నాకు తెలుసు "నాని టిఫిన్స్" అనే పేరు చూడగానే మీలో చాలామందికి హీరో నాని గుర్తొచ్చుంటాడు. నేను అర్ధం చేసుకుంటాను లేండి. ఒక్కసారి నాని యాక్టింగ్ చూస్తే ఎలాంటి ఒపీనిన్ మన మనసులో నాటుకుపోతుందో అలాగే మీరు ఒక్కసారి నాని టిఫిన్స్ లో ఫుడ్ టేస్ట్ చేస్తే ఈసారి మీకు నాని అనే పేరు వినగానే రెండు ఆలోచనలు మీ మనసులోకి వచ్చేస్తాయనమాట. హైదరాబాద్ నక్లెస్ రోడ్ కార్నర్ రాణిగంజ్ ప్రాంతంలో ఈ నాని టిఫిన్స్ కు దశబ్ధాల చరిత్ర ఏమి లేదండి. ఇక్కడి ఫుడ్ టేస్ట్ వల్లనే అంతకుముందున్న టిఫిన్ సెంటర్ల దగ్గర ఆగకుండా ఇక్కడికి వచ్చేస్తుంటారు.
మనోళ్ళకు కావాల్సింది ఫుడ్ టేస్టీగా, శుభ్రంగా ఉండడం. అంతేకాని ఏసి, ఇటాలియన్ ఫర్నీచర్ అనేవి సెకండరీ. నాని టిఫిన్ సెంటర్ ఉండేది రోడ్డు పక్కన ఆరుబయట. మనం తినే ఫుడ్ ఎలా తయారవుతుందో మనమే చూసుకోవచ్చు. జనరల్ గా రెస్టారెట్స్ తో పోల్చుకుంటే టిఫిన్ సెంటర్స్ ఎంత చిన్నగా, ఇరుకుగా ఉంటాయో మనకు తెలుసు. పేరుకు నాని టిఫిన్స్ చిన్నగా అనిపించినా ఇక్కడ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తు, కబుర్లు చెప్పుకుంటు రిఫ్రెష్ అవ్వడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ 6 నుండి నైట్ 12 మధ్యలో ఎప్పుడు వెళ్ళినా కాని ఇక్కడ మనం కోరుకునే మన ఊహకందని రుచితో టిఫిన్స్ లాగించేయొచ్చు.
ప్రేమకు భాష లేదు ఒక నిర్దిష్టమైన పద్దతులు లేవి ఏవిధంగానైనా ప్రేమను తెలియజేయవచ్చు. ఇది ఫుడ్ కు కూడా వర్తిస్తుందండి. ఇడ్లీని ఒకే రకంగా డబ్బాలో వేసి ఉడుకబెడితే బోర్!! అదే పెనం మీద వేయించి స్పాట్ లో చేస్తేనే కదా కొత్త రుచి.. అలా స్పాట్ ఇడ్లీ దగ్గరి నుండి సాంబర్ ఇడ్లీ, తవా ఇడ్లీ.. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవల్సింది దోశల గురించండి. పిజ్జా దోశ, పనీర్ దోశ, చీజ్ దోశ, క్రీమ్ దోశ, ఆల్ మిక్స్ దోశ, బటర్ దోశ ఒక్కోకటి ఒక్కో అద్భుతం అనమాట. పర్స్ లో డబ్బు, కడుపులో ఇంకాస్త ఖాళీ ఉంటే ఇక్కడున్న వన్ని ఓ పట్టు పట్టేయ్యాలనిపిస్తుంది.
అన్ని ఇంగ్రీడియన్స్ తో పాటు నాని టిఫిన్స్ లో చేసే ఐటెమ్ కూడా బటర్ తో తడిసిపోతుంది. బంగారు పల్లెంలో తిన్నా కాని రాని రుచి, తృప్తి మన అరటి ఆకులో తింటే ఆ కలుగుతుంది. అన్ని ఇంగ్రీడియన్స్ సమంగా కలిపి చివరకు అరటి ఆకులో వడ్డించేంత వరకు కూడా భోజనప్రియులను ఆకట్టుకోవడం వల్లనే ఈ సెంటర్ ఇంత సక్సెస్ సాధించిందనమాట.