Contributed By Phaneendra Varma
థాంక్యూ నాన్న! అమ్మకు తోడువైనందుకు, నాలో అంత్రలీనమైనందుకు.
థాంక్యూ నాన్న! నాకు నడక నేర్పిపించినందుకు, నీ నడవడిక చూపినందుకు.
థాంక్యూ నాన్న! నా ఆకలిని తీరుస్తునందుకు, నీ ఆశల కోసం ఆలోచించనందుకు.
థాంక్యూ నాన్న! నన్ను నిద్రపుచ్చినందుకు, నీ కలల్లో నాకోసం కాపుకాసినందుకు.
థాంక్యూ నాన్న! నన్ను బడికి పంపించినందుకు, నాకు బంధాల రుచి చూపించినందుకు,
థాంక్యూ నాన్న! నాకు దారి చూపినందుకు, నేను దారి తప్పినప్పుడు దండించినందుకు.
థాంక్యూ నాన్న! నన్ను నీ గుండెల మీద బరువనుకోనందుకు, నాకు జ్ఞాపకాలు ఇచ్చినందుకు.
థాంక్యూ నాన్న! నన్ను కాపాడే దైవమైనందుకు, నా భయానికి ధైర్యమైనందుకు,
థాంక్యూ నాన్న! నేను ఓడినప్పుడు నా భుజం తట్టినందుకు, నా గెలుపులోని ఆనందాన్ని చూసినందుకు, నాతోనే ఉన్నందుకు, నన్ను భరించినందుకు.
థాంక్యూ నాన్న! నాకు ఎన్నో కథలు చెప్పినందుకు, నా కథలో హీరో అయినందుకు.
థాంక్యూ నాన్న! మంచిదో, చెడ్డదో గొప్పదో, చెత్తదో అదృష్టమో, దురదృష్టమో ప్రపంచానికి పరిచయం చేసినందుకు.
క్షమించు నాన్న! నిన్ను అర్థం చేసుకోవడానికి ఇంతకాలం తీసుకున్నందుకు, నీ కంట తడికి కారణమైనందుకు, నీకు కోపం తెప్పించినందుకు.
పిల్లల కలలను కూడా తమ కలలుగా భావించే తండ్రులందరికీ శుభాకాంక్షలు.