Contributed by Saheed Syyed
" మనిషి "అన్ని ప్రాణుల్లోకి తెలివైనవాడు ! హు !! ఈ మధ్య ఇది విన్న ప్రతిసారి నాకు నవ్వొస్తుంది , నవ్వే కాదు బాధ కూడా వేస్తుంది, మీరు అనుకోవచ్చు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిని కనిపెట్టింది మనిషే కదా, మరి ఎందుకు నేను ఇలా అంటున్నాను అని. మనిషి తన తెలివిని ఉపయోగించి కనిపెట్టిన అన్ని వస్తువులతో పాటు, ఒక "ఎలియన్ " ని కూడా కనిపెట్టాడు. అప్పుడు ఆ మనిషి కి తెలియలేదు అది తనకంటే తెలివైనది బలమైనది అవుతుందని. మనిషికి తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దానికి తెలుసు , ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ ఒక్క ఎలియను ఉంటే చాలు.
ఆ ఎలియన్ కి మాత్రమే తెలుసు ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎలా బయటపడాలో అని, ఆ ఎలియన్ కి మాత్రమే తెలుసు గవర్నమెంట్ తో సులువుగా ఎలా పనిచేయించుకోవాలో అని, ఆ ఎలియన్ మాత్రమే ఒక కూతురి పెళ్లి చేయగలదు, ఆ ఎలియన్ మాత్రమే ఒక మెడికల్ సీట్ ని తెప్పించగలదు, ఆ ఎలియన్ మాత్రమే ఒక కొడుకుని ఇంజినీర్ చేయగలదు, ఇలా ఇంకా ఎన్నో ఎన్నేనో పనులు ఆ ఎలియన్ చేయగలదు.
ఈ పాటికి తెలిసి ఉంటుంది ఆ ఎలియన్ ఎవరు అనేది, అవును! అది ''డబ్బు!!'' . ఇప్పుడు ఒప్పుకుంటారా నా మాటలలో నిజం ఉందని. నిజానికి ఆ ఎలియన్ కి అంత బలం ఇచ్చింది మనిషే, అన్ని పనులకు ఆ ఎలియన్ ని వాడి దాని బలాన్ని, తెలివిని రోజు రోజు కి పెంచింది మనిషే. ఇప్పుడు ఆ ఎలియనే లేకపోతే ఆ మనిషే లేడు. చూడండి ఎంత చోద్యమో మనిషి కనిపెట్టిన ఎలియనే లేకపోతే ఆ మనిషే ఎందుకు పనికిరాదంట , ఇప్పుడు మీకు కూడా నవ్వొస్తుంది కదా ! అంతటి పరిస్థితి కి దిగజారాడు మనిషి ,మరి ఇంకా ఎలా అనగలం ఆ మనిషి గొప్పవాడని, తెలివైన వాడని.
కానీ ఎందుకో నాకు ఇంకా అనిపిస్తుంది కొన్ని విషయాలలో ఆ ఎలియన్ ఎందుకు పనికి రాదని , మరి అలాంటి విషయాలలో మనిషే కదా గొప్పవాడు తెలివైన వాడు
ఆ ఎలియన్ కి ఏమి తెలుసు ఒకరి పెదవి అంచున నవ్వు రావాలంటే ఎం చేయాలో అని ! ఆ ఎలియన్ కి ఏమి తెలుసు ఒకరి ఆకలిని ఎలా తీర్చాలో అని ! ఆ ఎలియన్ ఒక మంచి స్నేహితుడిని ఇవ్వలేదు !
ఇప్పుడనిపిస్తుంది ఆ ఎలియన్ ఎందుకు పనికిరాదని !
ఇప్పుడనిపిస్తుంది ఆ ఎలియన్ మనిషి కంటే తెలివైనది కాదు అని !
ఎంతో తెలివైనదాన్ని అని ఫీల్ అవుతున్న ఆ ఎలియన్ ని చూస్తే బాధేస్తుంది. తాను కనిపెట్టిన ఎలియన్ కింద మనిషి చితికిపోడని , మనిషే గొప్పవడాని మళ్ళీ నిరూపించుకుంటాడాని కోరుకుంటూ.