Contributed By MV Srikanth
చదవాలి అనుకునే ప్రతి పని పిల్లల గుండె చప్పుడు ఎంత గట్టిదో చాటి చెప్పే పాట ఇది. కారణాలు ఏమిటో తెలియదు గాని, చాలా మందికి ఈ పాట చేరలేదు. వనామాలి గారు ఎంతో గొప్ప భావోద్వేగాలను చాలా సరళంగా రాసారు. ఆయన సాహిత్యానికి జోహారులు.. కుదిరితే వినండి.. వినిపించండి..!!
పద పదమంది పసి కంటి స్వప్నం, గడ గడ లాడాని ఈ చేదు సత్యం. బెదరద అంబరం. కలిపితే స్వరమందరం.
ఎదో నాడు నన్నే చూపించి లోకం మెచ్చగ.. ఆ బడి వైపు ఈ పాదం ఈనాడే సాగని.
ఎన్నో వేలు సంపాదించేటి ఆశే తీరగ. నా గమ్యాన్ని చేరే ఆ చదువులే చదవని..
వెతలు దాచి నన్నే నవ్వించి, వెలుగంత నాకిచ్చి, బ్రతికేటి మా అమ్మ కి.. నా రెక్కలు కరిగించి, తన చిరుగులు కనిపించని, ఓ నూలు చీర కానుకీయనా...
మెరిసే మినుగుర్ల వైపే చూసే ఈ లోకమంత.. చరితే మార్చబోయే, సూర్యుల్నే చూడనంద.. చినుకై, అలలై, వరదై, కడలై, ఎదిగే... కలనే చిదిమే బలమే కలదా.. విధికే???
కలగన్నది తీరగ సాగే నా దారిలో.. కడగండ్లను దాటుతూ పోనా.. మహారాజుగ మారనా.. ఈ కోటికి, పదిమందికి నీడనే కానా.. ఇప్పుడీ కథ చూడగా నేటి లోకానికే, నేనే ఒక వార్తనై రానా...
రచన : వనామాలి గారు చిత్రం : 180