Contributed By Hareesh Neela
28th JUNE 2016 కాలేజ్ చివరి రొజు, ప్రదీపిక, ఇంకా మనం కలవడం కుదరదు ఏమో , ఈ కాలేజ్ తో మన 4 ఇయర్స్ రిలేషన్ ఈరోజు తో ఎలా అయిపోతుందో, మన రిలేషన్ కూడా అలానే అయిపొయింది అనుకుంటున్నా. నీకు ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చేసింది.నేను ఏమో అమ్మతో పాటు US వెళ్లిపోతున్నా.నువ్వు నాతో అక్కడికి రాలేవు,నేను నీతో ఇక్కడ ఉండలేను.Better we will take a leave here,Thanks for all the memories.GOOD BYE..!!!!- Aravind MY EX 15th DEC 2016 పద్దు ,మీ నాన్న ఫైనల్ నోటీసు పంపించాడు డివోర్స్ కి ,ఇంకా నీ ఇష్టం నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు….!!!!! - అమ్మ 9th APRIL 2017 ప్రదీపిక,How many times I have to tell you to complete the work with in time, నీ వల్ల పై వాళ్ళ ఫ్రస్టేషన్ అంత నా మీద చూపిస్తున్నారు,,కాలేజ్ అవకముందే ఈజీగా జాబ్ వస్తే ఇలానే ఉంటుంది,కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఛా..,Its my Last warning …..!!!!!- My Boss
నా లైఫ్ అంతా అవుట్ డేట్ ఐన “ C “ ప్రోగ్రామ్ లాగ అయిపోయింది .నా రోజు అంతా ఆఫీస్ లో మొదలై ,నా రూమ్ లో ఎండ్ అయి ఒక నెవెర్ ఎండింగ్ లూప్ లో తిరుగుతూ ఉంది.ఇంకా " నా ప్రపంచం అంతా HTML QUOTES మధ్యలో ఏకాకి లాగ మిగిలిపోయింది ". నేను సంతోషంగా ఉండటానికి ఒక కారణం వెతికితే ,బాధపడటానికి ఇలా వంద కారణాలు చూపిస్తుంది నా జీవితం ఇంకా అన్ని కలిపితే డిప్రెషన్.
అస్తవ్యస్తమైన ఆలోచనలు మనసు ని ,మెదడు ని అష్టదిగ్బంధనం చేస్తూ ఉంటే,అనుక్షణం అంతేలేని ,లోతే తెలియని బావిలో పడుతున్నట్టు ఉంటే, నా మదిలో మెదిలే ప్రతి ఆలోచన ఒక యుద్ధం లాగ అనిపిస్తూ ఉంది,కానీ అలాంటి యుద్దాలు లక్షలు. వీటన్నిటి మధ్యలో నాకు ఎపుడు తోడుగా ఉండేవి నా ఏకాంతం ,నా కన్నీళ్లు మాత్రమే. నేను ఇంకా ఈ యుద్ధం లో గెలుస్తాను అని నమ్మకం లేదు ,బ్రతకాలని ఆశ లేదు ,కానీ చావాలంటే ధైర్యం లేదు,అది నేను పుట్టిన రోజున.. “ I WISH YOU A VERY SAD SAD BIRTHDAY TO ME “ నేను
అని డైరీ రాయడం పక్కన పెట్టేసి పడుకుందాం అని అనుకుంటూ ఉండగా, తన ఫ్రెండ్ శ్రావ్య నుండి కాల్ వస్తుంది. " ఏమే,బర్త్ డే రోజు బయటికి రమ్మన్నా రాలేదు ,మేము ఇంకా ఏం చెప్పిన వినే సిట్యుయేషన్ లో నువ్వు లేవు,ఇంకా లాస్ట్ ఆప్షన్ గా తెలిసిన వాళ్ళ తో ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న ,US రిటర్న్డ్ ,నా మాట విని రేపు వెళ్లి ఒక సారి కలవు ,ఈ ఒక్కసారి నా మాట విను " అని బ్రతిమిలాడటం తో ఇంక ఇష్టం లేకున్నా కలుద్దాం అని అనుకుని అలానే ఆలోచిస్తూ పడుకుంటుంది. *************
మరుసటి రోజు ..హాస్పిటల్ మానిటర్ లో ఎవరిదో పేషెంట్ బ్రెయిన్ స్కాన్ చూస్తూ సడన్ గా తనని చూసి ,ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుని ఆలోచిస్తూ తను దగ్గరికి రాగానే కూర్చోమంటుంది డాక్టర్. చెప్పమ్మా ఏంటి ప్రాబ్లమ్..? ఇష్టం లేకుండా " నా ఫ్రెండ్ చెప్పే ఉంటది కదా " అని తల కిందికి దించుకుని కూర్చుంటుంది. ప్రాబ్లమ్ నీది కదా ?? తనది కాదు కదా ..? నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియట్లేదు ,ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం అయితే ఎదో ఒక మందులు ఉండేవి ,కానీ ఇది నా మెంటల్ ప్రాబ్లమ్. పర్లేదు నీకు ఏం అనిపిస్తే అది చెప్పు ...! హార్ట్ ఎటాక్ అంటారు కదా ,అలా థాట్ ఎటాక్ నాది ,ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ అంతా అసలు ఫోకస్ ఉండట్లేదు, మీ భాషలో చెప్పాలంటే “ డిప్రెషన్ “ అని చిరాకు తో అంటుంది ప్రదీపిక.
ఏవి ఐన సీరియస్ లాస్ కానీ ,హెల్త్ ఇష్యూస్ కానీ ,అమ్మ నాన్న తో ప్రాబ్లమ్ కానీ ,బ్రేకప్ కానీ అలాంటివి ఏం ఐన జరిగాయా రీసెంట్ గా ??? అమ్మ ఉంది ,నాన్న ఉన్నాడు ,కానీ అమ్మానాన్న నే లేరు ,కలిసి లేరు ,మనుషుల్ని నమ్మాలంటేనే భయం వేస్తుంది,ఒకడు ఏమో మోసం చేసి వెళ్ళిపోతాడు, కన్న తల్లితండ్రులు డివోర్స్ తీసుకుని నన్ను పంచుకుందాం అనుకున్నారు ,ఇంకా ఆఫీస్ లో బాస్ ,వాడి పవర్ చూసుకుని పొగరు ,రెసిషన్ కదా ఈ జాబ్ వదిలి ఎక్కడికి వదిలి వెళ్ళలేదు అని ధైర్యం.అసలు లైఫ్ లో పాజిటివ్ గా ఆలోచిద్దాం అంటే ఒక థాట్ కూడా లేదు ,రేపు అంటేనే భయం వేస్తుంది.నా ఆలోచనలన్నీ నాకు శతృవులు లాగ అయిపోయాయి.వెలుతురూ అంటే భయం,సరిగ్గా నిద్ర పట్టదు,ఒంటరి తనం ,చికాకు,నాకు తెల్సిన సర్కిల్ లో నా ఫ్రెండ్స్ అందరు చాల హ్యాపీ గా ఉంటున్నారు.వాట్సాప్ లో వాళ్ళ స్టోరీ లు ,ఫేస్బుక్ లో వాళ్ళ పోస్ట్స్ చూసి చిరాకు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని.బ్రెయిన్ అంతా చిక్కుముడులు పడ్డ ఇయర్ ఫోన్స్ లాగా,సాల్వ్ చేయని పజిల్ లాగా ఉంటుంది. “ A Deep unexplained sadness which is eating away my life and making me to literally jump out of this window”…. అంటూ విండో సైడ్ చూస్తుంది.
స్టాప్ ఇట్ ,అసలు మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం ,లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే చాలు స్ట్రెస్ ,డిప్రెషన్ అని ఏవేవో ఊహించుకుంటారు.అసలు ఫైట్ చేద్దాం అన్న ఆలోచన కూడా ఉండదు.దేవుడు ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు.లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ ,కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలో మీకు తెలియదు అని కోపంగా చూసినట్టు అంటుంది డాక్టర్.
" ఆస్తమా ఉన్నోడి దగ్గరికి వెళ్లి ,నీ చుట్టూ అంతా గాలి ఉంది కదా నీకు ఆస్తమా ఎందుకు ఉంది అని ఎవరు ఐన అడుగుతారా " అని మనసులో అనుకుంటుంది డాక్టర్ కి వినపడకుండా.
సరే లే వర్రీ అవ్వకు , ఇంకో 2,3 సెషన్స్ ఉంటాయి ,అపాయింట్మెంట్ తీసుకో, అంటూ తన ఫోన్ తీస్కొని ఎదో నెంబర్ కి కాల్ చేస్తుంది డాక్టర్. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రదీపిక.
*************** ఏంటమ్మా అంతా అర్జెంటుగా రమ్మన్నావ్ హాస్పిటల్ కి ..? అరవింద్ ...ఈ ఫైల్ ఒక్కసారి చూడు .... ఫైల్ మీద ప్రదీపిక అని పేరు చూసి షాక్ అవుతూ ఎవరు అమ్మ ,ఏం ఐంది అని ఆశ్చర్యం తో అడుగుతాడు.? 2 ఇయర్స్ క్రితం నువ్వు వద్దు అని చెప్పిన అమ్మాయి ,నువ్వు వదిలేసినా ప్రేమ… ప్రదీపిక. ఫైల్ చూస్తూ, ఏది ఐన సీరియస్ ప్రాబ్లం ఆ అమ్మ .? క్లినికల్ డిప్రెషన్ రా ,అలా అని తాను ఏం మొత్తం డిప్రెస్డ్ కాదు కానీ లైఫ్ లో సిరీస్ అఫ్ ఇన్సిడెంట్స్ ఒకే సారి తనకి అపోజిట్ గా జరిగే సరికి తను డిప్రెషన్ అనుకుంటూ ఉంది .
తగ్గుతుంది అంటావా అమ్మ ..? తాను మైండ్ లో గట్టిగ ఫిక్స్ ఐంది రా ,మేము ఏం చేసిన మెకానికల్ గా ఉంటది.తెలిసో ,తెలియకనో తాను ఈ సిట్యుయేషన్ రావడానికి ఒక కారణం నువ్వే . అప్పుడు చేసిన దానికి గిల్టీ నే ఇప్పటికి మోస్తూ ఉన్నాను, ఇంకా దీనికి కారణం నేను అంటే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను అమ్మ ....!!!! మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు రా ..? నీకు ఉన్నదే కొద్దీ టైం ,నువ్వు ఏం చేస్తావు రా వెళ్లి ? నేను మళ్ళి తన లైఫ్ లోకి వెళ్తాను అమ్మ ,నేను అపుడు తనను వద్దు అనుకున్నది తాను అంటే ప్రేమ లేక కాదు , తనని కంప్యూజ్ చేయడం ఇష్టం లేక ,ఇప్పుడు మళ్ళి తన లైఫ్ లోకి వెళ్తాను అమ్మ ,ఈసారి తన ప్రేమ కోసం కాదు , తన కోసం అంటూ మొబైల్ లో " జ్ఞాపకo " అని పేరు తో సేవ్ చేసి ఉన్న నెంబర్ కి కాల్ చేస్తాడు . " మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం పనిచేయుట లేదు ,తిరిగి మరల ప్రయత్నించండి " " మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం పనిచేయుట లేదు ,తిరిగి మరల ప్రయత్నించండి " To be continued...