This Hilarious Conversation Between A Girl & A Guy Tells Us Why Heroes Can Be Villains Sometimes!

Updated on
This Hilarious Conversation Between A Girl & A Guy Tells Us Why Heroes Can Be Villains Sometimes!

రాజేష్ ఒక software office lawn లో ఉన్న bench మీద కూర్చొని ఉన్నారు. రాజేష్ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. కాల్ చేస్తాడు.

రాజేష్: హలో... ఎక్కడ ? హర్షిత: వస్తున్నా! నీకో surprise plan చేశా. రాజేష్: చెప్పకుండా చేసేది surprise అంటారు... చెప్పి చేస్తే...<ఆలోచించి> prize అంటారు. హర్షిత: Whatever!...Trust me bro! lifelong మర్చిపోని surprise. 1 min లో ఉంటా, bye.

రాజేష్ ఫోన్ పెట్టేసి... పాప... నా గర్ల్ ఫ్రెండ్. తను నేను కొంచెం బాగా cinematic గా మాట్లాడుకుంటాం లెండి. కంగారుపడకండి. హర్షిత వస్తుంది. రాజేష్ హర్షిత చుట్టూ చూస్తాడు. హర్షిత ఏంటి ? అన్నట్టు చూస్తుంది. రాజేష్ ఏం లేదు అన్నట్టు చూస్తాడు.

హర్షిత: ఏంట్రా... మీ డైనోసర్ రాలేదా ఈ రోజు.

రాజేష్: Leave లో ఉన్నాడు... మా టీమ్ ని చూడాలి....బ్రిటిష్ వాళ్ళు independence declare చేసినప్పుడు కూడా ఇంత happy గా feel అయి ఉండరు ఎవరు.

హర్షిత: హ హ... మరీ exaggerate చేస్తావ్ రా నువ్వు.

రాజేష్: బయట నిలబడి whistle వినేవాడికి కాదు, cooker లో ఉడికేటోడికి తెలుస్తుంది pressure. నీకేం, రేలంగి మావయ్యని beat చేసే దేవుడిలాంటి manager.

హర్షిత: ఆపరా బాబు, నువ్ నీ సినిమా డైలాగులు.

రాజేష్, హర్షిత భూజాన్ని గీకుతూ ఉంటాడు. హర్షిత ఏంటి అన్నట్టు చూస్తుంది.

రాజేష్: surprise ఏదో అన్నావ్...

హర్షిత:<కొంచెం sarcastic గా> ఇస్తా... ఇస్తా!

రాజేష్, హర్షిత ఇద్దరు కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్ధం కాక అటు ఇటు చూస్తూ ఉంటారు. ఫోన్ check చేసుకుంటారు. రాజేష్ మాట్లాడడం అనుకునేలోపు...

హర్షిత: నీకు లవ్ సినిమాలు అంటే ఇష్టం కదా ?

రాజేష్:<వెకిలిగా సిగ్గు పడుతూ> తెలుగు లవ్ ఆ, ఇంగ్లీష్ లవ్ ఆ ?

హర్షిత:<కొంచెం కోపంగా> తెలుగు ప్రేమ కదా చిత్రాలు.

రాజేష్: మనకి అలా ఏం లేదు, తెలుగు సినిమా అంటే కోసేసుకుంటాం గా.

హర్షిత: లవ్ stories backdrop లో వచ్చే మూవీస్ లో villain ఎవరో తెలుసా ?

రాజేష్: script ని బట్టి ఉంటుంది అది. general గా అంటే... heroine వాళ్ళ బాబు.

హర్షిత: బాబేంట్రా... నాన్న అనలేవా ?

రాజేష్: Oh! My మనోభావాలు. సరే, villain గారు నాన్నాగారు.

హర్షిత:No. Keep guessing.

రాజేష్: హీరోయిన్ అన్న/తమ్ముడు ?

హర్షిత: No.

రాజేష్: Caste ?

హర్షిత: No.

రాజేష్: మాఫియా don-లు/టెర్రరిస్ట్-లు/నక్సలైట్-లు/ఫ్యాక్షనిస్ట్-లు/హీరో వాళ్ళ నాన్న/అమ్మ/ఫ్రెండ్స్/పాత కక్షలు/తీరని అప్పులు...

హర్షిత: No<ఒక్కో దానికి ఒక్కో No response>.

రాజేష్: Then who ?

హర్షిత: హీరో గాడే అసలు దొంగ నా doodle.

రాజేష్: What the Superstar Knife. మీ ఆరోపణలకు సరైన ఆధారాలు ఉండే మాట్లాడుతున్నారా మీరు ?

హర్షిత: <ఉన్నాయి చెప్తా విను అన్నట్టు లుక్ ఇచ్చి> సినిమా start అయినప్పుడు హీరోయిన్ ని ఎలా చూపిస్తారు ?

రాజేష్: హ్మ్! Sometimes innocent, sometimes intelligent, sometimes independent, sometime irritating but always daddy's girl.

హర్షిత: Note this point baby గారు.

రాజేష్ ఫోన్ లో notepad open చేసి రాసుకుంటాడు.

రాజేష్: Done.

హర్షిత: చూడగానే propose చేసేది ?

రాజేష్: హీరో.

హర్షిత: కుక్కలా వెంటపడేది ?

రాజేష్: హీరో. హర్షిత: ఏ మాత్రం interest చూపించకున్నా, ignore చేస్తున్నా వదలనిది ? రాజేష్: హీరో.

హర్షిత: ఒకవేళ పడకపోతే sad songs పేరుతో హీరోయిన్ ని ఇంట్లో వాళ్ళతో కలిపి తిట్టేది ?

రాజేష్: హీరో.

హర్షిత: హీరోయిన్ వాళ్ళ నాన్న ని విలన్ లా మార్చేది ?

రాజేష్: హీరోనే కానీ, మీరు కోడిగుడ్డు మీద ఈకలు ఈకుతున్నారు పాప గారు.

హర్షిత: వాళ్ళు sadist ని హీరో లా చూపిస్తున్నారు baby గారు.

రాజేష్: అయినా సరే, మీరింక conclude చేయండి పాప గారు.

హర్షిత: హ్మ్! సరే... So, నేనే రాజు నేనే మంత్రి dream sequence లో cg లో చేసిన గడ్డి కంటే పచ్చగా సాగిపోతున్న హీరోయిన్ లైఫ్ లోకి enter అయ్యి, తనని emotional -గా/mental-గా/physical-గా torture చేసి, ఆఖరికి తన ఇంట్లో వాళ్లనే ఆమెకి villains లా మార్చే వ్యక్తి హీరో కాదు వాడే పెద్ద విలన్ అని నా అభిప్రాయం. ఇది తరతరాలుగా హీరోముసుగులో వెలుగుతున్న హీరోరూప విల్లన్ దర్శనం, ఇప్పటివరకు జరిగిన చర్చంతా నిదర్శనం.

రాజేష్: నిజమే పాప. <కళ్ళు తుడుచుకుంటూ> అసలు ఈ angle ఏ ఆలోచించలేదు ఎప్పుడు.

హర్షిత: అలాంటి హీరో ని వదిలేయడం తప్పు కాదు గా.

రాజేష్: ఇసుమంత కూడా కాదు...సరే, ఔను! అసలు నువ్ పెద్దగా సినిమాలు చుడవ్ కదా, ఈ టాపిక్ ఏంటి sudden-గా.

హర్షిత: మన స్టోరీ తీస్తే ఒక మంచి సినిమా అవుతుంది కదా.

రాజేష్: అబ్బో! బ్లాక్ బస్టర్ సినిమా లవ్ స్టోరీ అనుకో.

హర్షిత: మన లవ్ స్టోరీ లో so called hero ఎవరు ?

రాజేష్ ఫోన్ రింగ్ అవుతుంది. <నేనే నేనే నేనే హీరో ringtone>. ఫోన్ lift చేసి మాట్లాడుతాడు. హర్షిత బాగ్ లో నుంచి ఏదో తీసి రాజేష్ పక్కన పెట్టి వెళ్లిపోతుంటుంది. రాజేష్ ఫోన్ మాట్లాడి, పక్కన పెట్టిన దాన్ని చూస్తాడు. వెళ్ళిపోతున్న హర్షిత ని చూస్తాడు... హర్షిత వెనక్కి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రాజేష్ చేతిలో హర్షిత పెళ్లి కార్డు. దాని మీద You Are My Hero అని రాసుంటుంది. Rajesh ఏం మాట్లాడాలో తెలీక వెళ్ళిపోతున్న హర్షితను చలనం లేకుండా చూస్తూ ఉన్నాడు.