Vennelakanti, The Lyricist Behind Those Memorable Tamil Dubbed Super Hit Songs!

Updated on
Vennelakanti, The Lyricist Behind Those Memorable Tamil Dubbed Super Hit Songs!

అచ్చ తెలుగు పాటల వెన్నెలక౦టి

తెలుగు సినీవినీలాకాశ౦లో ఎ౦తో మ౦ది రచయితలు తమ రచనలతో ప్రేక్షకులను అలరి౦చారు.దాదాపురె౦డున్నర దశబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో పాటలను రాస్తూ. అటు అనువాద చిత్రాలకు సాహిత్యాన్ని అ౦దిస్తున్నఅతి కొద్దిమ౦ది రచయితలలో ఒకరు మన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు.

అనువాద చిత్రాల్లో సాహిత్యాన్ని మనమెప్పుడు సరదాగానే తీసుకుంటాం. కొన్ని పాటలు నిజానికి సరదాగానే ఉంటాయ్, దానికి కారణం రచయిత అసమర్ధతో, అనుభవ రాహిత్యమో కాదండి ఆ పాట మాతృకలో వాడిన పదాలకు, సందర్భాన్ని ఆ రాగానికి తగట్టుగా తెలుగులో అంత కన్నా ఖచ్చితంగా దొరికే పదాలు లేక. వెన్నెలక౦టి లాంటి గారు అనువదించిన చాలా పాటల్లో ఉన్న సాహిత్యం స్థాయిని అందుకోలేని మనం వాటిని కూడా అతి సులభంగా సరదా చేసేస్తుంటాం. మాకనిపిస్తుంది ఆయన కలానికి అందాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే ఆయన అనువదించిన పాటల్లో గొప్ప సంగీతంతో పాటు గొప్ప సాహిత్యం ఉన్న వాటిని తెలియచెప్పాలని నిశ్చయించుకొని ఓ చిరు జాబితా తయారు చేసాం.

vennalakanti14

vennalakanti15

vennalakanti13


vennalakanti12

vennalakanti11

vennalakanti10

vennalakanti6

vennalakanti1


vennalakanti2

vennalakanti5

vennalakanti4

ఇక తెలుగు సినిమా కోస౦ వెన్నెలకంటి కలం నుండి జాలువారే పదాలు అమాస నిశిలో కూడా వెన్నెల అల్లరిని దరిచేర్చుతాయి, మండు వేసవిలో మేఘాల నీడలు చూపిస్తాయి, ఉక్కపోతలో చల్లటి గాలిని సృష్టిస్తాయి. చిరు జల్లుల సవ్వడి, జోరు వాన అలజడి, హోరు గాలి వేగం, తొలిప్రేమ పరవశం, విరహ వేదన, చిలిపి సరదాలు, కొంటె కలహాలు, సంసారుల ఇక్కట్లు, ప్రేమికుల సరసాలు, సాంప్రదాయాల గొప్పతనం, తెలుగువారి మంచితనం... ఇలా ప్రతీ అ౦శాన్ని పొ౦దుపరచట౦ ఆయన సాహిత్య గొప్పతన౦.

ఆయన రాసిన ఆణిముత్యాలు
vennalakanti9


vennalakanti8

vennalakanti7

vennalakanti3

ఆయన అనుభవం సాహిత్యం మీద ఆయనకున్న జ్ఞానం మరెందరికో తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన కలం జ్ఞానాన్ని చాలా సార్లు పాడుతా తీయగా కార్యక్రమమే లో బాలు గారు ప్రస్తావించారు అందులో ఒక చిన్న ఎపిసోడ్ ఇది.

https://youtu.be/t5nBBMQZfCE

తెలుగు పాటల సాహిత్యం గురించి, రచయితల కలం పదును గురించి చెప్పుకుంటూ పోతే వినలేనంత, రాసుకుంటూ పోతే చదవలేనంత, చిత్రించాలంటే కళ్ళు సరిపోనంత ఉంటుందండి. వెన్నెలకంటి గారి రెండు దశాబ్దాల పైగా సాగిన ప్రయాణంలో ఇవే గొప్పవి అని కాదు, మా అజ్ఞానంలో అద్భుతమైన పాటల్ని వదిలేసుంటాం కింద కామెంట్లో తెలియచేయండి.