" ప్రాణం ఖరీదు ఎంత అంటూ పునాది రాళ్ళు ధృడంగా నాటి, మన వూరి పాండవులలో ఒకడి లా మొదలెట్టి, కోతల రాయుడిలా కథలు చెప్పి ఇది కథ కాదు అనిపించి, పున్నమి నాగులా చురుకుగా కదులుతూ, చట్టానికి కళ్ళు లేవు న్యాయం కావాలి అని ప్రశ్నిస్తూ, శుభలేఖ అందించి, ఇంట్లో రామయ్య వీధి లో కృష్ణయ్య లా నటిస్తూ, పట్నం వచ్చిన పతివ్రతలను మొండిఘటం లా వెతుకుతూ, అభిలాష తో గూడాచారి నెంబర్ 1 గాఎదిగి, మగ మహారాజులా మా హృదయ చరసాలలో ఖైదీ లా మారి, సంగర్షణ విసిరిన చాలెంజ్ లో విజేతగా నిలిచి, కిరాతకుడు లా అందరిని బెదరగొట్టి, ధైర్యవంతుడు అనుపించుకొని, రాక్షసుడు ని కాదు చంటబ్బాయ్ నే అని నిరూపించి, ఆరాధన స్వయం కృషి తో తెలుగు సినిమా చక్రవర్తి గా అవతరించి, పసివాడి ప్రాణం కోసం యముడికి మొగుడులా మారి, త్రినేత్రుడు గా మరణ మృదంగం వాయించి, దొంగ జేబు దొంగ అడవి దొంగ కొండవీటి దొంగ గ్యాంగ్ లీడర్ స్టేట్ రౌడీ లను స్టువర్ట్ పురం పోలిస్ స్టేషన్ లో వణికించిన కొదమ సింహం SP పరుశురాం, బిగ్ బాస్, ముటా మేస్త్రి, ఆపద్భాందవుడు, అందరి వాడు అన్నయ్య చిరంజీవి. మిమ్మల్ని మళ్ళీ వెండితెర పై ఒక టాగూరులా, స్టాలిన్ లా, శంకర్ దాదా లా, ఇంద్ర లా చూడాలని వుంది. "
సినిమాల్లో కి రావటం, రాణించటం ఎంత కష్టమో తెలిసిన వాళ్లకి చిరంజీవి సాధించిన విజయాల గురించి, అనుభవించిన కష్టాల గురించి, చేరుకున్న శిఖరాల గురించి వివరించి, విడమరిచి, విశదీకరించి అర్ధం అయ్యేలా చెప్పాల్సిన పని లేదు. తెలీని వారికి చెప్పినా ఎప్పటికీ అర్ధం కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా, తెలుగు సినిమా పరిశ్రమ లో చిరంజీవి ఎప్పటికీ మెగాస్టారే. సినిమా పరిశ్రమ వరకు ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు.
మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.