ఎస్.పి.బాల సుబ్రమణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, పి.బి శ్రీనివాస్ ఇలా తెలుగు గాయకులైన మనవాల్లు తమిళ, కన్నడ వంటి ఇతర భాషలలో వందలాది పాటలు పాడి వేలాది మంది అభిమానులను, ఎన్నో జాతీయ,రాష్ట్రీయ స్థాయి పురస్కారాలను గెలుచుకుంటే కె.జె యేసుదాస్, కె.యస్ చిత్ర, శంకర్ మహదేవన్ లాంటి పరభాషా గాయకులు తెలుగు లో మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించారు.
ఆ వరసలో ముందుంటారు మధుర గాయకుడు హరిహరన్.. తన గాత్ర మాధుర్యుంతో దేశ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన హరిహరన్ రెండు సార్లు జాతీయ అవార్డు, పలు రాష్ట్ర ప్రభుత్వాలనుంచి ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.(అన్నయ సినిమాలో పాటకు గానూ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు).. ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.
దక్షిణ భారతం నుండి హిందుస్థానీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన అతి తక్కువ మంది మహానుభావులలో ఆయన కూడా ఒకరు.. ఎ.ఆర్ రెహమాన్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయిన
ఆయన తెలుగు లో కొన్నే పాటలు పాడారు... అవి ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి.. వాటిలో తప్పక వినవలసినవి.
1. నెల్లూరి నెరజాన
2. గుమ్మాడి గుమ్మాడి
3.ఉరికే చిలుకా
4. రోజావే చిన్ని రోజావె
5.అమ్మో అమ్మాయేనా
6. యమహా నగరి కలకత్తాపురి
7. హిమ సీమల్లో(అన్నయ)
8. లాలి లాలి అంటూ(ఇందిర)
9. మళ్లీ కూయవే గువ్వా మోగిన అందెలమువ్వ
10. కొమ్మా కొమ్మా విన్నావమ్మా
11. వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
12. పచ్చందనమే పచ్చదనమే
13. యమునా తీరం
14. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
15. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర