An Unexpected Twist: Here’s The 3rd Part Of Feel Good Love Story – Naa Nuvvu Nee Nenu!

Updated on
An Unexpected Twist: Here’s The 3rd Part Of Feel Good Love Story – Naa Nuvvu Nee Nenu!

Click here for PART 1:

Click here for PART 2:

నిధి తండ్రి - నిధి నీ పెళ్లి గురించి నేను ఎవరితోనో మాట్లాడాల్సిన పనిలేదు,నీకు ఏది మంచో అదే చేస్తాను,నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు,నీ పెళ్లికి చేసి నా బాధ్యత తీర్చుకుంటాను నిధి - నాన్నా నేనేమి బరువుని కాదు దించుకోడానికి,ఒంటిమీద బురదని కాను వదిలించుకోడానికి మీ కూతురిని నిధి తండ్రి - నా కూతురివి కాబట్టే నేను చెప్పేది వినమంటున్నా నువ్ నా పరువు,నా ప్రతిష్ట, గౌతమ్ - సర్ ఓసారి నేను చెప్పేది కూడా వినండి సర్ నిధి తండ్రి - ఎవరో బయటివాళ్ళు నా ఇంటి విషయం లో జోక్యం చేసుకోడం నాకిష్టం లేదు గౌతమ్ - నేను బయటివాడినే,కానీ మీ అమ్మాయి మనసులో ఉన్న వాడ్ని నిధి తండ్రి - బాబు, నా ఇంటికి అల్లుడు అంటే అదో హోదా,బయట సమాజంలో ఒక స్థాయి ఉండాలి,అప్పుడే ఈ ఇంట్లో,నా కూతురి పక్కన స్థానం ఉంటుంది దానిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను .నీకంటూ ఏముందని ఇవ్వాలి సంపాదన లేదు,నా అనేవాళ్ళు లేరు గౌతమ్ - సర్ నా ప్రపంచమే తను,నా అనేవాళ్ళు లేరు కాబట్టే ప్రేమ విలువ తెలుసు,సర్ సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి,కానీ సాధించాలంటే ఒకే మార్గం ఉంది,నా సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నా, నా బిజినెస్ మొదలెడుతున్నా,మా నాన్న సంపాదించింది ఎంతో కొంత ఉంది,దాదాపు 13 ఏళ్లుగా ఒక్కడినే ధైర్యంగా ప్రపంచం తో పోరాడుతున్నాను,మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చేసుకోగలను,మీరు ఓసారి స్థిమితంగా ఆలోచించండి సర్,సమాజంలో ఓ హోదాలో ఉన్నవారు,మీకు చెప్పే వాడ్ని కాను,మీకు తెలియంది కాదు ….

నిధి తండ్రి - బాబు,ఆదర్శాలు అభ్యుదయాలు మాటల్లో చెప్పడానికే,పాటించడానికి కాదు ,నా కూతురు నా మాటే వినాలి తనకి నేను తండ్రిని అనుకుంటే గౌతమ్ - సర్ ఇది చేయమని చెప్పే హక్కు మీకుంది,కానీ ఇదే చేయాలి అని శాసించే అధికారం ఎవరికీ ఉండదు నిధి తండ్రి - నిధి నాకు ఈ వాదనలు అనవసరం ,నన్ను నలుగురిలో తలదించుకొమ్మంటావా గౌతమ్ - సర్,కోపంతో కాకుండా,ఓసారి మీ మనసు ని అడగండి సర్,ఏది సరైందో అదే చెబుతుంది నిధి - గౌతమ్,నాన్న ఎదో కోపం లో అన్నారు, గౌతమ్ - పర్లేదు నిధి , నిధి - రెండు రోజులయ్యాక నేనే మళ్ళి ఓసారి మాట్లాడతాను,నాకు నమ్మకముంది గౌతమ్,నాన్న ఒప్పుకుంటారు, మనిద్దరం ఎప్పటికైనా ఒకటవుతాం గౌతమ్ - సరే నిధి

నాలుగురోజులైనా నిధి నుండి ఏ కబురు లేదు,మొబైల్ ఆఫ్ అని వొస్తుంది,ఇంటికి తాళం వేసి ఉంది,మరుసటి రోజు,మాధవ చెప్పాడు,నిధి ని ఢిల్లీ తీసుకెళ్లారని,అక్కడే పెళ్లి జరిగిందని,వాడు ఎం చెప్తున్నాడో కూడా అర్ధం అవ్వలేదు,గుండెని పదునుగా ఉన్న కత్తితో కోసేసినట్టు అనిపించింది. ఎందుకో ఆ నిమిషం ఇక నాకు ఈ లోకంలో ఏదీ లేదు అని అనిపించింది,నిధి లేని జీవితం నేను కలలో కూడా ఊహించలేదు,ఇప్పుడు తను వేరొకరి భార్య,నాకు తెలుసు,తనెంత యాతన అనుభవించిందో,ఐదేళ్ల ప్రేమ,పాతికేళ్ల కన్నవాళ్ళ ప్రేమ,రెండిట్లో ఎటువైపు అంటే,బహుశా నేను తన స్థానంలో నేను ఉన్నా నా ప్రేమని వొదులుకునేవాడినేమో, తను తప్పు చేసినట్టు నాకనిపించలేదు, తప్పలేదు కాబట్టి మౌనంగా తలదించుకుంది .నా రాత అంతే,నేను దేనిని కోరుకుంటానో,అది నాకు దక్కదు,ఎవరిని ఇష్టపడతానో,ఎవరిని ప్రేమిస్తానో వాళ్లు నాకు ఎదో ఓ రకంగా దూరం అవుతారు,అది నా తలరాత . తను పంచిన ప్రేమ,ఆ జ్ఞాపకాలు ఇవి తలచుకుంటూనే కాలం గడిపేవాడిని.

అర్ధాంతరంగా నిధి నా జీవితంలోంచి అంతర్ధానం అయిపోయింది,నా దేవత ఇక నాకు కనపడదు అనే నిజం మనసుకి మింగుడుపడలేదు,చాలా రోజులు పట్టింది నేను నోరు తెరచి మాట్లాడడానికి,ఇల్లు విడచి బయటకి రావడానికి అది కూడా మాధవ్ బలవంతం వల్ల . మాధవ్ నాతో ఎక్కువ కాలం ఉన్నది వీడు మాత్రమే,బాల్యం నుంచి నా మిత్రుడు,ఇప్పుడు నాకున్న ఏకైక ఆత్మీయుడు,బాధలో ఉన్నపుడు ఓదార్చే తోడు,భయంగా ఉన్నపుడు ధైర్యం,నా కష్టాలలో నాకు చేయందించే సాయం మాధవ. నా జీవితంలో చాల పెద్ద పాత్ర వాడిది,ఎదో ఒక వ్యాపకం అంటూ ఉంటె గుండెలో గాయాలు మానతాయని వాడికి తెలిసిన స్నేహితులతో కలిసి ఓ బిజినెస్ మొదలెట్టించాడు,నన్ను కూడా పార్టనర్గా చేర్పించాడు,ఒక 2 సంవత్సరాలు నన్ను నేను మర్చిపోతూ,నన్ను నేను మార్చుకొంటూ పూర్తిగా పని మీద శ్రద్ధ పెట్టాను, లాభాలొచ్చినపుడు నా వల్లే వొచ్చాయి అని ఆకాశానికెత్తారు,నష్టాలొచ్చినపుడు కూడా నా వల్లే అంటూ వేలెత్తి చూపించారు,నాకున్న ఆస్తిలో సగం ఆ నష్టాలు తీర్చాడనికే పోయింది అదీ నాది కాని తప్పుకి,మోసయించడమే ఈ యుగ ధర్మం,వాళ్ళు చేసినదాంట్లో తప్పులేదు,నా రాత వల్ల ఆ నష్టాన్ని పూడ్చడం నాకు తప్పలేదు.

ఈ సమాజానికి నేను సరిపోని మనిషిని,నేను ఈ మనుషులతో ఇమడలేను,మంచితనం చేతకానితనంగా మారింది, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా,నేనెవరో తెలీని చోటికి,నన్నెవరూ గుర్తుపట్టని చోటికి,నకిలీ నవ్వులకి,దూరంగా వెళ్లానని,ప్రకృతికి దగ్గరగా ఉండాలని,ఊరికి చాలా దూరంగా ఒక 20 ఎకరాలు భూమి కొన్నాను, అక్కడే,సాంప్రదాయ వ్యవసాయ పద్దతులతో కూరగాయలు పండించడం , ఓ మామిడి తోట,మిగిలిన దాంట్లో ఒక నర్సరీ. నా ఒంటరి తనాన్ని ఏకాంతంగా మార్చుకున్నాను ,అందరూ మనల్ని దూరం పెడితే ఒంటరితనం అందరికీ మనమే దూరంగా ఉంటె ఏకాంతం.. పచ్చదనానికి ,స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణానికి నా మనసు అలవాటుపడింది, నిధిని మర్చిపోలేదు కానీ తన తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకోడం లేదు,ఈ పనుల వల్ల.. ప్రకృతితొ మమేకేమై బతికేస్తున్నాను,ఉదయాన్నే పనివాళ్ళతో కలిసి నర్సరీలో పని, మధ్యాహ్నం మర్రిచెట్టు కింద పుస్తకాలూ చదవడం,మనసుకి నచ్చింది రాసుకోవడం, సాయంత్రం నర్సరీలో పని ,తోట పని, వారానికోసారి మాధవ్ పిల్లలతో ఆడుకోవడం,నేను ఇక్కడ ఉన్న విషయం మాధవకి మాత్రమే తెలుసు,ప్రతీ వారం నా దగ్గరికి తన కుటుంబం తో కలిసి వస్తుంటాడు,కుదరకపోతే వాడి పిల్లల్ని అయినా పంపిస్తుంటాడు,ఆ పసివాళ్లతో ఆడుతూ నేనూ పసిపిల్లాడిలా మారిపోయేవాడ్ని …..నిన్న సాయంత్రం మాధవ ఫోన్ చేసాడు,నేను రాత్రి వొస్తాను,మాట్లాడాలి అన్నాడు,10గంటల వరకు ఎదురుచూసి ఇంకా రాడేమో అని,పడుకున్నా,ఎదో తలుపు శబ్దం విని మెలకువ వొచింది,ఈ టైములో ఎవరు,మాధవ వొచ్చాడేమో అనుకోని తలుపు తీస్తే... .... ఎదురుగా ...... నిధి ……