Falling In Love With Someone Who's Already In Love - Part 1

Updated on
Falling In Love With Someone Who's Already In Love - Part 1
అరవింద్

"ప్రేమ" ఎప్పుడు ఎవరి పై, ఎలా ఎందుకో పుడుతుందో తెలీదు. ఆ ప్రేమను వారికి చేరవేసేంత దైర్యం ఎలా వస్తుందో అర్ధం కాదు. ప్రపంచం ఏంటో ఎలా ఉంటుందో అపుడప్పుడు తెలుసుకుంటున్న ఆ రోజుల్లో మొదటి సారి తనని చూసాను. ఇంకా చూస్తూనే ఉన్నాను. అప్పుడు చెప్పాలంటే భయం, ఇపుడు దగ్గరకి వెళ్లాలన్నా బాధ. సమయం కోసం ఎదురుచూస్తూ కారణాలతో తిరిగొస్తున్నాను. నా పేరు ఆనంద్. తను "స్పందన" .

"ఇన్ని రోజులు ఎదురు చూసావ్ ఒకసారి తనతో వెళ్లి మాట్లాడితే సరిపోయేది కదరా?" "మనకి ఇష్టమైన వారు వారికి ఇష్టమైన వారితో ఉన్నప్పుడు, వారి ఇష్టం కోసం మన ఇష్టాన్ని చంపుకోవటం లో తప్పు లేదు." "ఏమంటున్నావ్ రా?" "తను ఇంకొకరిని ప్రేమిస్తుంది రా" "నిజామా? తను నీకు చెప్పిందా?" "తను దూరంగానే బాగుంది మామ, దగ్గరయ్యే కొద్దీ, తనని తెలుసుకునే కొద్దీ, నా గుండె బరువెక్కుతుంది." "ఎవరిని ప్రేమిస్తుంది రా?" "సందీప్" "వాట్? నిజామా?? వాడు స్నేహ ని ప్రేమిస్తూ, మళ్ళీ ఇదేంటి రా? కాలేజీ మొత్తానికి ఈ విషయం తెలుసు. తనకి తెలీదా?" " తెలిసినా పట్టించుకోనంత ఇష్టపడుతుందేమో రా." "ప్రేమ గుడ్డిది అంటారు. మరి ఇంత అనుకోలేదు రా

****** స్పందన

"ప్రేమంటే నమ్మకం లేదు. ప్రేమకి అర్ధమే తెలియదు. కానీ ఇపుడు తనకి నామీద ఉన్న ఇష్టాన్ని ప్రేమ అని అనుకోవటమే నమ్మకమా? ఒకరితో ప్రేమలో ఉన్నాడు అని తెలిసిన మళ్ళీ తనతోనే వెళ్ళటం ప్రేమ? నాతో ఉన్నపుడు కూడా ఇంకొకరితో ఇలా చేస్తాడు అనే ఆలోచన అనుమానమా? ప్రేమంటే నమ్మకమే అయితే నాకు తనమీద నమ్మకం లేకపోయినా తనతో ఉండాలి అనిపిస్తుంది ఎందుకు? నా పేరు స్పందన, తను సందీప్.

"జీవితం అంత ఒంటరిగా ఉండటం వల్లనేమో, తను నా పై చూపిన కొంచెం కేరింగ్ ని ప్రేమ అనుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ జాగ్రత్త అనుమానాలకు దారితీస్తుంది. కారణం లేకుండా మొదలైన మా ప్రేమ, ఇపుడు కారణాలతోనే కలుషితమయిపోయింది."

"ఇంతలా బాధపడకే, నువ్వు తప్పు చేయాలి. నీ స్థానం లో ఎవరున్నా అంతే చేసేవారు"

"వాడు ఇలాంటోడో తెలిసినా ఎందుకు ప్రేమించాను అని నేను ఎపుడు బాధపడలేదు."

"మరి ఇపుడు ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చుని ఏడుస్తున్నావ్?"

"ప్రేమ లో ఎంత నిజం ఉంటె, కన్నీటిలో అంత బరువు ఉంటుంది. ఆ బరువుని దించుకుంటున్నానే"

కారణం లేని ప్రేమ కారణాలతో కలుషితమయిపోకుమా బ్రతుకుకి అర్ధం చూపిన బంధమా బ్రతుకుని భారం చేయకుమా నీడలా నా వెంట ఉన్న నేస్తమా అనుమానపు చీకటిలో నన్ను వదిలిపోకుమా

చూపులు కలిసిన ఆ క్షణం చూపులు కలుపలేని ఈ క్షణం నవ్వులు, చిందులు ఆ క్షణం నిట్టూర్పులు మిగిలిన ఈ క్షణం నువ్వుంటే దైర్యం ఆ క్షణం నువ్వంటే భయం ఈ క్షణం

కన్న కలల్ని కమ్మేసింది ఈ ప్రేమ ఎందుకు నీకీ ప్రేమ అంటే నేనెక్కడ విన్నా తప్పు చేసానని తెలిసాక ఇలా ఒంటరిగా కూర్చున్న విఫలం అయినా ఈ ప్రేమ కథే నాకు ఓ పాఠం అనుకున్న వదిలేసినా కలల్ని వెతుక్కుంటూ ముందుకు పోతున్నా

*******

సందీప్

"సందీప్, నువ్వెంటో ఈ కాలేజీ అందరికి తెలుసు, ఎంత మంది అమ్మాయిలతో తిరిగేవో అంత తెలుసు.. ఏమని నమ్మమంటావ్?"

"అమ్మ మీద ప్రేమ ఉందని, నాన్నని దూరం పెడతామా? తాజ్ మహల్ అంటే ఇష్టం ఉందని, చార్మినార్ ను చూడకుండా వదిలేస్తామా? అందాన్ని ఆరాధించటం Its my weakness. ఈ ప్రేమని నమ్మలేం. ఇప్పటి వరకు చాల మందితో తిరిగా, కానీ ఎప్పుడు నాకు నీతో ఉన్నపుడు కలిగిన ఫీలింగ్ రాలేదు. నీతో ఉండాలనిపిస్తుంది, నీతో తిరగాలనిపిస్తుంది. ఐ లవ్ యు అనన్య."

To be continued..