చాంపియన్స్ బుక్ ఆఫ్ రికార్డ్.. గెలాక్సీ బుక్ ఆఫ్ రికార్డ్.. స్టార్ వరల్డ్ రికార్డ్.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్.. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్.. హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్.. ఏషియన్ వరల్డ్ రికార్డ్.. యూనివర్సల్ రికార్డ్ ఫోరమ్.. 50 ఏళ్లల్లో నాగేశ్వరరావు గారు గెలుచుకున్న రికార్డులు 567.
పేపర్ మీద మనం చేతితో రాసిన అక్షరాలను సరిగ్గా అదే విధంగా రాయడానికి ప్రయత్నిస్తే రెప్లికా ఎంత కష్టమో ఇంకాస్త ఎక్కువగా తెలుస్తుంది. న్యూస్ పేపర్ రాస్తున్నప్పుడు ఒక్క మిస్టేక్ జరిగినా మళ్ళీ కొత్త పేపర్ రాయాల్సి ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఈ ఘనతను పొందడానికి తన చుట్టూ కొన్ని వందల తెల్లకాగితాలతో రోజుల తరబడి కూర్చుని రాసేవారు. నాగేశ్వరరావు గారు 2004 లో మొదటిసారి కేవలం 15 రోజుల్లోనే ఈనాడు న్యూస్ పేపర్ ను(అన్ని పేజీలతో కలిపి) మక్కీకి మక్కి చేత్తో దించారు. దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వెళ్ళాక, అదే ఉత్సాహంతో 45నేషనల్, ఇంటర్నేషనల్ భాషలలోని న్యూస్ పేపర్లను అలాగే దించేశారు..
మన కరెన్సీ నోటు మీద ఎన్నైతే భాషలు ఉంటాయో అన్ని భాషాలలోని న్యూస్ పేపర్లను సేకరించి(మూడు భాషలకు లిపి లేదు), అక్షరాలను దిద్దడం ప్రాక్టీస్ చేసి ఒరిజినల్ న్యూస్ పేపర్ కు అతి దగ్గరగా పెన్ను సహాయంతో ప్రింట్ చేశారు. పూర్తిగా దీనికోసం మాములు పెన్ ను ఉపయోగించేవారు. పెద్ద హెడ్ లైన్స్ దిద్దడం సులభం, దానికింద వచ్చే చిన్న అక్షరాలు రాయడమే అసలైన కష్టం. అసలైన పేపర్ లో ఎంత సైజ్ వాడరో, ఎంత మార్జిన్ ను వదిలేశారో మొదలైన ప్రతి ఒక్క చోటుని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడికక్కడ పక్కగా అమార్చాలి లేదంటే జెన్యూన్ లుక్ రాదు.
ఒక్క న్యూస్ పేపర్ పరిధిలోనే కాకుండా నాగేశ్వరరావు గారు 6,00,600 లక్షల గుండు సూదులతో వివిధ రకాల మతాల పేర్లు, 13,200 వేల బ్లాక్ స్టిక్కర్స్ తో ఛార్లీ చాప్లిన్ బొమ్మ, 158 పేజీల బైబిల్, 120 సంవత్సరాల క్యాలెండర్, 41×56.5 సైజ్ లో "దార్ల" అనే ప్రత్యేకమైన న్యూస్ పేపర్, 24 గంటల వ్యవధిలోనే 22 పేజీల పెద్దబాలశిక్ష పుస్తకం(ప్రతిరోజు 8 గంటల చొప్పున 3 మూడు రోజులపాటు) బొట్టు బిళ్ళలతో బరాక్ ఒబామా చిత్రం, 36,600 సార్లు "ఇండియా" పేరుతో ఇండియా మ్యాప్ ను చిత్రించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి పెరిగి ప్రస్తుతం కొన్ని దశాబ్దాల క్రితం నుండి హైదరాబాద్ లో నివాసముంటున్న నాగేశ్వరరావు గారు చిన్నతనం నుండే చిత్రకళలో కోచింగ్ తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైల్లో చీఫ్ డిజైనర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు. నాగేశ్వర రావు గారి ఇంట్లో ప్రతిరోజు తాను వేసిన బొమ్మలతో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఇంటికి వచ్చి బొమ్మలను చూస్తూ ఆశ్ఛర్య పోయే పిల్లలకు, యువతకు "ఇదేమి బ్రహ్మ విద్య కాదు ఇలా మీరు కూడా చెయ్యగలరు అని విలువైన గైడెన్స్ ఇస్తుంటారు కూడా".