తండ్రి ఆస్థి కొడుకుకు సంక్రమిస్తుంది అది మామూలే.. అదే తండ్రిలోని టాలెంట్ కొడుకుకు వారసత్వ సంపదగా రావడం మాత్రం కొన్ని సందర్భలలో మాత్రమే జరుగుతుంది. శివ రామచారి గారికి కూడా తన నాన్న జగదీశ్వర చారి గారి నుండి అద్భుతమైన టాలెంట్ వచ్చేసింది. దానిని మరింత మెరుగు పెట్టడానికి B. F. A, M. F. A పూర్తి చేశారు. ఏదైనా ఒకే తరహగా చూస్తే దానికి, ఆ ఆర్ట్ చేసిన ఆర్టిస్ట్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు, దీనిని గమనించే శివరామ చారి గారు ఇనుముతో, ఇంకా రకరకాల మెటల్, ప్లాస్టిక్ మొదలైన వాటితో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఇంట్లో పేయింటింగ్స్ , బొమ్మలు ఉండడం రొటీన్, అదే శివరామ చారి గారి లోహ శిల్పాలు ఉండడం మాత్రం కాస్త డిఫ్రెంట్ లుక్ తీసుకువస్తుందని అతని వర్క్స్ పై ఇప్పుడు చాలా క్రేజ్ పెరుగుతున్నది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు అవార్డులు కూడా దేశ, విదేశాల్లో ఎన్నో అందుకున్నారు. 2015 తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో రాష్ట్రం గర్వించదగ్గ ఆర్టిస్ట్ గా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది కూడా. హైదరాబాద్ లోనే "అచల స్టూడియో" ద్వారా ఎన్నో కళా ఖండాలను తోటి ఆర్టిస్టులతో కలిసి రూపోందిస్తున్నారు.
శివరామ చారి గారి కొన్ని అపురూపమైన అద్భుతాలను పరిశీలిద్దాం.