ఎక్కడ న్యాయం అన్యాయం అవుతుందో ఎక్కడ ధర్మం అధర్మం అవుతుందో అక్కడ నేను అవతారం ఎత్తుతానని భగవంతుడు వాగ్ధానం చేశాడు. అందుకు అనుగూణంగానే భగవానుడు దశావతారాలు ఎత్తాడు. ప్రతి ఊరిలో వివిధ అవతారాల ప్రతిమలోనే దర్శనమిస్తారు, కాని శ్రీ మహా విష్ణువు రూపంలో ఉన్న దేవాలయాలు చాల తక్కువ. వైకుంఠంలోని పాలకడలిలో శేష తల్పంపై శేయనించి శ్రీదేవి భూదేవి సమీతంగా ఉన్న ఆ మహా విష్ణువు నిజరూపమే మన మహబూబ్ నగర్ లోని శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనం.

ఈ పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రానికి సమీపంలో శ్రీరంగాపురం గ్రామంలో ఉంది. పూర్వం వనపర్తి సంస్థానానికి చెందిన రాజు తమిళనాడు లోని ప్రఖ్యాతి శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఆ మహిమాన్విత దేవాలయాన్ని చూసి పరవశించిపోయి ఇంతటి గొప్ప ఆలయం తన రాజ్యంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని తపన పడ్డారు. ఆ తపన భగవంతునికి చేరి ఆ రాజు కలలో దర్శనమిచ్చి "నేను నీ రాజ్యంలోనే ఫలాన చోట స్వయంభూ గా వెలిశానని నీ కోరిక తగ్గట్టుగా ఇక్కడ పుణ్యక్షేత్రం నిర్మించు" అని తెలియజేశాడు.

స్వప్నంలో చెప్పిన ప్రదేశంలో పరిశీలించగా శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనం కలిగింది, ఆ మహదానంలో ఈ గుడిని 1670 కాలంలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఇక్కడి శిల్ప సౌందర్యం. రాతి మీద అద్భుతంగా చెక్కిన శిల్పాలలో జీవం కనిపిస్తు కనువిందు చేస్తుంది. 67 అడుగుల ఆలయ గాలి గోపురం, 20 అడుగుల గోపుర ప్రవేశ ద్వారం ఇక్కడ అదనపు ఆకర్షణ. ఇక్కడ తమిళనాడులోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో జరిగె పూజలు, ఉత్సవాలు దాదాపు అన్ని జరుగుతాయి. ఇక్కడికి మన తెలుగు రాష్టాల నుండే కాకుండా చుట్టుపక్కల రాష్టాల భక్తులు కుడా దర్శించి తరిస్తారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.