ఒకే రకమైన ప్రతిభ పదిమందిలో ఉంటే ఆ టాలెంట్ కు అంతగా గుర్తింపు రాకపోవచ్చు, ఒక కొత్తరకమైన ప్రతిభ తానే మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఈ రెండవ పద్దతినే ఎంచుకున్నాడు నిర్మల్ కు చెందిన అల్లం నవీన్ గారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎవ్వరు చేయ్యనట్టుగా బియ్యంతో, కొన్ని రకాల పదార్ధాలతో చిత్రాలు చిత్రించడం మొదలుపెట్టారు. ఆరువేల బియ్యపు గింజలతో ప్రతి గింజమీద కే.సి.ఆర్ అన్న పేరుని రాసి ముఖ్యమంత్రి గారి చిత్రాన్ని చిత్రించారు. ఇందుకోసం చాలానే కష్టపడ్డారు. ముందుగానే ఆరు వేల బియ్యపు గింజలను లెక్కపెట్టి, నెలల పాటు శ్రమించి మరి అద్భుతంగా రూపొందిచారు. భగత్ సింగ్, తెలంగాణ తోరణం, మొదలైన వ్యక్తుల చిత్రాలను కూడా సమ్మోహనభరితంగా రూపొందించారు.
ఈ చిత్రాలకు గాను తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బెర్కిలి క్రియేటివ్ ఆర్ట్స్ న్యూయార్క్ నుండి గౌరవ డాక్టరెట్ ను కూడా అందుకున్నారు. నవీన్ లాంటి టాలెంటేడ్ పర్సన్ గురించి మరింత వర్ణించడం కన్నా అతని పనితనాన్ని చూపిస్తే అతని గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
2222 మేకులతో రూపొందించిన భగత్ సింగ్ రూపం
6 వేల బియ్యపు గింజలతో కే.సి.ఆర్ గారి రూపం
తెలంగాణ తోరణం
తెలంగాణ మ్యాప్