6 దశాబ్ధాల సాహిత్యం మూగబోతుంది!
పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దలు..
అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నారు పెద్దలు, చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు మన కందుకూరి వీరేశలింగం గారు.. ఈ ఉద్దేశంతోనే ప్రజలకు సాహిత్య పరంగా సేవ చేయాలనే కాంక్షతోనే అట్లూరి రామ్మోహన్ రావు గారు నవోదయ పబ్లిషింగ్ సంస్థను గుడివాడలో(1957) స్థాపించారు..ఒకటి కాదు రెండు కాదు దాదాపు 6 దశాబ్ధాల వరకు పాఠకులకు వారి సంస్థ నుండి ఎప్పటికి గుర్తుండి పోయే పుస్తకాలను అందించారు..ఆ సంస్థల ద్వారా తమ రచనలు పబ్లిష్ కావాలని పెద్ద కవులందరూ ఆరాట పడేవారు..
శ్రీశ్రీ, బాపు రమణ, గోపిచంద్, ఆరుద్ర, గొల్లపూడి మారుతీరావు, రాచకొండ విశ్వనాథ శాస్ర్తి, నండూరి రామ్మోహణ రావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, నర్ల వెంకటేశ్వరరావు.. వంటి తెలుగ నాట గొప్ప కవులందరు నవోదయ ద్వారా తమ రచనలను కొనసాగించారు. నాటి కాలంలో నవోదయకు మంచి ఖ్యాతి ఉండేది..
పుస్తక ప్రేమికులందరికి నవోదయ పబ్లిషర్స్ అంటే ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం లాంటి పుస్తకాలను అందిస్తారని వారి నమ్మకం..
ఇంతలా మన అభిమానాన్ని అందుకున్న నవోదయం ఇక అస్తమయం కానుంది.. నేటి కాలంలో పుస్తక ప్రేమికులు తగ్గడం, ఉన్న వారిలో కూడ చాలా వరకు ఈ-బుక్స్ ద్వారా చదవడం, మంచి రచయితల లోటు, ఆర్ధిక లోటు ఇత్యాది కారణాల రీత్య నవోదయ పబ్లిషర్స్ సంస్థ తమ కార్యకలపాలు నిలిపివేసింది.. ఒక మంచి పుస్తకానికి జీవితాన్ని మార్చె శక్తి ఉంది అలాంటి ఎన్నో పుస్తకాలను ఎన్నో అందించిన నవోదయకు కృతజ్ఞతలు.. మీరు కార్యకలపాలను ఆపివేసినా మీరు అందించిన 60 సంవత్సరాల సాహిత్యం ఎప్పటికి మాతోనే చిరస్మనీయంగ ఉంటుంది.
ఈ-బుక్స్ కన్నా అసలు పుస్తకం కొనండి.. మీరు చదవండి ఇతరులను చదివించండి.. మన నాగరికతను కాపాడండి.. సద్గ్రన్థ భాండాగారాలను నిలపండి.. అవే మన నాగరికతకు పట్టుగొమ్మలు.పుస్తకాలు అనేవి మనకు మార్గదర్శనమ్ చేసే మిత్రులు.. బాధల్లో ఉన్నపుడు మనకు సాంత్వనం చేకూర్చే ఆప్తులు కూడాను ..అసలైన పుస్తకాలే కొనండి.. మీకు వీలు అయితే మంచి పుస్తకాలూ కొని అపుడపుడు చదవండి.. చదవండి చదివించండి.. పుస్తకాలు చదివితే కలిగే అనుభూతే వేరు.. మీకు చదవడం అస్సలు అలవాటు లేదా అయినా సరే కనీసం మీ ఇంటిలో అలంకారానికైనా పుస్తకాలు కొని శుభ్రంగా సర్ది పెట్టండి.. మీరు బహుమతులు ఇవ్వదలచుకుంటే ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి పుణ్యం కట్టుకోండి.. అందరికీ విన్నపం..
(Article inspired from an fb post by Veera Narsimha Raju)