Here Is How Hyderabad Is Grossly Lagging Behind In Its Swacch Bharat Efforts!

Updated on
Here Is How Hyderabad Is Grossly Lagging Behind In Its Swacch Bharat Efforts!

Article Info source: The Hans India

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన మనసు, ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి అవ్వే మనల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అని బలంగా నమ్ముతారు మహాత్మ గాంధీ.. ఆయనను స్పూర్తిగా తీసుకునే మన ప్రధాని నరేంద్రమోడి 2014 అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలో అంటే 2019 కల్లా Clean and Green భారత్ ను చూడాలని ప్రయత్నిస్తున్నారు. మిగితా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో పరిస్థితి మాత్రం దారుణంగానే ఉంది.! అది ఎంతలా అంటే మన హైదరాబాద్ జనాభా 1.2కోట్లు(సమగ్ర కుటుంబ సర్వే) ఉంది కాని వారికి GHMC Toilets మాత్రం కేవలం 500 ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్ లేవు.!

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 200 Modern prefabricated(ఒక్క మోడ్రన్ టాయిలెట్ నిర్మాణానికి 5 లక్షలు ఖర్చు) టాయిలెట్స్ నిర్మించాలని అధికారులు నిర్ణయించుకున్నా కేవలం ఇప్పటి వరకు 109 టాయిలెట్స్ మాత్రమే నిర్మించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెం1 రాష్ట్రంగా దూసుకుపోతుంది దేశ విదేశీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి మన హైదరాబాద్ ను వేదికగా చేసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిలో మన హైదరాబాద్ ను శుభ్రంగా చూసుకోవాలి.

రోడ్డు పక్కన టాయిలెట్స్ కంపు కొడుతుంటే చేసిన వారిని తిట్టుకుంటాం లేదంటే ఫైన్ కట్టించుకుంటాం నిజానికి పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు లేండి కనుచూపు మేరలో టాయిలెట్స్ లేకుంటే రోడ్డు పక్కనే చేస్తుంటారు. సరైన సంఖ్యలో అన్ని ప్రదేశాలలో టాయిలెట్స్ ఉంటే ఏ ఒక్కడు అగౌరవంగా రోడ్డు పక్కన చేయరు. ఉన్న ఆ కొన్ని టాయిలెట్స్ ఐనా కరెక్ట్ గా Maintain చేస్తున్నారా అంటే అది లేదు Public Toilets లోకి వెళ్ళగానే అక్కడి Maintenance కి Smell కి కళ్లు తిరిగిపోతాయి అంత దారుణంగా ఉంది పరిస్థితి. సరైనసంఖ్యలో టాయిలెట్స్ నిర్మాణం చేయండి ఆ తర్వాత స్వచ్చ భారత్, Fine గురుంచి మాట్లాడుకుందాం..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.