అది ఇక రోజు రాత్రి 8:00 గంటలకి చాలా చిరాకు గా ఉండి, T.V చానెల్స్ అన్నీ మారుస్తూవెళ్తున్నా . న్యూస్ అంటే మనకి పడదు , కార్టూన్స్ చూసే age కాదు , సినిమాలు YouTube లో తప్ప T.V లో చూసేది తక్కువ. అలా channels మార్చేకొద్దీ ఒక interesting ప్రోగ్రాం కనిపించింది . ఇంక దానికి addict అయిపోయేలా చేసింది ఆ ప్రోగ్రాం. చిన్నా , పెద్దా వయసు తేడా లేకుండా అందరిని చూపు తిప్పుకోలేకుండా కట్టిపారేసిన ప్రోగ్రాం అండీ . అదే "Man vs. Wild" . కాప్షన్- మీ Discovery Channel లో ......
ఒక్కొక్కరోజు "ఛీ తీస్తావా లేదా" అని అమ్మ , "వీడేమిటిరా బాబు!" అని నాన్న , "అబ్బా అదరగొడుతున్నాడు " అని అక్క , "వాడికేనా పిచ్చేమిట్రా ?" అని తాతయ్య ..... ఇలా వీరు ఎప్పుడోకప్పుడు అనే ఉంటారు . దీనికి మన దేశం లో ఉన్న Youth మొత్తం కళ్ళార్పకుండా చూసే ప్రోగ్రాం ఇది మరీ ! అది అదృష్టం కొద్దీ తెలుగు లో రావడం ఒకెత్తయితే , అందులో అతడు చేసే మనుగడ విన్యాసాలు మరో ఎత్తు . అతడే వన్ అండ్ ఓన్లీ "Bear Grylls" ఈయనకు కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారండోయ్ . యూట్యూబ్ లో "Man vs Wild " spoofs అని కొట్టండి తెలుస్తుంది మీకే.
అతడి విన్యాసాలు, చేష్టలు ఎంత నచ్చుతాయంటే , అతడిలా ఒక్కరోజైనా ఉండాలనిపిస్తుంది , కానీ తప్పిపోయి కాదండోయ్ ! అతడిలా విమానం లోంచి దూకేసి Sky Diving చెయ్యాలని ఎందుకుండదు ? ఇక అతగాడి మనుగడ మీద ఒక look వేద్దామా !!!
First - Food : అతడు తినే తిండి ఈ ప్రపంచం లో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే , అంతా Raw food ఏ కదా ! "ఛీ కాకరకాయ ఎవడైనా తింటాడా ? " అని అనే ముందు , అతడు తినే పాములు , కీటకాలు గుర్తుచేసుకొని Inspiration పొందాలి ! "అమ్మా కూర ఏంటీ పచ్చి గా ఉంది ?" అని అనే ముందు , అతడు తినే పచ్చి చేప ని ఊహించుకోండి ! Of course అతడి టేస్ట్ లు మన టేస్ట్ లు వేరు అనుకొండీ - Just Saying
Second - Sleep : మన బెడ్ సరిగ్గా లేకపోతే మనకి సరిగ్గా నిద్రే పట్టదు . అతడు పడుకునే స్థితి చుస్తే అవాక్కవ్వాల్సిందే ఎవరైనా ! ఆకులు , రాళ్లు , తీగలు తో బెడ్ నే తయారుచేసుకుంటాడు .
Third - Camp Fire ఇది మాత్రం మిగిలిన వాటికన్నా హైలైట్ . మంచు, వాన లో కూడా పొయ్యి వెలిగిస్తాడంటే ఇంక చేప్పేదేముందండీ ! మళ్ళీ అందులో దుంపలు ఆకులు ఉడికిస్తాడు చూడండీ అబ్బబ్బ ! Tour కి వెళ్తే కనుక Camp Fire అలా వెయ్యాలనిపిస్తది !
Fourth - Atmosphere : కొంచెం చలి వేస్తేనే రెండు దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం . కొంచెం ఎండ వస్తే అల్లాడిపోతాం . ఇతగాడు మంచు కొలను లో ఈత కొడతాడు , సహారా ఎడారి లో కిలోమీటర్-కిలోమీటర్లు నడుస్తాడు . How ? ఆ how I say ?!?
Fifth - Shelter : దీని గురించి ఏం మాట్లాడినా తక్కువే ! . ఆయన నిద్రపోని చోటు లేదు . అసలు ఆయనే అలా భయం లేకుండా పడుకుంటే , అయన చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారులెండి ! నదిలో వెళ్లాల్సివస్తే అప్పటికప్పుడు Boat తయారుచేస్కోవడం , కొన్నికొన్నిసార్లు చెట్ల మీద మకాం వెయ్యడం , ఇవన్నీ చూసి ఆశ్చర్యపోవడం లో తప్పే లేదు మరి !
Sixth -Clothing : ఇంక Clothing విషయానికి వస్తే ఎప్పుడు ఎలాంటి క్లోతింగ్ తీసుకోవాలో కూడా జాగ్రత్త పడతాడు . ఎక్కడ , ఎప్పుడు , ఎలా వేసుకోవాలో , నదిలో ఒక్క బట్టలతోనే మనల్నిమనం ఎలా కాపాడుకోవాలో క్లుప్తం గా చెప్తాడు . ఐనా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిలేండి .
ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో దీని మీద ఒక పేద్ద గ్రంధమే రాసేయచ్చు . అన్నట్టు గ్రంథం అంటే గుర్తొచ్చిందండోయ్ ! మన Bear గారు ఈ మనుగడ విన్యాసాల మీద అతడి అనుభవాలన్నీ కలిపి , ఒక book రాసారు . అదే "MUD , SWEAT & TEARS" కుదిరితే చదవండి మరి .
కానీ ఏమాటకి ఆమాట , మనిషి తప్పిపోతే ఎలా బ్రతకాలో అని చెప్పే ప్రోగ్రామ్స్ ఎన్ని వచ్చినా మనం Man vs Wild నే అంతగా అభిమానించేది దేనికంటే , అందులో Bear మాట్లాడే style , వివరించే సైన్స్ , చేసే సాహసాలు, వేసే జోక్స్ ....... ఎవ్వరూ చెప్పలేరు & చెయ్యలేరు .
అంత గా famous అవ్వబట్టే సాక్షాత్తు Obama గారు కూడా ఆ యాత్ర లో , security... తల ప్రాణం తోకకి వచ్చినా సరే భాగం అయ్యారు . 66 episode లు , 7 seasons , ఇంకా వేరే ప్రోగ్రామ్స్ తో Bear Grylls ప్రపంచ ప్రఖ్యాతికెక్కాడు . అచ్చం ఇలాగే " Steve Irwin" అని ఒకతను ఉండేవాడు . అప్పట్లో అతన్ని "The Crocodile Hunter" అని పిలిచేవాళ్లమంటే అతిశయోక్తి కాదు .
అన్నట్టు , మీకు తెలుసో లేదో కానీ , ఇంత ఘనత ఉన్న మన Bear గారికి మన Indian Army లో చేరాలని ఉండేదట ! కానీ పరిస్థితులు అనుకూలించలేదేమో , మనం ఆయన్ని miss అయ్యాం . మీలో చాలామంది ఈ ప్రోగ్రాం ని మళ్లీమళ్లీ చూసే ఉంటారు. Dear "ఇంకా చూడలేని సున్నితమనస్కులూ " , మనం ఎలాగో సైన్స్ పుస్తకాలని రోజూ చదవలేమ్ . కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసైనా Information + Entertainment = Infotainment పొందుతాం ! ఇంకెందుకు ఆలస్యం ? చూసేయండి మరీ !!!