కొన్ని వేల ఏళ్లుగా గూడుకట్టుకు పోయిన మూడనమ్మకాలు, కొన్ని వందల ఏళ్లుగా కదలనివ్వని బానిసత్వ సంకెళ్ళు, మనిషిని మనిషిగా చూడని సమాజం, ఎదురుగా రవి అస్తమించని సామ్రాజ్యం, వీటన్నిటికి ఎదురు తిరిగి గెలిచిన వీరుడు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఒంటరిగా గెలిచేవాడు వీరుడు, తనని నమ్మిన వాళ్ళని కూడా గెలిపించె వాడు నాయకుడు. హింసతో కూడిన యుద్ధం చేసే వాడు యోధుడు మరి అహింసనే యుద్దంలా చేస్తే అతన్ని దేవుడు అనాలేమో. ఆ విధంగా చూస్తె చరిత్రలో అప్పటివరకు చూడని, ఇంకెప్పటికి చూడలేని నాయకుడు, దేవాలయాలు హారతులు పూజలు అందుకొని దేవుడు గాంధీజీ. గాంధీజీ తానూ నమ్మిన సిద్ధాంతాలను, ఏర్పరుచుకున్న నియమాలను, సృష్టించుకున్న కట్టుబాట్లను, రాసుకున్న సూత్రాలను విడిచి ఎప్పుడు బ్రతకలేదు. వ్యక్తిత్వానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చారు అనటంలో సందేహం ఏ మాత్రం లేదు.
1. గాంధీజీ ని మహాత్మా అని మొదటగా సంబోదించినది రవీంద్రనాథ్ టాగోర్. 1915 లో గాంధీ గారు శాంతినికేతన్ వెళ్లి టాగోర్ గారిని నమస్తే గురుదేవ్ అని పిలిచారట, దానికి టాగోర్ గారు "నేను గురుదేవ్ అయితే మీరు మహాత్మా" అన్నారట.
2. జాతి పిత అని మొదటగా సంభోదించినది నేతాజీ సుభాష్ చంద్రబోసు. 1944 లో జాతీయ ఆర్మీ మార్చ్ మొదలైన సందర్భం లో అలా పిలవటం జరిగింది.
3. 1948 గాంధీజీ ని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసారట, ఆ సంవత్సరమే ఆయన చనిపోవటంతో ఆ ఏడాది శాంతి బహుమతి ప్రధానం చేయలేదు.
4. గాంధీజీ తన జీవితకాలంలో రోజుకు సుమారుగా 18 కిలోమీటర్ లు నడిచేవారట. అలా చేస్తే భూమధ్య రేఖ మీదుగా భూమి చుట్టూ రెండు సార్లు తిరిగి రావచ్చు.
5. స్టీవ్ జాబ్స్ కి గాంధీజీ అంటే అమితమైన గౌరవం ఇష్టం, తన ఇష్టానికి గుర్తుగా గాంధీజీ వాడిన కళ్ళజోడు తరహా జోళ్ళు వాడేవాడు స్టీవ్ జాబ్స్.
6. గాంధీజీ కి హిట్లర్, టాల్స్టాయ్, ఐన్స్టీన్ తో దగ్గరి పరిచయం ఉండేది. ఒకసారి యుద్ధం గురించి ఆలోచనించమని హిట్లర్ ని లేఖ ద్వారా కోరటం జరిగిందట.
7. గాంధీజీకి ఫోటోలు అంటే ఇష్టం ఉండేది కాదు. చిత్రంగా ఆ కాలం లో అత్యదికంగా ఫోటోలు ఉన్న వ్యక్తీ గాంధీగారు.
8. ఆయన తన జీవిత కాలం లో ఎప్పుడు విమానం ఎక్కలేదు. మాతృభాష గుజరాతి అంటే అమితమైన ఇష్టం, ఆయన జీవిత చరిత్రని గుజరాతిలో రాసి తర్వాత ఆంగ్లీకరించారు.
9. 2007 లో ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.
10. 1930 టైమ్స్ పత్రిక మాన్ అఫ్ది ఇయర్ గా గాంధీ ని ఎన్నుకుంది. 1999 లో అదే పత్రిక ప్రకటించిన మాన్ అఫ్ ది సెంచరీ జాబితా లో రెండో స్తానం పొందారు గాంధిజీ.
11. 1987 లో మొదటిసారిగా గాంధీ గారి బొమ్మతో 500 రూపాయల నోటు ముద్రించారు. 1997 నుండి అన్ని నోట్లపై గాంధీ గారి బొమ్మ వేయటం మొదలెట్టారు. మన నోట్లపై ఉండే గాంధీజి బొమ్మ 1946 లో దిగిన ఫోటో నుండి తీసుకున్నారు.
12. ఎవ్వరికి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడో వాళ్ళే 1969 లో గాంధీజీ శతజయంతి సందర్భంగా బ్రిటిష్ గవర్నమెంట్ తపాల బిళ్ళని విడుదలచేసింది.
13. నెహ్రు కూతురు ఇందిరా, ఫిరోజ్ అనే ముస్లిం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహాలు ప్రోత్సహించే గాంధీజీ, నెహ్రు బాధపడటం చూడలేక ఫిరోజ్ ని ఫిరోజ్ గాంధీ గా పేరు మార్చుకోమని చెప్పారట.
14. మన దేశంలో 53 ప్రధాన రహదారులు, వేరే దేశాల్లో 48 రహదారులు గాంధీజీ పేరుతో పిలవబడుతున్నాయి.
15. 1921 వరకు గాంధీజీ అందరిలానే దుస్తులు ధరించేవారు, 1921 లో తమిళనాడు లోని మధురై వెళ్ళినప్పుడు అక్కడి పేద వాళ్ళు పంచె మాత్రమె కట్టుకొని రావటం తో అప్పటి నుండి ఆయన కూడా కేవలం పంచె మాత్రమె వాడేవారు.