Contributed by Anamika GS
నా పరిస్థితి bigboss లో కంటెస్టెంట్స్ లా ఉండండి. గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకుంటే గొప్ప నిధి. ఈ ఆలోచనే అంతుచిక్కకుండా ఉంటే అలాంటి క్షణమే వస్తే?? చేయాలనే తపన.. ఎలా చేయాలో తోచని అవస్థ అంటే ఇదేనేమో. నేను ఇక్కడ bigboss గురించి చెప్పడానికి రాలేదండోయ్!!! నా కథ ఏంటో చెప్దామని వచ్చా !! నేనూ మీరందిరిలా మానసిక సంఘర్షణ తో జీవించే సామాన్య మానవుడిని. నాకు వచ్చిన అవకాశం ఏంటి?? ఇంతకీ నిధి దొరికిందా లేదా ?? వీటి వాళ్ళ నేను పడ్డ సంఘర్షణ ఏంటో మీరే చుడండినేను : అమ్మ ని సంతోషపెట్టే గొప్ప అవకాశం. ఈ పుట్టినరోజు తనకి మరపురాని రోజుల ఉండేల నా ప్రేమ ఎంత ఉందొ తెలిసేలా ఓ పెద్ద కనుక ఇవ్వాలి.అనుకోడానికి బాగున్నా ఏం ఇవ్వాలో తోచని స్థితి. తెలివికి పదును పెట్టాల్సిందే. నాలోని నేను : ఏడ్చావ్ !! ఇలాగే గొప్ప కి పోయి నువ్వు చేసే పనులు ఆగిపోయిన పెళ్లి కి బ్యాండ్ బాజా వాయించినట్టు ఉంటుంది. నేను : వచ్చావా !! ఇంకా రాలేదేంటి మధ్యలోకి అనుకున్నా నువ్వూ నీ పబ్లిసిటీ స్టంట్ లూ. కానీ ఆలస్యం దేనికి మొదలెట్టు. నాలోని నేను : అయ్యిందా ఇంకా ఏమైనా ఉందా. అసలు అమ్మ చిరునవ్వు అనే నిధి రావాలంటే మనసు నుండి రావాలి. ఇది నీకు అర్థంకానిది అంతుపట్టనిది. నేను: నువ్వూ నీ లోతైన భావాలూ. సులభంగా జీవిస్తే టాక్స్ వేస్తారా మీ ఊర్లో !! ఇలాగే తెలిసి తెలియని ఉరకల వల్ల ఊహకు అందని సత్యాలు గుర్తించవు. గుడ్డి గా నమ్మడం అలాగే ఎదురుదెబ్బలత్తో తిరిగిరావడం. గాయం నీకు బాధ అమ్మ కి. నాలోని నేను : ఇదిగో free గా వచ్చిందని నీలాంటోడె phenoil తాగిండట. సులువు కదా అని సలహా ఇవ్వడం కాదు నువ్వెంతవరకు సబబో అది చూడు ముందు. గర్వం, అన్నీ తెలుసనే అహంకారంతో కళ్ళు నెత్తి మీద ఉన్నట్లు ప్రవర్తించడం చిక్కుల్లో పడడం తమరికి కొత్త కాదుగా. పడడం తమరి వంతైతే.. కష్టపడడం అమ్మ వంతు అయిపోయింది నేను: నువ్వు అన్నది నిజమే. దారి తెలియని బాటసారిలా ఉన్న నాకు లక్ష్యం అనే కొత్త ప్రపంచం పరిచయం చేసిన గురువు అమ్మ. తనకి నేను ఇవ్వగలిగినది ఒద్దికతో పట్టుదల వీడకుండా ఈ కొత్త ప్రపంచ మజిలీని చేరుతాననే మాట. తాను పడిన కష్టానికి ఇదే నేను ఇవ్వగల ప్రతిఫలం. నాలోని నేను : అవును.. ఎదురుదెబ్బలు తిని గాయపడిన నాకు స్థిరత్వం అనే మందుతో అసలైన సంతోషాన్ని పరిచయం చేసిన శక్తి అమ్మ. తన భావాలతో కొత్తగా ఊపిరి పోసుకున్న నేను అమ్మ ఇచ్చిన ఈ కొత్త జీవితం లో ఊగిసలాటను వీడి పరిశీలనను అలవరుచుకుంటాను. నా ఈ ప్రయత్నమే అమ్మ పడిన తపన కు నేను ఇవ్వగల కృతజ్ఞత.
నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ కి నా కానుక ఈ రోజు తెలియకపోవచ్చు. అంతుపట్టలేని శాశ్వత సంతోషం అనే నిధి అమ్మ కి ఇవ్వాలన్న నా విశ్వాస ప్రయత్నానికి ఇదే మొదలు. నిధి చేరుకునే రోజుకై..... శ్రమతో కూడిన కాంక్షతో.....
ఇట్లు, ఓ సామాన్యుడు.