దర్శక రత్న దాసరి నారాయణరావు..ఇండస్ట్రీ మొత్తం గౌరవంగా పిలుచుకునే "గురువు గారు"..అవును ఆయన ఓ సంచలన దర్శకుడు..!దర్శకుడి స్థాయిని పెంచిన దర్శకుడు.మొదటి చిత్రం "తాతామనవుడు" నుంచి ఇటీవల వచ్చిన ప్రయోగాత్మక చిత్రం "ఎర్రబస్సు" వరకూ 151 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యల్ప కాలంలో అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన దర్శకుడు.కేవలం దర్శకత్వం మాత్రమే కాదు..నటుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా ప్రభుత్వం నుంచి అవార్డు పొందిన సహజ నటుడు, అలనాటి గీతరచయితలైన వేటూరి, ఆత్రేయలతో పాటు తన సినిమాలకు తానే పాటలు రాసిన మేటి గీత రచయిత.. తన చిత్రాలకే కాక మరెన్నో చిత్రాలకు సంభాషణలనూ,కధను అందించిన కదారచయిత,కధను నమ్మి కొత్త వారికి దర్శక,నటనావకాశలను కల్పించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత.ఇలా ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి.మొదటి తరం హీరోలైన ఎన్.టి.ఆర్,ఏ.ఎన్.ఆర్,కృష్ణ,శోభన్ బాబు నుంచి తర్వాతి తరం సూపర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మోహన్ బాబు లతో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించటమే కాక విజయశాంతి,ఆర్.నారాయణమూర్తి లాంటి వారితోనే ప్రధాన పాత్రలను వేయించి సినిమా విజయవంతం కావడానికి కధ,కధనం ఉంటే చాలు, స్టార్ హీరోలే అవసరం లేదని నిరూపించిన విలక్షన దర్శకుడు..!!!
అసలు ఆయనే ఓ స్టార్ దర్శకుడు.. ఆయన చిత్రాల్లో నటించిన పిమ్మటే ఆయా హీరోలు స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది.కేవలం ఓ దర్శకుడికే అప్పట్లో వందలాది అభిమాన సంఘాలుండేవంటే ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎంతటి స్థానాన్ని సంపాధించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.మధ్యతరగతి జీవితాలు-వారి కష్టాలు,కులవ్యవస్థ,స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు,వరకట్నం లాంటి సామాజిక సమస్యలను ఆయన వెండి తెరపై చిత్రించారు.
కోడి రామకృష్ణ,రవిరాజ పినిశెట్టి,ఆర్ నారాయణ మూర్తి లాంటి దర్శకులనూ,మోహన్ బాబు, శ్రీహరి లాంటి నటులను,జయసుధ, జయప్రధ,మాధవి లాంటి జనం మెచ్చిన హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసింది గురువు గారే.
అప్పట్లో ఏకపక్ష ధోరణి వహిస్తున్న పత్రికలకు వ్యతిరేకంగా "ఉదయం" అనే పత్రిక నడిపి కొన్నాల్లు పాత్రికేయ వృత్తిని కూడా పోషించారాయన.ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కూడా క్రియాశీలక రాజకీయాల్లో కూడా రాణించారు. ఉత్తమ దర్శకుడిగా రెండు సార్లు జాతీయ అవార్డును,9 నంది అవార్డులనూ,6 ఫిల్మ్ ఫేర్ అవార్డులను,జీవిత సాఫల్య అవార్డులను అందుకున్నారాయన.అలాగే ఆయన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడ్డాయి
ఆయన దర్శకత్వం వహించిన 151 చిత్రాల్లో అత్యంత ప్రేక్షకాధరణ పొందిన 20 మేటి చిత్రాలు
1. తాత మనవడు
2. స్వర్గం నరకం
3. సర్ధార్ పాపారాయుడు
4. శ్రీ వారి ముచ్చట్లు
5. ప్రేమాభిషేకం
6. స్వయం వరం
7. బొబ్బిలి పులి
8. మేఘసందేశం
9. బలి పీఠం
10. కంటే కూతుర్నే కను
11. అమ్మ రాజినామా
12. శివరంజిని
13. గోరింటాకు
14. తాతా మనవుడు
15. తాండ్ర పాపారాయుడు
16. కటకటాల రుద్రయ్య
17. సంసారం సాగరం
18. మజ్ను
19. బ్రహ్మ పుత్రుడు
20. ఒసేయ్ రాములమ్మ