Contributed by Masthan Vali K
ఎందరో మందుబాబులు, అందరికి వందనాలు... మందు బాబులు, మీకోసమే ఇది. మామూలు Time లో ఏమో గాని మందు కొట్టిన ఆ Particular Time లో మాత్రం వీరు సకల కళా వల్లభులు, కాల జ్ఞానులు , సర్వాంగ సుందరులు, వేదాంత పండితులు ... అంతా మాయ, మందు మాయ. ఏమాటకామాటే, ‘మందు’ అనేది లేకుంటే Entertainment లో ఒక Segment మిస్సయినట్టే, కావాలంటే ఒక్క సారి మన సినిమాల్లో చూపించే మందు సిట్టింగ్ సీన్లు గుర్తు చేసుకోండి... మెగాస్టార్ దగ్గర్నుండి మహేష్ బాబు వరకు బోలెడున్నాయ్. ఆ Entertainment కోవలోకే ఇక్కడ చదవబోయేదాన్ని కూడా తీసుకుంటారని ఆశిస్తూ.... జై బాలయ్య.!
1. అపరిచితుడు అప్పటిదాకా మాములుగా మాటాడేటోళ్లు sudden గా గట్టిగా అరిచేస్తూ అంతలోనే నెమ్మదవుతూ, పేర్లు మరిచిపోతారేమో అన్నట్టు ... 'అరె వాసు, అరె కిరణ్... ' అని పదే పదే పిలుచుకుని మాటాడుకుంటారు, ఊరికే నవ్వుకుంటారు.! ' నేను బ్రహ్మానందాన్ని చూసాను, వెన్నల కిషోర్ ని చూసాను, అలీ ని చూసాను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ని చూసాను ... వీడింకా తోపులా ఉన్నాడేంట్రా ' అనిపించక మానదు వీళ్ళ చేష్టలు చూస్తే .!
2. ఇంకో అవతారం ఉగ్ర నరసింహుని అవతారం: కొందరు మందు తాగాక వారిలో రాబోయే మార్పు ఎలాంటిదో మనకు ముందే తెలుస్తుంటుంది, అంటే పైన చెప్పినట్టు రెమో to అపరిచితుడు. ఇది ఇంకాస్త స్పెషల్ కేటగిరీ.! బాబోయ్, విశ్వరూపం లో కమలహాసన్ లా ఒక్క సారిగా silent ఉన్నోళ్లు భీభత్స బోయపాటి violent అయిపోతారు. నమ్మడానికి బా టైం పడుతుంది, ఆ తర్వాతే అలవాటవుతుంది.!
3. Music yaa సిట్టింగ్ అంటే మందు తాగినామా , బాతాకాని కొట్టినామా, లాస్ట్ లో ఆమ్లెట్ ఏసినామా అన్నట్టు కాకుండా... వీళ్లకు Music లేకుంటే నంజుకునే stuff గొంతు దిగదు, తాగే మందు తలకెక్కదు.! సిటింగ్ స్టార్ట్ అయిన అరగంటకు Music స్టార్ట్ అవ్వాలి. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’ నుండి ‘ ఓ బంతి పూల జానకి జానకి’ వరకు అన్ని రకాల పాటల్ని ఆదరిస్తారు.!!
4. భగ్న ప్రేమికులు స్మశానం లేని ఊరేదైనా ఉంటుందేమో గాని ప్రేమకథ లేని మనిషి మాత్రం ఉండడు. పోలిక ను పక్కనపెడితే, అసలు వీళ్ళు మందు కొట్టేది కిక్కు కోసమో , మనల్ని సావగొట్టడం కోసమో తెలీదు. కానీ వీళ్ల ప్రేమ కథలు వింటే ..." ఆ... ఆ... " too emotional I Say .! ప్రతి కథా ఒక సినిమా లా ఉంటుంది.!(అనుకుంటారు) నా లోపల ఇంత బాధుంది తెలుసా, ఓ రగులుతున్న అగ్ని పర్వతమే ఉంది తెలుసా... అంటూ తెగ ఫీలైపోతారు. మళ్ళీ తెల్లరాకా మామూలయిపోతారనేది చాలా మామూలు విషయం.!
5. ప్రేమ పావురాలు పై పోలిక విషాదాంతం. ముళ్ళు లేని గులాబీ ఉంటుందేమో గాని, ప్రేమ కథ లేని మనిషి ఉండడు. , ఇది సుఖాంతం.! వీళ్లు తాగుడు తక్కువ వాగుడెక్కువ రకం, రెండు పెగ్గులేసి ఇంక ఫోన్ అందుకుంటారు... "బేబీ.. మిస్ యు రా నాన్నా.., బేబీ లవ్ యూ ర కన్నా.." oh my Bacardi .! ఇది వేరే ఘోరం, ఆ కమిటెడ్ కథలు మనం తట్టుకోలేం.!
6. కిక్కు కే కిక్కు వీళ్ళ stamina ను మ్యాచ్ చేయడం అంత వీజీ కాదు. ఎంత తాగినా steady గా, stable గా ఉంటారు . పొరపాటున ఎవరైనా బాటిల్ ఎత్తుదామని వీళ్లతో పోటీకి దిగితే war one side అని మనం decide అయిపోవచ్చు . బేసిక్ గా silent drinkers అన్నట్టు. ఏ హడావిడి లేకుండా గప్ చుప్ గా సిప్పు సిప్పు ని ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళను కెలక్క పోవడమే మంచిది.!
7. వంటగాళ్లు అరెరే, ఏంటిక్కడ వంట ప్రస్తావన అనుకోకండి. కొంత మంది మందు కొట్టినప్పుడు వాళ్లలోని నలభీముడు కూడా బయటికి రావడం నేను చూసాను. సరైన సామగ్రి ఉండాలి గాని, Half Boiled నుండి Chicken fry వరకూ వీలైనన్ని ప్రయోగాలు చేస్తారు, టేస్టు వాళ్ళకెలాగూ తెలీదు, ఇహ ఆ దేవుడికెరుక.! kitchen ని మాత్రం తగలబెట్టేస్తారు.!
8. దీపికా పదుకునే to దేశ రాజకీయాలు ఎప్పుడు మొదలయిందో గుర్తుండదు, ఎక్కడికెళుతోందో అంతు చిక్కదు. ఒక్క టాపిక్ అని కాదు, అబ్బో ఆఫీస్ గాసిప్స్ నుంచి అంతరిక్షపు రాకెట్ల వరకు ఏమిటేమిటో మాట్లాడుకుంటారు. ఎదో silly talk కాదు , serious intense conversation you know ..! వీల్లకింత knowledge ఎక్కడిది రా అయ్యా అనిపిస్తుంది.! keep it up guys.
9. బూతులు బాబోయ్ బూతులు అసలైన సంస్కృతానికి అర్థం పలుకుతారు వీళ్ళు . ఏమ్మాట్లాడ్తున్నావ్ రా బీప్...!! conscious నిజంగా దొబ్బి కొందరు, కావాలని ఇంకొందరు... అదో తుత్తి... !! మచ్చుకు కొంత చదవండిక్కడ (censored ) "అరే బీప్, ఇది విన్రా..." "ఒరే బీపూ , అది నేనెప్పుడో విన్న జోకు ... " "నువ్వాపరా బీప్... " రామ రామ, ఇంక చాలు..
అవండి, నా అనుభవం తో తెలుసుకున్నవి . ఖచ్చితంగా ఇంకా చాలా రాయొచ్చు అనిపిస్తే కింద కామెంట్ చెయ్యండి.!
ఏదేమైనా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని నేనంటే, "Right తీస్కొని Left కెళ్లి అక్కడ్నుంచి Straight గా వెళ్ళు ... " అంటారని నాకు తెలుసు. సో, నే చెప్పేదేంటంటే... నేనేం చెప్ప. మీ ఆరోగ్యం, మీ ఆల్కహాల్, మీ ఇష్టం.