(Poem Contributed by Yeshwanth Kothapally)
నాన్నకు..ప్రేమతో...
నాన్న..
తల్లివయ్యావు నాకు.....ఆలన పాలన లో
గురువయ్యావు నాకు....క్రమశిక్షణ లో
మిత్రుడయ్యావు నాకు...సుఖ దుఃఖాలలో
అన్నయ్యవయ్యావు నాకు.....అన్ని అవసరాలలో
తమ్ముడయ్యావు నాకు...ఆట పాటలలో
అక్కవయ్యావు నాకు...అక్కున చేర్చుకోవట౦లో
చెల్లివయ్యావు నాకు....చిలిపి చేష్టలలో
తాతవయ్యావు నాకు...అనుభవాలు ప౦చట౦లో
మామయ్యవయ్యావు నాకు....నేనున్నా అని చెప్పట౦లో
బామ్మవయ్యావు నాకు ...కథలు చెప్పట౦లో
ఇలా..అన్ని నీవై ..నీకు నీవే మలుచుకున్నావు నాన్నవై...
కనుకనే నిలిచావు ..నా జీవిత స్పూర్తివై..
ఎల్లప్పుడు కోరుకున్నావు అభివృద్ది ...నా మార్గదర్శివై..
నడిపావు నన్ను ధైర్యమై
నిలిచావు నువ్వు నా దైవమై...
నాలోని నీకు నేను రాస్తున్న కవిత
నాన్నకు ప్రేమతో...