Contributed by Sumanth Reddy Bagannagari
ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దానికి ఓ లాజిక్ ఉంటుంది. ఓ సైటింఫిక్ ఎక్సప్లేనేషన్ ఉంటుంది. కానీ ఏ లాజిక్, సైంటిఫిక్ ఎక్స ప్లేనేషన్ లేనిది అంటే అది ప్రేమ మాత్రమే. కొంతమంది తెలివైన వాళ్లు హార్మోన్ల గురించి, అడ్రీనల్ రష్ గురించి మాట్లాడుతారు ఎన్ని థియరీలు ఉన్నా, ఎప్పటికీ ఒక స్పెషల్ ప్లెజర్ ఇవ్వడం మాత్రం మ్యాజిక్ అనే చెప్పాలి అలాంటి ప్రేమ ఓ మనిషి తన జీవితంలోని ఇనీషియల్ డేస్ లో ఎలాంటి ఫిజికల్, ఎకనామికల్ క్యాల్కులేషన్స్ లేకుండా చాలా ప్యూర్ గా, మోస్ట్ ఎక్సైటింగ్ గా ఉంటుంది
అలాంటి ప్రేమని చెప్పడానికి ఇపుడు చాలా కమ్యూనికేషన్ మీడీయంలు ఉన్నాయి కానీ ఒకప్పుడు కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి అలాంటి ఒక ఇల్లాజికల్, క్యారీడ్ అవే బై ఎమోషన్స్ తొలి ప్రేమ లేఖ ఇది
“ఇలాగే రాయాలని తెలియదు ,అందుకే ఎలాగోలా రాసేస్తున్నా ఏవేవో చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పినా నీకు నచ్చేలా ఉండాలి అందుకే ఏదీ చెప్పలేక ఆగిపోతున్నా! నిన్ను చూసిన మొదటి క్షణం గుర్తులేదు కానీ నిన్నే చూడాలని ఉంది ఇన్ని రోజులు ఎవడైనా లవర్ తో మాట్లాడుతూ ఉంటే ‘ఎంట్రా ఇంత సోది పెడుతున్నాడు?’ అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు అర్థం అయింది కొన్ని సార్లు వినడానికి కూడా మాట్లాడాలని రోజూ అనుకునే వాణ్ణి ‘అసలీ చదువులన్నీ ఎందుకు?’ అని కానీ ఇప్పుడు అర్థం అయింది కొన్ని సార్లు మనసులో భావాలను రాయాల్సి వస్తుందని ఎవడైనా మరో జన్మ, చావడం, మళ్లీ పుట్టడం లాంటి సోది చెప్తే నవ్వుకునే వాణ్ణి కానీ ఇప్పుడు అర్థం అయింది నిన్ను చూసిన ప్రతి సారీ మరణించి మళ్లీ పుట్టొచ్చు అని ప్రేమ ఏంటో విచిత్రం! నీతో ప్రేమలో పడ్డాక మాట్లాడే భాష సీతారామశాస్త్రిని పొగిడే త్రివిక్రమ్ లా కవిత్వం బాట పట్టింది నీ పక్కన నడుస్తున్నప్పుడు నా గుండె ఒలింపిక్స్ లో 200 మీటర్ల రేసులో పరిగెడుతున్నట్టు వేగంగా కొట్టుకుంటుంది నీ మాట విన్న ప్రతిసారీ ఇళయరాజా పాటని ఎ ఆర్ రెహమాన్ రీమిక్స్ చేసి పాడినంత హాయిగా అనిపిస్తుంది ఇంకా ఎన్నో చెప్పాలనుంది కానీ భాష సరిపోవడం లేదు కొత్త భాష కనిపెట్టి రాయాలని ఉంది ఎన్ని భాషల్లో ఐ లవ్ యు అని చెప్పిన నీ చిరునవ్వు ముందు చిన్నబోతుంది కాబట్టి ఇక్కడితో ఆపాలనుంది..”
ఇలాంటి ఇల్లాజికల్, ఇర్రేషనల్ ప్రేమ కథలు, ప్రేమ లేఖలు మీ గతంలో కూడా ఉంటే, వర్తమానంలో గుర్తు చేసుకొని భవిష్యత్తు కోసం దాచుకోండి