Everything About the Misunderstandings We Have About Lord Rama!

Updated on
Everything About the Misunderstandings We Have About Lord Rama!
'రా' అంటే మన నోటి నుండి గాలి మాత్రమే కాదు చేసిన పాపాలు కూడా బయటకు పోయి ఆ పాపాలు మళ్ళి లోనికి రాకుండా 'మ' అంటు పెదవులు మూతపడతాయి...ఒక్కసారి భక్తి తో రామా అని పలుకుతే పాపాలన్ని తొలగిపొతాయి.. "రామ" నామంలో అంతటి గొప్పతనం ఉంటుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు భగవంతుడు ప్రతి కాలంలో అవతరిస్తాడు...దశావతరాలు అయిన మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, వెంకటేశ్వరావతారము, కల్క్యావతారము వీటిలో శ్రీరామావతారం ఏడవది.. ధశరదుడి సంతానంలో రాముడు మొదటివాడు.. మనిషికి ఏ మాయలు, సంబ్రమాశ్ఛర్యాలకు లోనుచేసే శక్తి లేదు... మహా అయితే మ్యాజిక్ చేస్తారేమో కాని మాయలు చేయలేరు... శ్రీరాముడు సాధారణ మానవునిగా తల్లి కడుపులో ఒక ఆకరానికి వచ్చేంతవరకు ఉండి భూమి మీద కూడా ఒక సగటు మనిషిగానే బ్రతికి జనులందరిని సన్మార్గానికి చూపించిన మంచి మనిషి... సకల కళలో ఉత్తముడు.. అందగాడు, ధైర్యవంతుడు, శక్తి వంతమైన వీరుడు, గొప్ప తెలివైన వాడు, నిత్యం సత్యాన్నే పలికేవాడు.. ఒక భర్తగా, తండ్రిగా, రాజుగా, యుద్ధంలో ముందుండే నాయకుడిగా ఇలా సకల విద్యలో ఆరితేరినవాడు.. మనలో చాల మందికి కొన్ని అపోహలున్నాయి వాటిని కొంతమంది సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్ల శ్రీరాముడిని కొందరు అపార్ధం చేసుకున్నారు.. వాటి గురుంచి నిశితంగా పరిశీరిస్తే.... వాలిని వధించడం: అన్న, తమ్ముల మధ్య పోరాటం జరుగుతుంటే రాముడు దొంగచాటుగా వాలిని తన బాణంతో చంపాడు అని… నిజానికి.. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడు బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. ఒక వేళ వాలి మరణించాడేమో అని ఆ రాక్షసుడు ఎక్కడ బయటకు వస్తాడో అని సుగ్రీవుడు పెద్ద బండరాయిని గుహముందు పెట్టి వాలి మరణించాడు అని.. రాజ్యాన్నీ హస్తగతం చేసుకుంటాడు.. గుహలో నుండి బయటకు వచ్చిన వాలి తనకు జరిగిన అన్యాయం గురుంచి సుగ్రీవుడిపై పోరాటానికి వస్తాడు.. సుగ్రీవుడు ఎంత నచ్చజెప్పినా, ఎంతలా ప్రాధేయపడినా సోదరుడని చూడకుండా సుగ్రీవుడుని చంపడానికి వాలి సిద్ధపడతాడు… తనకు న్యాయం చేయల్సిందని రాముడిని శరణు వేడగా శ్రీరాముడు చెట్టు పక్కన నుండి లౌక్యంగా వాలిని సంహరించాడు. సీత అగ్ని ప్రవేశం: రాముడు అనగానే ఏక పత్నీవ్రతుడు అనేమాట గుర్తుకొస్తుంది.. అలాగే సీతమ్మ తల్లి కూడా... సీతను శ్రీరాముడు కాక ఒక పరాయి మగవాడు కామంతో ముట్టుకుంటే తక్షణం బూడిదయిపోతాడు.. అంతటి అపర పతివ్రత సీత. ఈ విషయం శ్రీరాముడి తో పాటు అందరికి తెలుసు... కాని సీత గురుంచి తెలియని వారు రావణుడితో గడిపింది అని అపార్ధం చేసుకుని సీతను నిందిస్తే తట్టుకోలేని రాముడు.. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్ళే ముందుగా "అగ్నిపరీక్ష" నిర్వహిస్తాడు నిప్పులో నిలబడగానే అగ్నిదేవుడు ప్రత్యక్షమై "సీత పవిత్రురాలు" అని చెప్పి లోకానికి సీత గొప్పతనాన్ని తెలిసేలా చేస్తాడు..ఒక ఆడదాని Character చెప్పటానికి మనం "నిప్పు" అనే పదాన్ని వాడతాం ఏందుకుంటే పడతి సీతమ్మ తన నిజాయితిని ఈ ప్రపంచానికి ఏ అనుమానం రాకుండా చెప్పటానికి రాముని సహాయంతో అగ్నిపరీక్ష చేసిన కూడ పవిత్రమైన సీతకి ఏమికాదు.. నిప్పుకు చెదలు పట్టదు.. 14 సంవత్సరాల వనవాసంలో ఏ ఒక్కనాడు శరీరకంగ మనసికంగా కలవకుండ తల్లిదండ్రుల మాటకు విలువిచ్చిన సీతరాముల జీవితాలనుండి మనం చాలా నేర్చుకోవాలి.. సీత అడవుల పాలు: ఒక రాజ్యానికి నాయకత్వం వహించాలంటే అతనికి ఏ మకిలి అంటకూడదు ఆరోపన కూడా రాకుడదు... రాముడు పాలించిన రాజ్యాన్ని ఇప్పటికి ఎప్పటికి ఈ భూమి ఉన్నంత కాలం ఆదర్శమే ఒక చాకలి తిప్పడు చేసిన ఆరోపనలకు అతని చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఖండించకుండా మౌనంగా అంగీకరించినందుకు ప్రజల దృష్టిలో నాయకుడికి ఏ మకిలి ఉండకూడదు అంటూ సీతమ్మ తల్లిని అడవులకు పంపించినాడు... నిజానికి సీతమ్మ అనుభవించిన భాద కన్నా వెయ్యి రెట్లు శ్రీరాముడు అనుభవించాడు... కాని తను, తన ప్రాణం అయిన సీత కష్టపడ్డా కూడ.. తన పాలనకు ఏ మచ్చా రాకుడదు అంటు సీత, రామయ్యలు తమ ఆనందాలను త్యాగం చేశారు.. ప్రతి తల్లి తన కొడుకు రాముడుల ఉండాలని కోరుకుంటుంది ప్రతి భార్య తనకు శ్రీరామచంద్రుడు లాంటి ఏకపత్నివ్రతుడు రావాలని కోరుకుంటుంది.. చాల మంది రాముడిని దేవుడులా కొలుస్తారు... అయన ఆచరించిన ధర్మాన్ని ఆచరించలేని దమ్ములేని వాళ్ళు ఆయన్ని దేవుడు అంటు తప్పించుకుంటున్నారు.. శ్రీరాముడు జీవితం నుండి మనం తెలుసుకోవాల్సింది ఇదే..నిజానికి దేవుడు కన్నా ధర్మం గొప్పది, శ్రీ రాముడికి ఫుట్టిన రోజు పెళ్ళి రోజు మరియు పట్టభిషేక మహొత్సవ శుభాకాంక్షలు.