పరమేశ్వరుని భార్య పార్వతీమాత అవతారంగా దుర్గమాతను పూజిస్తారు. దుర్గ మాతకు ఈ భూలోకంలో ఉన్న పవిత్రమైన దేవాలయాలలో మెదక్ ఏడుపాయల వనదుర్గ దేవాలయం కూడా ఒకటి. పవిత్రమైన ఈ కోవెల మన తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం నాగసన్నపల్లి అనే గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. మహాశక్తి పీఠలకున్నంత పవిత్రత ఈ గుడికి ఉంది. ఆసియా లోనే అతిపెద్ధ జాతర అయిన సమక్క సారలమ్మ జాతర తరువాత అంతటి స్థాయిలో ఇక్కడ ఈ ఏడుపాయలో జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాలలో ఇక్కడ జరిగె మహోత్సవాలు కొన్నిరోజులు పాటు సాగుతాయి ఈ ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి 15 లక్షలకు పైగా భక్తులు దర్శనానికి వస్తారు.
పురాణ కథల ప్రకారం జన్మేజయుడు అనే ఒక మహారాజు తన తండ్రి చావుకి కారణమైన వారిపై పగతీర్చుకోవాలనుకుంటాడు.. కద్రువ నాగమాతల పుత్రుడు తక్షకుడు అనే సర్పరాజుని ఇంకా మిగిలిన సర్పజాతినంతటిని నాశనం చేయాలనుకుంటాడు, ఇందుకోసం మహా సర్పయాగం కోసం ఏర్పాట్లు చేస్తాడు. యాగానికి ఒక దట్టమైన అడవిని ఎంచుకుంటారు కాని దానికి వాస్తుదోషం ఉందని గుర్తిస్తారు యాగం నిర్విగ్నంగా జరగడానికి అష్టదిక్కులను దిగ్బంధనం చేసి మహాసర్పయాగాన్ని ప్రారంభిస్తారు. భూలోకంలోని సర్పజాతిని కాపాడుకోవడానికి తక్షకుడు ప్రయత్నాలు మొదలుపెడతాడు.. ఆ అష్టదిగ్భందనాన్నిఛేదించగల సామర్ధ్యం వన దుర్గ మంత్ర మునులకు మాత్రమే ఉందని తక్షకుడు తెలుసుకుని తన అన్న వాసుకి ని సహాయం అడిగితే "తమ చెల్లల్లు జగత్కారకు అదే పేరుగల వన మునిశ్వరునికి పెళ్లిచేస్తే వారి ద్వారా ఆస్తీకుడు అనే మహాముని ఉద్భవిస్తాడు ఆ ఆస్తీక మహామునే ఈ యాగాన్ని ఆపగలడు ఆయన వల్లనే ఈ భూమి మీద సర్పాలు మిగులుతాయని బ్రహ్మ చెప్పిన విషయాన్ని అన్న వివరిస్తాడు. అలా వారిద్దరికి పెళ్లిచేస్తారు."
ఆ తరువాత జమత్కార దంపతులకు జన్మించిన ఆస్తీక మహాముని ఆజ్ణతో సర్పయాగాన్ని ఆపేస్తారు.. జన్మేజయుడు పాతాల లోకం నుండి నదిని భూలోకానికి తీసుకువచ్చి అపవిత్రమైన ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయాలని ఆస్తీకమహాముని ఆదేశిస్తారు..! అప్పుడు మహావిష్ణువుని వేడుకుని ఈ ప్రాంతానికి ఆ నదిని తీసుకువచ్చారట.. "గరుడు" ఈ నదిని తీసుకురావడంతో ఈ నదిని మొదట గరుడగంగగా పిలిచేవారు ఈ గరుడగంగను ఏడుగురు మహామునులు పూజించడం వల్ల ఈ నది ఏడుపాయలుగా విభజించబడింది ఇక అప్పటినుండి ఈ క్షేత్రాన్ని ఏడుపాయలు గా పిలవడం జరుగుతుంది. వన దుర్గ మంత్రం పఠించే మునులతో ఈ దట్టమైన అడవిలో దుర్గమాతను ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతుంది.
భారతదేశంలో ఈ వనదుర్గ దేవాలయాలు కేవలం రెండే ఉన్నాయని తెలుస్తుంది ఒకటి కాశ్మీర్ లో, మరోకటి మన మెదక్ లో.. ప్రతిరోజు పంచామృతాలతో ఇక్కడి దుర్గామాతను అభిషేఖిస్తారు. భక్తులు ఒడి బియ్యం సమర్పించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. శివరాత్రి కి జరిగే ఈ జాతర సుమారు కాకతీయుల కాలం నుండి జరిగి మద్యలో కొంతకాలం ఆగి మరల ఈ మధ్య కాలంలో ప్రారంభించారని చరిత్ర చెబుతుంది. ఇక్కడి చుట్టూ కొండలు దట్టమైన అడవి ఉండటం వల్ల ఇది పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా పర్యాటక ప్రాంతంగా కుడా ఈ ఏడుపాయల అభివృద్ధి చెందుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.