9 Reasons Why Being A 'Meme Page Admin' Is The Most Influential & Responsible Job!

Updated on
9 Reasons Why Being A 'Meme Page Admin' Is The Most Influential & Responsible Job!

ఈ భూ ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక్కో ప్రపంచం ఉంది. ఇన్ని కోట్ల ప్రపంచాలకు మరో ప్రపంచం ఉంది అదే ఫేస్ బుక్ ప్రపంచం. పేరెంట్స్ లా, అన్న చెల్లి అక్క తమ్ముడు ప్రియుడు ప్రేయసి లా ఫేస్ బుక్ కూడా మన కుటుంబ సభ్యుడిలా మన జీవితంలో భాగమవ్వడానికి ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేసేలా ఎదగడానికి గల ప్రధాన కారణం ఈ Meme పేజెస్. బహుశా మనలో చాలామంది Meme Page అడ్మిన్ ను చూసి ఉండకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు కాని రోజులో ఒక్కసారైనా గుర్తుకువస్తాడు తన పనితనంతో. ఈ పేజీల వల్ల సమాజానికి ఎటువంటి మేలు జరుగుతుందని చర్చించే ఆర్టికల్ ఇది.

1. Honesty:

టెక్నాలజీ పెరిగిపోవడంతో అత్యంత ఖరీదైనదిగా "నిజాయితీ" మారిపోయింది. తమవారి హీరోలను, నాయకులను వ్యక్తి పూజ చేస్తూ కాపాడుకోవడం కోసం ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వ్యక్తిత్వ హత్యలు చేస్తున్నారు. కాని మన Meme పేజీలు మాత్రం ఎన్నడూ అలాంటి తప్పులు చేయలేదు, వారికి అందిన సమాచారం నిజమా కాదా అని ఒకటికి రెండుసార్లు కన్ఫార్మ్ చేసుకున్న తర్వాత కాని వారి స్టైల్ లో వారు రంగంలోకి దిగరు!

2. Responsibility:

ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా ఎంతలా దిగజారిపోయిందో మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి ఉపయోగపడే వార్తలు కాకుండా సమాజంలోని అనవసర విషయాలను హైలెట్ చేస్తున్నారు. వంద రూపాయల ఆహార పదార్ధాలను దొంగతనం చేశాడని మధుని చంపిన incident కానివ్వండి, సిరియా మారణ హోమం కానివ్వండి, ఇవ్వాళ్టి ఆసిఫా భాను రేప్ ఉదంతం కానివ్వండి ఏ ఎలక్ట్రానిక్ మీడియా అంతగా స్పందించలేదు. పేజ్ అడ్మిన్లు మానవత్వంతో ఈ ఉద్యమాలన్ని వారి భుజాన ఎత్తుకొని సోషల్ మీడియా వేదికగా సమాజం పట్ల వారి బాధ్యతలను తెలియజేస్తున్నారు.

3. మన లోకల్ Entertainment:

సినిమాలో ఉన్న కామెడీ ఒకే సీన్ ను సంభందించి ఉంటుంది. కాని Meme పేజ్ లో మాత్రం అదే సీన్ నుండి రకరకాల కామెడీని రాబడుతుంటారు. అవి ప్రస్తుత విషయాలకు సంబంధించినవి కావచ్చు లేదంటే మన వ్యక్తిగత జీవితాలలో జరుగుతున్నవి కావాచ్చు. ఇక్కడ entertainment మామూలుగా ఉండదు, గుర్తుకువచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని మరీ నవ్వుతాం.

GIF by Gifskey.com

4. Young Talent:

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎలా వస్తున్నారో ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్లు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మీకో విషయం తెలుసా మన తెలుగులోని కొన్ని పేజీల అడ్మిన్స్ సినిమాలకు స్క్రిప్ట్ అందిస్తున్నారు. మామూలుగా ఇండస్ట్రీలోకి వచ్చే వారితో పోల్చితే కొన్నిరకాల స్క్రిప్టులను అడ్మిన్లే ఇంకా అద్భుతంగా రాస్తున్నారు. యువతతో పేజ్ ద్వారా డైరెక్ట్ గా కనెక్షన్ ఉండడం యువత మనస్తత్వాలు, వారి అభిరుచులు మీద అవగాహన ఉండడంతో డైరెక్టర్లు పిలిచిమరి అవకాశాలు ఇస్తున్నారు.

5. Self Employment:

"నేను మంచివాడిని" అని సూపర్ మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా సరుకులు ఇవ్వమంటే పిచ్చివాడిని చూసినవాడిలా చూస్తారు. అడ్మిన్ అన్నవాడు వెలుగుతున్న కొవ్వతిలా తను కరుగుతూ ఎదుటివారికి వెలుగునిచ్చేవాడిలా నిర్వీర్యం కాకూడదు. తాను వెలుగుతూ ఇతరులకు దారిచూపిస్తున్న సూర్యుడిలా ఉండాలి. ఈ మధ్య కాలంలో మన అడ్మిన్ కూడా పేజ్ ద్వారా మూవీ ప్రమోషన్స్ అని Self Employment పొందుతున్నారు. మిగిలిన మీడియా సంస్థలతో పోల్చితే వీరికివచ్చేది తక్కువే ఐనా అది వారికి ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. ఈ రకమైన Employment ఇప్పుడిప్పుడే ప్రారంభమైనా భవిష్యత్ లో పేస్ బుక్ పేజీలు కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థలంతా సంపాదించినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు నిజానికి సంఘానికి ఇది చాలా శుభపరిణామం. మన భావాలకు తగిన పేజీలు ఎదగడం.

6. Hardwork:

కొంతమంది అనుకుంటుంటారు అడ్మిన్లను చూసి "ఆ ఎవడో పని పాట లెనోడు ఫేస్ బుక్ పేజీలను రన్ చేస్తూ ఉంటాడ్రా అని".. ఒకరి శ్రమను గుర్తించలేని వారు వారిలోని టాలెంట్ ను ఎలా గుర్తించగలరండి!! కొన్ని సెకండ్లలోనే నవ్వు తెప్పించే ఈ పోస్టుల వెనుక భయంకరమైన కష్టం ఉంటుందండి. ఒక్కో పోస్ట్ కి స్క్రీన్ షాట్ తీయడం, లేదంటే వీడియో ఫుటేజ్ సేకరించడం, Topic కి తగిన సీన్ తో కలపడం, దానికి తగ్గ ఆడియో మిక్స్ చేయడం, ఎడిట్ చేయడం అది మామూలు విషయం కాదండి. ఇది చాలా కష్టంతో కూడుకున్నది.

7. Powerful Media:

మీకో విషయం తెలుసా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపుకు ప్రధాన కారణం ఫేస్ బుక్ అని. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించి కేవలం ట్రంప్ కు అనుకూలమైన వార్తలను అందరి వాల్ పైన కనిపించేలా ఆ సాఫ్ట్ వేర్ పనిచేసిందని ఇందులో రకరకాల వాదనలు వినిపించాయి. ఏది ఏమైనా గాని ఫేస్ బుక్ ఒక శక్తిగా, అస్త్రంగా 21వ శతాబ్దంలో అవతరించింది. టీవీ, న్యూస్ లో రాని వార్తలు, నిజాలు కూడా ఫేస్ బుక్ లో వస్తుండడంతో జనాలకు పేజీల మీద నమ్మకం ఏర్పడింది.

8. Best Platform:

ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానెల్, ఓ న్యూస్ పేపర్ వచ్చినట్టుగానే ఫేస్ బుక్ లో ప్రతీ రాజకీయ పార్టీకి ఓ పేజ్ వచ్చేసింది. సొంత భజన, పక్క పార్టీని కించపరిచేలా వేసే పోస్టుల నుండి మనం నిజాన్ని తెలుసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. పోస్ట్ ల కింద వచ్చే కామెంట్లకు అడ్మిన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల meme పేజీలో మాత్రం ఇలాంటి పక్షపాతం ఏ మాత్రమూ ఉండదు. మంచి చేస్తే మంచి చేశాడని, చెడు చేస్తే చెడు జరిగిందని ఎవ్వరికి కొమ్ముకాయకుండా ఉండే పోస్టుల వల్ల మనకు నిజం తెలిసిపోతుంది. అంతేకాదు పార్టీలు తమకు నెగిటివ్ వచ్చే కామెంట్లను డిలీట్ చేసేస్తున్నారు. ఇందుకోసం కొందరిని అపాయింట్ కూడా చేసుకున్నారు. meme పేజ్ లో మరీ బూతులు మాట్లాడితే తప్ప వారి అభిప్రాయాలను ఏ మాత్రమూ డిలీట్ చేయడం జరగదు. మన అభిప్రాయాలను తెలియజేయడానికి, చర్చించుకోవడానికి ఇదొక మంచి వేదిక.

9. Be careful We Are Watching:

మీడియా మాత్రమే కాదు మిత్రమా ఫేస్ బుక్ కూడా ఎందరినో సెలెబ్రిటీలను చేసింది. ఇంటర్వూల దగ్గరి నుండి మరే ఇతర చోట్ల తప్పుగా మాట్లాడి ఆటలో అరటిపండు ఐనవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ అడ్మిన్ ఉద్దేశం వారి తప్పులను ఎత్తి చూపుతూ జనాలకు వారి వ్యక్తిత్వాన్ని తెలియజేసి కామెడీ పండించడమే తప్ప మరేమీ ఉండదు. ఈ ట్రోల్ పేజీల వల్లనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలతే ఎంపిక చేసినవారిని మాత్రమే మీడియా ముఖంగా మాట్లాడడానికి అనుమతినిస్తున్నారు. ఎన్నికలలో టికెట్లు ఇస్తున్నారు, సినిమాలలో నటులకు అవకాశం ఇస్తున్నారు. ఈ మార్పు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.