Contributed by కొచ్చెర్లకోట జగదీశ్
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మైండ్ బ్లాక్ పాటకు పేరడీ.... ******** ఎపుడూ రోడ్డెక్కేవాడూ ఇపుడూ ఇంట్లో ఉన్నాడు ఎపుడూ చెయ్యిచ్చేవాడూ ఇపుడూ దండం పెడతాడు మూతికేమొ మాస్కు కట్టి మాట గీట కట్టిపెట్టి స్టేహోము స్టే హోమని కూర్చున్నాడూ... ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్ బాబూ నువ్ సెప్పూ ఏంటీ? ఆణ్ణి కడగమని హేండు నువ్ కడగరా కలవమాకూ కలవమాకూ బాబూ నువ్వెవర్నీ కలవమాకు తిరగమాకూ తిరగమాకూ అయ్యా నువ్ రోడ్డుమీద తిరగమాకు అదో ప్రాణాలు తీసె కొత్త బాకు..బాకు దేశదేశాలూ పాకుతున్న స్నేకు..స్నేకు దాని లక్షణాలు విన్నవంటె షాకు..షాకు అమ్మో..అయ్యో..అవునా..బాబో! మాట లెక్కచెయ్యకుంటె నీకు రిస్కు..రిస్కు ఫ్యూచరంటు ఉంటె చెప్పు నీకు రేపు...రేపు చెప్పినట్టు వింటె బతుకుతావు బాసు..బాసు అవునా..అట్నా..సర్లే..చెప్పూ! హేండ్ వాషు హేండ్ వాషు హేండ్ వాషు హేండ్ వాషు బాబూ నువ్ మర్చిపోకు హేండ్ వాషూ! ||హేండ్ వాషు||