అజయ్ కుమార్ గారు ఒక శిల్పి.. తన 17 సంవత్సరాల వయసు నుండే గోల్డ్ స్మిత్ గా బంగారాన్ని మరింత అందంగా మలచడం మొదలుపెట్టారు. నాన్న వెంకటాచార్యులు గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. నాన్న గారి సమర స్ఫూర్తితో అజయ్ గారు 1930లో జరిగిన దండి మార్చ్ ఉద్యమాన్ని ఒక పిన్నీస్ లో పొందుపరిచారు. ఇప్పటికి దాదాపుగా 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో సూక్ష్మ శిల్పాలను చెక్కారు. సూది బెజ్జంలో, గుండు సూది గుండు మీద, ఇలా రకరకాల చిన్ని ప్రదేశాలను ఆవాసంగా చేసుకుని ఆయన చెక్కిన శిల్పాలకు జాతీయ స్థాయి గుర్తింపు, ఆరు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. ఒక్క లైన్ లో ఆయన గొప్పతనం గురుంచి చెప్పాలంటే "అజయ్ గారు ప్రపంచంలోనే అతి గొప్ప ముగ్గురు సూక్ష్మ శిల్పులలో ఒకరు"













