హైదరాబాద్ గచ్చిబౌలి లోని మోతీ మహల్ రెస్టారెంట్ లో వేసిన మొదటి అడుగులోనే వారి 100 సంవత్సరాల చరిత్ర ఫోటోల రూపంలో బ్రీఫ్ గా మనకు దర్శనమిచ్చేస్తుంది. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు లాంటి నాయకులతో పాటుగా మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారు లాంటి మహనీయ వ్యక్తులు కూడా మోతీ మహల్ లో రుచికరమైన విందును ఆస్వాదించిన వారే..
ఏ బిజినెస్ ఐనా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలంటే కస్టమర్ ఊహించినదానికన్నా మనం ఎక్కువ అందించినప్పుడే వారి ఆశ్చర్యమే సక్సెస్ ను కూడా అందిస్తుంది. అలా ఒక సంవత్సరం కాదు,10 సంవత్సరాలు కాదు ఇలా దాదాపు100 సంవత్సరాల పాటు విజయాన్ని అందుకుంటున్నారంటే వారు ఎంతలా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్ డేట్ అవుతున్నారనేది పరిపూర్ణంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే బటర్ చికెన్, దాల్ మఖని, కబాబ్ మొదలైన వంటలను కూడా ప్రపంచంలో మొదటిసారి తయారుచేసింది కూడా వీరే.. 1920లో నాటి ఉమ్మడి భారతదేశం పెషావర్(పాకిస్థాన్) లో దీనిని కుందన్ లాల్ గుజ్రాల్ గారు మోతీ మహల్ ను స్థాపించారు. కుందన్ లాల్ గారు గొప్ప చెఫ్. వంట విషయంలోనే కాదు కొత్త వంట పద్దతులను కనుగొనే విషయంలోనూ.. బటర్ చికెన్ మాత్రమే కాదండి, నేలను కొంత తవ్వి అందులో చికెన్ వండితే ఎంత మధురమైన రుచి వస్తుంది అని ప్రపంచానికి తెలియజేసింది కూడా కుందన్ లాల్ గారే. 1920 నాటి నుండి భారతదేశంలోని అన్ని ప్రముఖ పట్టణాలతో పాటుగా అరబ్ దేశాలలో సైతం వ్యాపారం విస్తరించారు.
అఖండ భారదేశంలో మోతీ మహల్ ఇప్పటికీ 120 ప్రాంతాలలో స్థాపించబడి అసలైన రుచులను రుచి చూపిస్తుంది. చికెన్ బిర్యాని అనేది ఒకటే, బటర్ చికెన్ అనేది ఒకటే, కాని ఎందుకు ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో టెస్ట్ ఉంటుందంటే అది చేసేవారి పనితనాన్ని బట్టి ఉంటుంది. అసలైన ఫుడ్ అద్భుతంగానే ఉంటుంది. కొంచెం లేట్ ఐనా గాని మోతీ మహల్ లోని ఫుడ్ ని నమిలి మాత్రమే కాదు ఆ రుచిని ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ నెమ్మదిగా తినేస్తుంటాం.
ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటీరియర్ గురుంచి.. మిగిలిన రెస్టారెంట్లో స్పెస్ తక్కువ ఉండడం వల్ల పెద్ద ఫ్యామిలీలకు, ఇతర ఫ్రెండ్స్ పార్టీలకు అంతగా కన్వీనియంట్ గా ఉండదు మోతీ మహల్ లో ఆ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయం. రెస్టారెంట్ విశాలంగా ఉండడంతో పాటు డైనింగ్ టేబుల్ 10 నుండి 20 కి పైగా కూర్చునేంత పెద్దగా ఉండడంతో ఎక్కువమందితో భోజనాన్ని ఎంజాయ్ చేయవచ్చు.