Meet The Guys Who Created The First Ever "Made-In-Telangana" Pollution Free Auto Rickshaws!

Updated on
Meet The Guys Who Created The First Ever "Made-In-Telangana" Pollution Free Auto Rickshaws!

Globalizationతో ఈ ప్రపంచం రాకెట్ వేగంతో మారిపోతుందండి.. ప్రతిరోజు మన ఊహకందని ఎన్నో కొత్త Inventions వచ్చేస్తున్నాయి.. ప్రతి ఒక్క Sectorలో Revolutionary Changes జరుగుతున్నాయి. ఈ ప్రపంచ ప్రయాణంలో గత 25 సంవత్సరాలలో ఎంతో మార్పును మనం చూస్తున్నాం.. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు అందుతున్నాయి కాని ఇందుకు తగ్గట్టే వాతావరణంలో కూడా ఎంతో మార్పును చూస్తున్నాం. ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది కాని ప్రకృతిని హింసించడంలో..

15497609_1483996341615007_2083829366_n

వాతావరణాన్ని పాడుచేయడం అనేది మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకోవడం లాంటిది.. దీనిని సాధ్యమైనంత వరకు అదుపు చేయాలి.. ఇదే దృష్టిలో ఉంచుకుని మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన యువకులు తెలంగాణలోనే మొట్ట మొదటి Eco Friendly Auto Rickshaw Manufacturing Company స్థాపించి కొన్ని నెలలలోనే వంద వాహనాలను తయారుచేసేంతటి స్థాయికి ఎదిగారు. "మధుకర్ రెడ్డి, భరత్ మామిడోజు" ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరికి ఒకే లక్ష్యం ఉండేది.. "సమజానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి రుపోందించాలని.. అదే లక్ష్యంతో "Make In India, Made In Telangana" Conceptsతో స్పూర్తి చెంది, ఈ మార్గాన్ని ఎంచుకుని Adapt Motors Manufacturing Companyని స్థాపించి Battery ఆధారంతో నడిచే ఆటోలను తయారుచేస్తున్నారు.

15515639_1483996324948342_1253710216_o

2014లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మధుకర్, భరత్ దాదాపుగా 2సంవత్సరాల పాటు వీటి మీద అధ్యయనం చేసి 2016లో పూర్తిస్థాయిలో ఈ ఆటోలను రూపొందిస్తున్నారు. ఈ తరహా కంపెని మన తెలంగాణలో ఇదే మొట్ట మొదటిది. ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 500 ఆటోలను రుపొందించారు. ఈ ఒక్క సంస్థ స్థాపనతో వీరి రెండు కలలు నెరవేరాయి. ఒకటి ఉపాధి లభించడం, మరొకటి సమాజానికి ఏదోరకంగా ఉపయోగపడాలనే వారి బలమైన ఆశ కూడా నెరవేరడం. ఈ ఆటోల వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయండి.. Air Pollution ఉండదు, Sound Pollution ఉండదు.. అంతేకాకుండా Goods Travelling Expenditure కూడా చాలా వరకు తగ్గి నిత్యావసరాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా పెట్రోల్ డిజిల్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాని వీటికి 3 నుండి 4 గంటల పాటు చార్జ్ చేస్తే సుమారు 100కిమీ పైగా నడిచేలాగా దీనిని రూపొందించారు.

13438917_1621534614823340_3921159201549841350_n

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.