నందమూరి బాలకృష్ణ... ఆయన ఒక బలమైన తెలుగుతనానికి ప్రతీక, డైలాగ్ డెలివరీలో కానివ్వండి భాద్యతయుతమైన ఎమ్.ఎల్.ఏ గా, క్యాన్సర్ హస్పిటల్ ఛైర్మెన్ గా కానివ్వండి ఆయనకు ఆయనే సాటి. బాలకృష్ణ, నందమూరి తారక రామారావు గారికి 6వ సంతానం నటనలో ఎన్.టి.ఆర్ నుండి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. పేరులో కృష్ణుడు ఉన్న కూడా తన హృదయం మాత్రం శంఖరుడు.. బోళా శంఖరుడు. పైకి ఒకలా లోపల ఒకలా కాకుండా తనలోని కోపాన్ని, ప్రేమను కల్మషం లేకుండా పరిపూర్ణంగా ప్రదర్శిస్తుంటారు కొన్ని సార్లు ఆయన మాట కరుకుగా ఉండొచ్చు కాని మనసు మాత్రం చెరుకు బహుశా అందుకే కాబోలు ఆయనతో పనిచేసిన వారందరు మరో అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు.
ఎన్.టి.ఆర్ ప్రొడ్యూస్ చేస్తూ దర్శకత్వం వహించిన తాతమ్మ కలలో కేవలం 14 వ ఏట నుండే నట జీవితాన్ని మొదలు పెట్టారు నటనకు డిక్షనరీలా నిలిచిన తండ్రి ద్వారా నటనలో ఓనమాలు నేర్చుకుని కాలంతో పోరాడి నటనలో రాటుదేలాడు
రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు సార్లు ఉత్తమ నటుడిగా నరసింహనాయుడు, సింహా చిత్రాలకు అందుకున్నారు. నట జీవితంలో 42 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఇప్పటికి నిత్య విద్యార్ధిలా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. కమర్షియల్ చిత్రాలే కాకుండా Experimental సినిమాలలో కుడా విశేష ప్రతిభను కనబరిచారు అలాంటి వాటిలో మేటి చిత్రాలు
ఆదిత్య 369
భైరవ ద్వీపం
సుల్తాన్
శ్రీరామ రాజ్యం
పాండురంగడు
ఊ కొడతారా ఉలిక్కి పడతారా
అక్భర్ సలీం అనార్ఖలీ
గౌతమీ పుత్ర శాతకర్ణి