This Love-Hate-Love Story Explains That We All Need A Person When We're Struggling With Life - Part 2

Updated on
This Love-Hate-Love Story Explains That We All Need A Person When We're Struggling With Life - Part 2

Contributed By Hareesh Neela

Part 1: Click Here ప్రదీపిక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో అనుమానం వచ్చి వెంటనే తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు. FLAT .NO 286 డైరెక్ట్ గా తన ఫ్లాట్ కి వెళ్లి డోర్ బెల్ కొడతాడు, డోర్ తీయగానే ,అరవింద్ ని చూసి ఆశ్చర్యం తో నువ్వా ...?,నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ ..?? అని డోర్ వేయబోతుంది. ప్రదీపిక ప్లీజ్ ఆగు ,కొంచెం మాట్లాడాలి నీతో..!!! నాతో మాట్లాడటానికి ఏం లేదు అని మొహం మీద డోర్ వేస్తుంది. అరె ఒకసారి నేను చెప్పేది విను అంటూ క్లోజ్ చేయకుండా డోర్ పట్టుకుంటాడు. "నాకు క్యాన్సర్ ,లివర్ క్యాన్సర్ ...!!!" వాట్…….?

నేను చెప్పేది సీరియస్,నాకు ఉన్నదే కొద్దీ టైం,ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలీదు ,అప్పుడు బ్రేకప్ చెప్పి వదిలి వెళ్ళిపోయింది కూడా అందుకే ,అలా ఐన నా మీద కోపం తో నన్ను మర్చిపోతావ్ అని అలా చెప్పా. ఐ యామ్ సారీ, డోర్ ఓపెన్ చేసి లోపలి రమ్మంటుంది. పర్లేదు ,కావాలని నేను తెచ్చుకుంటే బాధ పడాలి కానీ ,నా ప్రమేయం లేకుండా వచ్చినదానికి నేను ఏం చేయగలను ..? అంటూ సోఫా లో కూర్చుంటాడు. ఒక్క క్షణం తన గురుంచి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి ఆలోచించి,లోపలికి వెళ్లి రెండు గ్లాసుల్లో కాఫీ కలుకుపుకుని వచ్చి ఒకటి అరవింద్ కి ఇస్తుంది. "తెలిసిన వాళ్ళను అయితే ఏం తీసుకుంటారు అని అడుగుతారు ,అదే మన అనుకుంటూనే కదా వాళ్ళ ఇష్టాలని గుర్తు పెట్టుకుని ఇలా అడగకుండా తెచ్చి ఇస్తారు"

తాను ఏం మాట్లాడకపోవడం తో ," ఏంటి ఇల్లంతా ఇలా చిందర వందర గా ఉంది" అని సర్దటం మొదలుపెడతాడు. కాఫీ తాగుతూ " ఏమో నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది ఈ మధ్య వదిలేయి అవి అక్కడ ". అరవింద్, తను వద్దన్నా వినకుండా అలానే సర్దుతూ " ఎపుడూ ఐన గమనించావా ,ఏది ఐన మన దగ్గర ఉన్నపుడు దాని విలువ మనకి తెలీదు ,తెలిసేలోపు అది మన దగ్గర ఉండదు " నా గురుంచి అంటున్నావా ..?

నీ గురుంచే అని కాదు ,మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు కాబట్టి మనకు జీవితం విలువ తెలియట్లేదు ,అదే అందరికి వాళ్ళ పుట్టిన రోజు తెలిసినట్టు ,వాళ్ళ చనిపోయే రోజు కూడా తెలిస్తే ,గుర్తుపెట్టుకుని బ్రతుకుతారు కాబట్టి ప్రపంచం ఇంకొంచెం బావుండేది అని అనిపిస్తది.కాలేజ్ లో ఉన్నప్పుడే క్యాన్సర్ గురించి తెలిసింది ,6 నెలలు నరకం అనుభవించాను,ఒక్కడినే రూమ్ లో చీకట్లో బ్రతికే వాడిని ,ఎవరు హెల్ప్ చేయలేదు ,నేను నిన్ను వదిలేసినా ,నీ జ్ఞాపకాలు,నీ గుర్తులు ,నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ నన్ను వదల్లేదు.నువ్వు ఒక బుక్ ఇచ్చావు గుర్తుందా " సీక్రెట్ " అని ,మనం ఆలోచించే ప్రతి ఒక నెగెటివ్ ఆలోచనని బాలన్స్ చేయాలంటే నాలుగు సార్లు పాజిటివ్ గ ఆలోచించాలంట.అది చదివాకా ఎంత తప్పు చేసానో ,ఎంత టైం వేస్ట్ చేసానో అప్పుడు అర్ధం ఐంది.ఇంకా అపుడే డిసైడ్ అయ్యాను ,ఎన్ని రోజులు ఉంటానో తెలీదు కానీ ఉన్న అన్ని రోజులు సంతోషంగా ఉందామని గట్టిగ మనసులో అనుకున్నాను,చేయాల్సిన గోల్స్ అన్ని లిస్ట్ రాసుకున్న ,ఆ లిస్ట్ లో లాస్ట్ గోల్ నువ్వే ,నిన్ను కలవడం ,నీతో కలిసి ఉండటం ,అందుకే వచ్చాను నీ దగ్గరికి . " మాట ఇచ్చి చివరి వరకు నీతో ఉండలేకపోయాను ,ఇప్పుడు అదే నా మాటకు వాల్యూ ఇచ్చి నేను పోయేవరకు నాతో ఉంటావా ప్రదీపిక ..?" అరవింద్ " నిజంగా ,నువ్వు నీ గురుంచి చెప్తుంటే ,నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ని నువ్వు చదువుతున్నట్టు అనిపించింది".ఇద్దరిది ఒకే పరిస్థితి ,కానీ కష్టమైన అది దాటి నువ్వు ముందుకు వెళ్ళావు,నేను ఇంకా దాని చుట్టే పట్టుకుని తిరుగుతూ ఉన్నాను.

నీకు ఏం జరిగింది ..? "డిప్రెషన్…!!!!! "జరిగింది కాదు,నేను అడిగి మరి తెచ్చుకున్నది అని ఇప్పుడే అర్ధం ఐంది. పిచ్చా...నీకు డిప్రెషన్ ఏంటి ప్రదీపిక ..? నేను ఇష్టం లేక వద్దు అని నువ్వు వెళ్ళిపోయావు,కలిసి ఉండటం ఇష్టం లేక మా అమ్మ నాన్న విడిపోయారు,ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఇంకా అన్ని ఒకే సారి ఇలా జరుగుతుంటే నాకు నేనే తెలీకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. "నీ పెయిన్ నిజమే కానీ,దానికి నువ్వు ఎంచుకున్న పాత్ మాత్రం కరెక్ట్ కాదు ",ఈ డిప్రెషన్ అనేది మనం తీసుకోని డబ్బుకి వడ్డీ కట్టడం లాంటిది అంటూ ఇల్లు అంత సర్దటం పూర్తి చేసాడు.

నాకు ఇపుడు ఇపుడే నిజం అని అనిపిస్తుంది అరవింద్,మనం ఏది ఐన కోల్పోతే దేవుడు ఇంకా అంత కన్నా మంచిది,గొప్పది ఎదో రాసిపెట్టి ఉంటాడు అని అందరు అంటారు కానీ నా విషయం లో నేను కోల్పోయినదే తిరిగి వచ్చేటట్టు రాసిపెట్టాడు ఏమో,అప్పుడు పోయిన నువ్వు ,ఇప్పుడు నేను కోల్పోయిన నా జీవితం తో సహా.

"ఒక గంట క్రితం నీ రూమ్ ఎంత గందరగోళంగా ఉందొ గుర్తుందా ..? మరి ఇప్పుడు చూడు ఎంత నీట్ గా ఉందొ ?,నీ బ్రెయిన్ లో ఆలోచనల్ని కూడా అంతే నీట్ గా సర్దేయు" అంటూ నీట్ గా ఐన రూమ్ ని చూపించాడు అరవింద్. ఇలా చాలా మంది చాలా చెప్పారు అరవింద్,చెప్పినపుడు బానే ఉంటది కానీ ఒంటరిగా ఉండేసరికి ఇంకా మళ్ళి మొదటికే వస్తుంది.మొత్తానికి మారిపోతా అని చెప్పలేను కానీ మెల్లగా ట్రై చేస్తా,థాంక్ యు.

అలా అరవింద్ సాన్నిహిత్యం లో మెల్లమెల్లగా తనకు తెలీకుండానే ప్రదీపిక లో మార్పు రావడం మొదలు ఐంది. చనిపోతాడు అని తెలిసిన అరవింద్ అంత సంతోషంగా ఉండగలిగితే ,బ్రతకడానికి నేను ఎందుకు ఇన్ని కారణాలు వెతుకోవాల్సివస్తుంది అని అనుకుని మెల్లగా మారడం మొదలుపెట్టింది. అలా మెల్లగా తన ఒంటరి తనాన్ని వదిలేసాక మొహం లో చిరునవ్వు వచ్చింది,ముందు లా కాకుండా రోజు బాగా నిద్రపడుతుంది,చివరికి బ్రతకాలనే హోప్ వచ్చింది.

కొన్ని రోజుల తరువాత ప్రదీపిక తన ఫైనల్ సెషన్ కోసం డాక్టర్ ఐన అరవింద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. రా కూర్చో ప్రదీపీక ,ఇంకా మొత్తం సెట్ అయినట్టే కదా....? అంటూ తన అసిస్టెంట్ ఐన లక్ష్మి ని కాఫీ కలపమని చెప్తుంది డాక్టర్. హా.... అని నెమ్మదిగా అంటూ ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చింది ప్రదీపిక.

పర్లేదు లే ,సెషన్ అని కాదు క్యాజువల్ గా రమ్మని పిలిచా మాట్లాడదాం అని అనడం తో కొంచెం ఫ్రీ అయింది. సడెన్ గా అటెండర్ డోర్ ఓపెన్ చేసి ,మేడం MD సర్ అర్జెంటు గా మిమల్ని రమ్మన్నారు ఎదో సీరియస్ కేసు డిస్కస్ చేయాలంట ..!!! ఇప్పుడే వస్తాను అంటూ,హడావిడిగా MD దగ్గరికి వెళ్తుంది డాక్టర్ ,ఆ హడావిడిలో ఫోన్ టేబుల్ మీదే మర్చిపోతుంది.అప్పుడే అరవింద్ వాళ్ళ అమ్మ ఫోన్ కి కాల్ చేస్తాడు,ఫోన్ రింగ్ అవుతూనే స్క్రీన్ పైన అరవింద్ ఫోటో కనపడుతుంది,ఏంటా అని లేచి చూసిన ప్రదీపిక కి ఫోన్ స్క్రీన్ మీద అరవింద్ ఫోటో తో పాటు సన్ అని ఉండటం చూసి షాక్ అవుతుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి ,అయ్యో అరవింద్ బాబు కాల్ చేస్తున్నాడే,మేడం ఫోన్ ఇక్కడే మర్చిపోయిందా అంటూ ఫోన్ తీసుకెళ్లి ఇవ్వడానికి వెళ్తుంటే ,ప్రదీపిక ఉండి " అరవింద్ అంటే మేడం కొడుకా ..?,",మీ మేడం వాళ్ళు ఎక్కడ ఉంటారు ..?,నాకు అరవింద్ తెలుసు అన్న విషయం మీ మేడం కి తెలుసా ? అని ఆపకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది .

తాను అడిగేది ఏం అర్ధం కాకా ,బాబు US కి వెళ్ళిపోతున్నాడు మూడు రోజుల్లో వాళ్ళ నాన్న గారి దగ్గరికి అని చెప్తుంది లక్ష్మి. లక్ష్మి ఇంకొక్క ప్రశ్న , " అరవింద్ కి క్యాన్సర్ ఉంది అన్న విషయం మీ మేడం కి తెలుసా అని అడుగుతుంది ప్రదీపిక. ఏందీ అమ్మ అలా అంటున్నవ్,క్యాన్సరా ...??,నేను చాలా ఏళ్ళ నుండి మేడం దగ్గర పని చేస్తున్న ,బాబు కి కనీసం అల్సర్ కూడా రాలేదు అని చెప్పి ఫోన్ ఇవ్వడానికి వెళ్ళిపోతుంది.

ఒక్కసారిగా అలానే చైర్ లో పడిపోతుంది,చాలా ప్రశ్నలు,బ్రెయిన్ లో ఏవేవో ఆలోచనలు,పక్కకు తిరిగి చూస్తే ఒక సారి తాను సూసైడ్ చేసుకుందాం అని అనుకున్న విండో,ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడ నుండి లేచి బయటికి వెళ్లిపోతుంది. లక్ష్మి వెళ్లి జరిగింది అంతా డాక్టర్ తో చెప్పగానే,డాక్టర్ అరవింద్ కి కాల్ చేస్తుంది,అరవింద్ ప్రదీపిక కి కాల్ చేస్తాడు ప్రదీపిక " ఒక సారి కలవాలి నిన్ను" అని అనగానే ,బాధ తో నేను అదే అనుకుంటున్నా అని చెప్పి ఎక్కడికి రావాలో ప్లేస్ చెప్తుంది.

అరవింద్ "ఒక్క ఫైవ్ మినిట్స్ నేను మాట్లాడతాను ,నువ్వు ఏం మాట్లాడకు ప్లీజ్" " నా సిట్యుయేషన్ తెలిసి కొంచెం కూడా జాలి లేకుండా ఆల్రెడీ ఒక్కసారి మోసం చేసిన అమ్మాయిని మళ్ళి ఎలా చీట్ చేయబుద్ది ఐంది నీకు,అసలు మనిషివేనా నువ్వు .?,అసలు జీవితం లో ఎవర్ని నమ్మొద్దు అనే మంచి లెస్సన్ నేర్పావు,థాంక్ యు సో మచ్.నువ్వు కలవకపోయుంటే కనీసం ఈ రోజు కాకపోయినా ఎదో రోజు మారేదాన్ని,కానీ ఇప్పుడు అసలు లైఫ్ అంటేనే విరక్తి కలుగుతుంది, I HATE YOU ,I HATE YOU ,జీవితం లో నాకు ఇంకో సారి కనపడకు " GOOD BYE FOREVER" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

అరవింద్ ఎంత పిలిచినా పట్టించుకోకుండ ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. To be continued