిపే ప్రతొక్కరి మనస్సు ని ఈ పాట లో ఆవిష్కరించారు సిరివెన్నెల గారు.
సాహిత్యం: ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా? ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..
ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా? ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..
కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా?
ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా.. ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా
నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి..
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా..
గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా... నిలకడ గా
యే చిరునామా లేక.. యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా
నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి..
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా.. విన్నారా.. నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశల తో నిన్న.. ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెల గా చెంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి...
భావం: నువ్వు వెళ్లే దారెంటని అడగటం ఎందుకు? నడుస్తూ వెళ్తూ ఉంటే అదే తెలుస్తున్నప్పుడు. నీ కావాల్సింది వెతుకుతూ.. నీ చూపులని, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాటి అందాన్ని చూడనీకుండా చేయకు. శిల లాగ అలాగే ఉండిపోతానో, కల లాగ కరిగి పోతానో, ఈ క్షణం లో బతికే నాకు ఆ రెండిటికి తేడా తెలీదు.. నువ్వెవరు అనే ప్రశ్న లా కలకాలం ఉండాలనే ఆశ నాది. ఎదో బదులు ఇవ్వొద్దని ఆ ఆశ చెరపొద్దని కాలాన్ని కూడా అడుగుతున్నా.. దయచేసి నన్ను ఒంటరి అని అనద్దు అనుకోవద్దు.. నాలో జన్మ జన్మలు సరిపడా స్నేహాన్ని చేస్తున్న ఎన్నో స్మృతుల్ని మీరెవ్వరు ఎరుగరు.. ఆ స్మృతులే కదా ఊపిరి గా నాకు చేయూతని ఇస్తున్నాయి. ఆ స్మృతులే కదా నా గుండె సడికి కబుర్లు చెప్తూ ఈ ప్రపంచపు సువాసనను నాకు అందిస్తున్నాయి.. ఇంకా నేను ఒంటరి ని ఎలా అవుతాను. ప్రతి ఉదయం నేను పుడుతూనే ఉంటాను . సూర్యుడిలాగా కాలం ఇప్పుడే నన్ను కొత్తగా పుట్టించింది.. అనగనగా అంటూ ఎన్నో కథలు చెప్తూనే ఉంటా.. ఒక తుది లేదు నాకు. గాలి కి ప్రయాణించే నా కాళ్ళకి నిలకడ ఉండదు.. ప్రతి క్షణం నాలో ఉన్న జ్ఞాపకాల లేఖకు చిరునామా లేదు. తాను మౌనంగా ఏకాంతంగా కేకలు వేస్తూనే ఉంది.. ఆ ఏకాంతం నాలో ఒక ప్రపంచాన్ని సృష్టించింది. ఆ ప్రపంచం నాకు నా నీడకే సొంతం. ఎవరికీ అనుమతి లేదు. చిన్నప్పుడు తినిపిస్తూ అమ్మ చందమామ ని రమ్మని చెప్పిన రాలేదు. కొన్నాళ్ల తరువాత కూడా ఎంతో ఆశపడిన ఆ జాబిల్లి చెంత చేరలేదు. కానీ వెన్నలలా తన జ్ఞాపకాల అనుభవానాన్ని అందిస్తూ జోలాలి పాడుతూనే ఉంటుంది.. ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను. దయచేసి నన్ను ఒంటరి అని అనద్దు అనుకోవద్దు.. నాలో జన్మ జన్మలు సరిపడా స్నేహాన్ని చేస్తున్న ఎన్నో స్మృతుల్ని మీరెవ్వరు ఎరుగరు..
ఒకరి ప్రేమ దొరకడం, ఒకరి తోడు దొరకడం నిజంగా ఒక వరమే. కానీ ఆ వరం ఎప్పుడు వస్తుందో అనే ఎదురుచూపులో నిన్ను నువ్వు వదులుకోకూడదు. ఎంతో మంది వస్తారు, జ్ఞాపాకాలను ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ జ్ఞాపకాల స్మృతులు నీలో ఉన్నంత వరకు నువ్వు ఒంటరి ఎలా అవుతావు.. ఒంటరితనం కూడా ఆనందంగా ఉంటుంది. అది మనం దృక్పథం లో ఉంటుంది. ఈ పాట ఆ ఒంటరితనం లో మరో కోణాన్ని చూపిస్తుంది. చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది. Its a visual poetry