పోరాడితే పోయేదేది లేదు బానిస సంకెళ్ళు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటు మార్క్సిస్టు మూల పురుషుడు కారల్ మూర్క్స్ పూరించిన శంఖానికి విశేషంగా స్పందనొచ్చింది. బానిస బతుకులు, వెట్టిచాకిరీల నుండి విముక్తి కొరకు కార్మిక జాతి అంతా ఏకమై చికాగో వేదికగా కార్మిక శక్తిని తమ హక్కుల కై మళ్ళించి, తాము చిందించిన రక్తమే సాక్ష్యంగా ఎంతోమంది ప్రాణ త్యాగాలే పునాది గా తమ హక్కులను సాధించుకున్నారు.. ఇవి కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమతం కాలేదు ప్రపంచమంతటికి ఇవే నిబందనలు కార్మికులకు ఆసరాగా నిలుస్తున్నాయి..
నాటి కాలంలో శ్రమను దోపిడి చేస్తు, ఏళ్ళ తరబడి ఒకే జీతం ఇచ్చేవారు.. సంస్థ ఆదాయం ఎంత పెరిగినా కూడా కార్మిక ఆదాయంలో మార్పు రాకపోయేది.. కార్మికులకంటు ఒక యూనియన్ సంస్థలు, ఎన్నికలు ఇవ్వేమి ఉండేవి కావు.. కేవలం యాజమాన్యం ఏది చెబితే అదే పాటించాలనే నియమం ఉండేది. కాదని ఎదురు తిరిగితే ? అన్న ప్రశ్నే ఉండకపోయేది.. రోజుకు 18 నుండి 20 పనిగంటలు, అరకొర జీతం, నెలవారి సెలవులు ఇవ్వేమి ఉండేవి కాదు ఇలా నాడు కార్మికుల శ్రమను విచక్షణ రహితంగా యాజమాన్యాలు దోచుకునేవారు..
19వ శతాబ్ధపు ఉద్యమ పలితంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు.. రోజుకు 8 పనిగంటలు, 8గంటల నిద్ర, మిగిలిన 8 గంటలు రిక్రియేషన్ గా విభజించారు.. సంస్థ ఆదాయాలలో కొంత వాట, Experience ని బట్టి Salary పెరుగుదల, నెలవారి సెలవులు, పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కార్మికులకు అపాయం కలిగిన ఆ కార్మికునికి అన్ని విధాల యాజమాన్యం సహకరించడం ఇలాంటి న్యాయమైన హక్కులు సాదించుకున్నారు.. సింగరేణి వంటి సంస్థలలో అయితే కార్మికుని పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఉచిత వసతులు వంటి సౌకర్యాలను కల్పిస్తు వారి యోగక్షేమాలను సంస్థలు చూసుకుంటున్నాయి.. కాని ఈ నిబందనలు, సౌకర్యాలు కేవలం గవర్నమెంట్ మరియు రిజిస్టర్ ప్రయివేట్ సంస్థలలో మాత్రమే అమలవుతున్నాయి.. నిజానికి వీటిలో చాల వరకు సాదారణ కూలీలకు, ఇంట్లోని పనిమనుషులు వంటి వారికి వర్తించడం లేదు.. ఇప్పటికి తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి శ్రమదోపిడికి, వెట్టిచాకిరి కి గురి అవుతున్నారు.. ఇప్పటికి బాలకార్మకులుగా ఎంతోమంది వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. నిజానికి ఇవ్వన్ని పూర్తిగా నిర్ములన జరిగినప్పుడే అది సంపూర్ణ కార్మిక దినోత్సవంగా అన్నిరకాల కార్మికులు జరుపుకుంటారు..
చాల మంది లేబర్, కార్మికులు అంటు వారిని చిన్న చూపు చూస్తుంటారు కాని సంఘానికి ఒక డాక్టర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఏలా వైద్యం చేస్తాడో అలాగే అనారోగ్యం రాకుండా ఒక డ్రైనేజి శుబ్రం చేసే కార్మికుడు, చెత్త శుబ్రం చేసే సిబ్బంది కూడా అంతే సేవచేస్తారు.. ఎప్పటికి నిలిచివుండే పటిష్టంమైన భవనాలను నిర్మించే ఇంజనీర్ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం ఉంటుందో వాటి నిర్మాణానికి రాళ్ళు ఎత్తే కార్మికుల ఉపయోగం కూడ అంతే ఉంటుంది.. "ఎవరి ప్రత్యేకత వారిది ఎవరు శక్తి వారిది ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే తారతమ్యం కాకుండా ప్రతి ఒక్కరూ సమానమే అన్న భావనే కార్మిక హక్కుల పోరాట ప్రధాన ఉద్దేశం"