29 రాష్ట్రాలు, 130కోట్లకు పైగా జనాబా ఉన్న మనదేశంలో అమ్మ పాల బ్యాంకులు కేవలం 15 మాత్రమే ఉన్నాయి. బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకుల అవసరంతో పాటు వీటి అవసరం కూడా దేశ ప్రజలకు ఉంది. పుట్టినప్పుడు నుండి కాదు బిడ్డ కడుపులోకి రాకముందు నుండే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఏ లోపాలు లేని పిల్లలు జన్మిస్తారు. పుట్టినప్పుడు మొదటిసారి నుండి ఖచ్చితంగా తల్లి పాలే పట్టండని అవ్వే పిల్లలకు చాలా ఆరోగ్యకరమని డాక్టర్లు సూచిస్తారు. కాని ఈ మధ్య తల్లి అవుతున్న ఎంతోమంది స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలతో పాలు రాకపోవడం, ఇంకా పిల్లల పాలపోడి ధర కూడా చాలా ఎక్కువగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన తెలంగాణలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి కాని అవి పేదవారికి అందుబాటులో లేవు.
దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకా "ధాత్రి అనే స్వచ్ఛంద సంస్థ వారు కలిసి హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లో మొదటి తల్లిపాల బ్యాంక్ ను మే 30న ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ లోని మరిన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లలో విస్తరించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. తల్లి పాలు అంటే అవి ఒక తల్లి దగ్గరి నుండే తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిపాలు ఎక్కువగా లభించేవారి నుండి పాలు సేకరించి దానికి అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఏ బాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు మొదలైనవ హానికరమైనవేవి లేవని నిర్ధారణ జరిగిన తర్వాత తల్లిపాలు అందని పిల్లలకు ఈ బ్యాంక్ వారు ఉచితంగా అందిస్తారు.