Contributed by Hareesh Neela
హాయ్ నీలా కొన్ని పరిచయాలు సమాధానాలతో మొదలు అయితే కొన్ని పరిచయాలు ప్రశ్నలతో మొదలు అవుతాయి. నీతో నా పరిచయం "నేను ఏంటి" అని తెలుసుకోవడానికి బయలుదేరిన నా ప్రశ్నతో మొదలు ఐంది . మొదటి సారి నిన్ను చూసినప్పుడే తెలియని అభిమానం,తెలుసుకోవాలి అన్న తాపత్రయం,మళ్ళి ఎపుడెపుడు చూస్తానా అన్న ఆరాటం. ఎన్ని problems ,ఎన్ని tesnions ఉన్న నీ దగ్గరికి వచ్చి మౌనంగా నీతో మాట్లాడే మాటలు ఆ బాధలన్నీ మర్చిపోయేలా చేస్తాయి. నువ్వు లోపల ఎంత కల్లోలం మోస్తున్న పైకి మాత్రం నిరంతరం ,నిశ్చలంగా, నిర్మలంగా అలా ఎలా ఉంటావో ,ఇది చూసే లోపల ఎన్ని బాధలు,భయాలు ఉన్న మొహం మీద చిరునవ్వుని ఉంచడం నేర్చుకున్న . నాతో మాట్లాడకుండానే నేర్పిస్తావ్ ,ఇది నువ్వు అని చెప్తావ్ ,నేను ఏంటో తెలుసుకునేలా చేస్తావ్ . నీతో గడిపే ఆ కొన్ని క్షణాలు నాకు ఎన్నో అనుభవాలు బహుశా కాలానికి నువ్వే inspiration ఏమో ,అసలు ఆగిపోవడం ,అలిసిపోవడం అనేదే తెలీదు దానికి నేను ఆగిపోయిన ప్రతి సారి ఒక దారిలా ,చీకటిలోకి వెళ్లిన ప్రతి సారి ఆ దారిలో దీపంలా నువ్వే ఉంటావ్. అంతులేని అర్ధం కానీ ఎన్నో ప్రశ్నలకి నీ ఉనికే సమాధానం నీ అనంతమే నా శూన్యానికి గమ్యం నా గతానికి నీడలా నా భవిష్యత్ కి ఆశలా నా జ్ఞాపకాలకు వారధిలా ఈ క్షణం నాలో " నీలా " ఎపుడు నువ్వు ఉంటావ్. నేను వెళ్లిపోతున్నా ఆ క్షణం నా పాదాలను తాకిన నీ అలలు నువ్వు చెప్పేది నేను వింటున్న అని అనడానికి ఏమో నీల ..సముద్రానికి నేను ఇష్టంగా పెట్టుకున్న పేరు