వారిని కించపరచాలని కాదు కాని ఎక్కడో మనుషులకు దూరంగా ఉంటూ పోలీసులకు భయపడుతూ వెయ్యి సంవత్సరాల యుద్ధం అంటూ తమ జీవితకాలంలో సాధించేది ఏమింటుంది.? "రాజ్యాంగం" ఆ రాజ్యాంగాన్ని మర్చేందుకు కూడా హక్కులు కల్పించింది. ప్రజస్వామ్యంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో సాధించుకున్న మహా పురుషులను మనం చూస్తున్నాం.. ఉన్నత లక్ష్యమే కావచ్చు కాని నక్సలిజం ద్వారా సాధించినది చాలా తక్కువ. ఈ అభిప్రాయమే వల్లనే కాబోలు నక్సలిజం హింస అనే ఫ్లాట్ ఫామ్ నుండి ప్రజాస్వమ్యం అహింసా అనే ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చి తనదైన శైలిలో ఉద్యమం సాగుస్తున్నారు.
గాదె ఇన్నారెడ్డి గారు క్రైస్తవ మతంలో జన్మించడం, కుటుంబ నేపధ్యం మూలంగా చిన్నతనం నుండి ప్రజలకు శాంతిని అందించడం కోసం చర్చి ఫాదర్ అవ్వాలని కలలు కన్నారు. కాని వయసు పెరుగుతున్న కొద్ది నక్సలిజం భావాలు నచ్చడంతో పీపుల్స్ వార్ లో చేరి తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించి ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత కొన్ని ఉద్యమాలు, పరిణాలకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంవత్సరం జైలు జీవితం తర్వాతి జీవితానికి పునాది వేసిందనే చెప్పుకోవాలి. జైలులో ఉన్న పుస్తకాలు అనే మిత్రులను కలుసుకున్నారు ఆ పుస్తకాల చదవడం వల్ల ఎన్నో నిజాలను తెలుసుకున్నారు. ఊహా ప్రపంచం నుండి వాస్తవంలోకి రావడానికి పుస్తకాలు ఎంతగానో సహకరించాయి. సమాజం కోసం ఏదైనా చేయాలి, తన దగ్గరుగున్న గొప్ప ధైర్యాన్ని, శక్తి ద్వారా కొంతమంది జీవితాలనైనా బాగుచేయాలి అని జైలు జీవితంలోనే నిశ్చయించుకున్నారు.
ఆ తర్వాత జైలు నుండి విడుదల అయ్యాక కొంత డబ్బుతో వరంగల్ రేగడితండాలో ఆశ్రమాన్ని నిర్మించారు. ఈ ఆశ్రమంలో పిల్లలందరూ ఇన్నారెడ్డి గారిని భార్య పుష్పరెడ్డి గారిని మేడమ్ సార్ అని కాదు అమ్మ, నాన్న అని అత్మీయంగా పిలుస్తారు. కేవలం మాటల వరకే కాదు కొంతమందికి పిల్లలకు వారి తల్లిదండ్రులెవరో తెలియకుంటే తండ్రి పేరు ఇన్నారెడ్డి అనే రికార్డులలో రాయిస్తుంటారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు ఆనాధలందరూ "నా ఇల్లు" ఆశ్రమానికి కుటుంబ సభ్యులే. ఇక ఈ ఆశ్రమంలో ఉంటూ చదువు కొనసాగిస్తున్న పిల్లల ఖర్చులన్నీ దాతల సహాయంతో ఇన్నారెడ్డి గారే చూసుకుంటారు.. సమసమాజ స్థాపనే మన లక్ష్యమైతే దానిని చేరుకోవాడికి ఒక్కొకరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతదూరం ప్రయాణం చేశాక ఇది సరైన మార్గం కాదని తెలుసుకుని మార్గాన్ని సవరించడం తప్పు కాదు..