Contributed By Hari Atthaluri
కొన్ని పాటలు సినిమాలోని ఒక వ్యక్తి గురించి రాసిన, ఆ పాట వేరే చాలామంది వ్యక్తిత్వాన్ని, అంతర్మథనాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి పాట ఇది. ఈ పాట జార్జ్ రెడ్డి మూవీ కోసం రాసినా... ఈ పాట లోని ప్రతి పదం.... ప్రతి తల్లి కి తన కొడుకు పైన ఉన్న ప్రేమ కి నిదర్శనం... నలుగురు కోసం నిలబడే నాయకుడు కి ఐనా... దేశం కోసం పోరాడే సైనికుడు కి ఐనా ఈ పాట సరిగ్గా సరిపోతుంది.... వాళ్ళ అమ్మ లు పడే బాధని.. బయట పడలేని ప్రతి తల్లి అంతర్మథనం ని అద్భుతం గా రచయత Charan Arjun ఆవిష్కరించారు..
నా లాగే అన్ని నాలాగే అంటూ సాగే ఈ పాటలో.... తన కొడుకు నలుగురు లో ఒకడు గా ఉంటే చాలు అనుకుంటే... నలుగురికి ఒక్కడే లా పెరిగితే.... కళ్ళ ముందే పెరిగిన కొడుకు... తన కళ్ళ ముందే చావు తో పోరాడుతూ ఉంటే... తను చెప్పకపోయినా తన కొడుకు చేసే పోరాటం...నేర్చుకున్న త్యాగం...చేసే సాయం.. అలా తన బిడ్డ చేసేది తప్పో ఒప్పో అర్దం కాక... తల్లడిల్లుతున్న తల్లి బాధ ని... తనకి కాకుండా పోయినా... ఎదుగుతున్నాడు అనే గర్వం ను.. అంతలోనే తనకి ఎప్పటికీ కనపడడు ఏమో అనే భయాన్ని..... కన్న కడుపు ని.... ఆ కడుపు లో దాచుకున్న ఆలోచనలని కలం తో కొత్త గా పరిచయం చేశారు....
Here are the lyrics: "నా లాగే..అన్ని నా లాగే... నా చిన్ని కన్నా.... చూస్తున్నా నన్ను నీ లోన... చినుకల్లే నువ్వే ఉంటే... అది నాకు చాలనుకుంటే... సంద్రం లా నువ్వే పొంగావా!! మెల్లగా మెల మెల్లగా తొలి అడుగులేసిన ప్రాయం... నేటికీ నే మరువలే... ఇంతలోనే ఎంతటి గాయం.... వెలుగుకా ! అది వెనకకా !! ఎటు వైపు కో నీ వేగం... ఏనాడూ నే నేర్పలేదే నీకు ఇంతటి త్యాగం... పువ్వైయావో... ముల్లు అవ్తున్నావో... గుర్తించలేక ఉన్నాను చెట్టు కొమ్మోలే... నిన్ను ఐతే కన్నా కాని .. నీ రాత ని కనుగొన లేను... యే తీరం నీ కథ చేరేనో.... నిద్దరే అసలోద్దని నిత్య పొద్దు పొడుపు వే నీవు.... నల్లని ఆ మబ్బు లే కమ్మేయగలవా నిన్ను .. అమ్మ కే ఇక అందని శిఖరాల కి వెళుతున్నా వు... ఈ నేలపై ప్రతి అమ్మ కు కొడుకు లా నువు ఎదిగావు .. పోరాటం నీ నెత్తురు లో ఉందా.. నా పెంపకం లో ఏదో పొరపాటు జరిగిందా !! గర్వం గా ఉన్నా కానీ... కన్నా నా భయం నాది.. ఎంతైనా కన్న కడుపు ఇది...