Necessity Is The Mother Of Invention! ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఒక కొత్త ఆలోచన వస్తుంది.. అ ఆలోచనే ఎంతో మందికి కొత్త ఉపాధినిస్తుంది, కష్టమైన అవసరాలను సులభతరం చేస్తుంది. తను ఎదుర్కున్న కష్టం ఇంకొకరు ఎదుర్కొనిఉండి ఉంటారు అక్కడ అవసరం ఉంటుంది ఆ అవసరంతోనే ఒక కొత్తరకమైన కంపెనీని ప్రారంభించింది చిత్తూరు జిల్లాకు చెందిన మంజు.
మంజు ఎమ్మెస్సి చదివి విప్రోలో పనిచేసేవారు పెళ్ళి తర్వాత భర్తతో కలిసి చిత్తూరు జిల్లా నగరిలో సెటిలయ్యారు. ఓ గుడి నిర్మాణం కోసం గ్రానైట్ రాళ్ళను లారీ ద్వారా పంపించాలనుకున్నారు. కాని లారీ వాళ్ళు ట్రాన్స్ పోర్టింగ్ కోసం ఎక్కువ డబ్బులు అడిగారు.. ఇలా కాకుండా రవాణా కోసం వెళ్ళి తిరిగి ఖాళీగా వెళ్ళె లారీలతో మాట్లాడితే సరుకును చాల తక్కువ ధరకే రవాణ చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది కాని అలా తిరుగు ప్రయాణం చేస్తున్న లారీల వివరాలు కనుక్కుందామని ప్రయత్నిస్తుంటే అస్సలు సరైన సమాచారం ఎక్కడా దొరకలేదు అలా ఐదు రోజులు ప్రయత్నిస్తే దొరికింది. వారు ఆ రాళ్ళను తరలించారు. కాని అప్పటినుండి మంజు మదిలో ఓ ఆలోచన మొదలైంది.. నాలాగే ఎంతోమంది అలా ప్రయత్నించి ఉంటారు అలా ఖాలీగా వెళ్ళే బదులు వారి వివరాలు తెలుసుకొని అవసరమైన వారికి అందిస్తే చాలా తక్కువ ధరకే వారి సరుకును ట్రన్స్ పోర్ట్ చేసుకోవచ్చు కదా అని..
LorryGuru.com అనే వెబ్ సైట్ ని 2012లో స్టార్ట్ చేసి అలా రిటర్న్ లో ఖాలీగా వెల్లే లారీల వివరాలు తెలుసుకొని అవసరమైన వారికి అందించడం మొదలపెట్టింది.. అలా మొదట ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమై 36మందికి చేరుకుంది. లారీ ఓనర్లు, డ్రైవర్లు కలిపి దాదాపు 10,000 వరకు ఉన్నారు. నిత్యం వారు ఏ చోటునుండి ఎక్కడికి వెళ్తున్నారో సమాచారం తెలుసుకుంటారు. ఆ వివరాలు తెలపడం, కమ్యూనికేషన్ వ్యవస్థను స్థాపించడం వల్ల ఈరోజు మంజు ఆదాయాన్ని సంపాదిస్తుంది. తను మాత్రమే కాదు తక్కువ ధరకు వినియోగదారులకు ట్రన్స్ పోర్ట్ అందిస్తుంది, లారీ యజమానులకు ఇతర ఆదాయాన్ని అందిస్తుంది. కేవలం లారీలకు సంబంధించిన సమాచారం మాత్రమే కాదు.. ఆర్టీఏ, ట్రాఫిక్ పాస్‌లు, తాత్కాలిక పర్మిట్లు ఎలా తీసుకోవాలి? లారీని ఎలా అమ్మొచ్చు..? ఎక్కడ కొనుగోలు చేయొచ్చు.. కొత్తగా వచ్చిన లారీల మోడళ్లు ఇలా అన్నీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. లారీసేవలంటే చటుక్కున ‘లారీ గురు’ గుర్తొచ్చేలా చేయాలన్నదే మంజు లక్ష్యం..!
మంజు ఇదంతా ఒక్కరోజుకే సాధించలేదు మొదట లారీ యాజమాన్యం దగ్గరికి వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన విని పగలబడి నవ్వారు, ఇది సాధ్యం కాదని తీసిపారేశారు, తమ వ్యాపారానికి నష్టం రావొచ్చని తాగివచ్చి బెదిరించారు కాని మంజు వీటన్నీటికి భయపడి వెనకడుగు వెయ్యలేదు..! వాటిలోని లాభాలను వారికి వివరించింది ఎవరైతే మంజును ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వారే తన వెబ్ సైట్ లో సభ్యత్వం తీసుకొని లాభపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.