ఆశయ ప్రయాణంలో గెలిచి ప్రేమ ప్రయాణంలో ఓడిపోయాను - A Short Story

Updated on
ఆశయ ప్రయాణంలో గెలిచి ప్రేమ ప్రయాణంలో ఓడిపోయాను - A Short Story

Contributed By Govind Yelubolu

గమ్యం అనే గమనంలో నా వెనుక ఉండి వెన్ను తట్టి నన్ను ప్రోత్సాహించి, తీరా విజయం నాకు చేరువ అవుతున్న సమయంలో తను ఒక మలుపు దగ్గర ఆగిపోయింది.

నేను విజయం అందుకున్నాకా తెలిసింది తను ఆగిన మలుపు తన పెళ్లి అని... చేసేది ఏమి ఉంది బాధ పడే మనస్తత్వమే కానీ బాధ పెట్టె మనస్తత్వం కాదు అందుకే ఇంకా ఇంకా ఆ బాధ పడుతున్న ...

చూసిన ప్రతి అమ్మాయిలో తన పోలిక వెతుక్కుంటూ నచ్చిన ప్రతీ అమ్మాయి తనలా లేదంటూ,

మరచిపోలేను అందుకే రాసె 10 కవితలలో ఎక్కువ శాతం తన పోలికలు ఉండేలా, ఊహ రూపంలో తనని ఊహించుకొని రాస్తూ..

మనిషిగా కొంతమందికి తప్పదు మనసు ఒకరికి చెల్లించిన మనిషిగా ఇంకొకరికి చెల్లించుకోవడం.

ఇది జీవితం. ఒకరి తో ఆగేది కాదు అలా ఆగిపోయేది అయితే ఇక్కడ వరకు వచ్చేది కాదు. వచ్చాక ఇది నీది కాదు అంటే వినేది కాదు.

పిలుస్తా నా కోసం ఆ దేవుడు పంపిన ఆ దేవతని, ప్రేమగా పిలవకపోవచ్చు కానీ పిలిచాక కచ్చితంగా ప్రేమని ఇస్తా. ఎందుకంటే ఒకసారి ప్రేమ ఇచ్చి ఓడిపోయా ఈసారి అలా ఓడిపోవాలి అనుకోవడం లేదు అందుకే గెలిచి ప్రేమని ఇస్తా.

తను తనకి తెలిసి వచ్చిన తెలుయకుండా వచ్చిన తనే యువరాణి తన పిలుపే మేల్కొలుపు. ఆమె సహాయంతో ఆశయంలో గెలిచాను ఆమెని గెలవాలి అనే ప్రేమ ఆశలో ఓడిపోయాను ఇక ఎవరు వచ్చిన గెలిచి ప్రేమించుకుంటా.