Meet The Nellore Man Who Has Changed The Lives Of Several Street Kids And Turned Them Into Productive Citizens!

Updated on
Meet The Nellore Man Who Has Changed The Lives Of Several Street Kids And Turned Them Into Productive Citizens!

Article Info Source: The Better India

పని మీద ఊరు వెళ్దామని రైల్వే స్టేషన్ కు చేరుకున్నాం. చుట్టు జనాలు.. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. లగేజ్ తీసుకుని ఎక్కబోతుండగా 'అయ్యా అయ్యా' అంటు కొంతమంది చిన్నపిల్లలు చుట్టుముట్టారు. అ చిన్నపిల్లలలో కొంతమంది దొంగతనాలు చేసేవారు కూడా ఉంటారు. మామూలు వ్యక్తులైతే ఏం చేస్తారు..? హె ఛీ జరగండి! అనో లేదంటే ఒక రుపాయి ఇచ్చి ఒదిలించుకుంటారు. కాని ఆ వ్యక్తి మాత్రం ఈ ముష్టిగోల నాకెందుకు అంటు చీదరించుకోలేదు, వారందరికి కలిసి వచ్చిన కాలంలో నడిచి వచ్చిన తండ్రి అయ్యాడు. దాదాపు120 దిక్కులేని పిల్లలను గుండెకు హత్తుకుని భారతదేశ భవితకు రేపటి బంగారు పౌరులను అందించారు, అందిస్తున్నారు. అడుక్కుని, దొంగతనాలు చేసే పిల్లలను సైంటిస్ట్ గా, ప్రొఫెసర్ గా, ఒక భాద్యతాయుతమైన ఎస్.ఐ గా తీర్చిదిద్దారు. కడుపున పుట్టిన పిల్లలనే చెత్తకుండీలలో పారేస్తున్న ఈ దుర్మార్గపు రోజుల్లో ఏ బంధం లేని వీధి బాలలను పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేసిన ఒక గొప్ప మనిషి గురుంచి ఈరోజు తెలుసుకుందాం.

sarath3-1

నెల్లూరు రైల్వే స్టేషన్ లో సాధారణ క్లార్క్ గా ఉద్యోగం చేస్తుంటారు శరత్ బాబు గారు(ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు). అతను పనిచేస్తున్న రోజుల్లో కొంతమంది పిల్లలు ఈ రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదనే ఉండేవారు. వచ్చిపోయే ప్రయాణికుల నుండి ఏమైన అడుక్కుని బ్రతికేవారు. అక్కడే ఉంటూ ఫ్లాట్ ఫామ్ ని అంతా అపరిశుభ్రంగా చేసేవారు. శరత్ బాబు గారు మొదట వారికి ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటుచేసి అక్కడే ఉండమనేవారు. కాలక్రమంలో వారి పరిస్థితిని చూసి చలించిపోయి తను ఉంటున్న ఊరి గ్రామ పంచాయితి పెద్దమనుషులను కలిసి "ఈ పిల్లల జీవితాలను మార్చాలనుకుంటున్నా, వారికోసం మీ వంతు సహాయం చేయండి" అని అభ్యర్ధిస్తే పిల్లలు ఉండటానికి వారు కొంత భూమిని ఇచ్చారు.

sarath2

వీరికోసం ఏర్పాటుచేసిన ఆశ్రమంలో ఉంటున్నది వీధిబాలలే ఐనా శరత్ గారికి దీనిని ఆనాధాశ్రమం అని పిలిస్తే అస్సలు నచ్చదు. వీధి బాలలను మార్చడం చాలా కష్టతరం. వారు పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. వారిలో కొంతమంది దొంగతనాలకు కూడా అలవాటు పడ్డారు, అలాంటి వారి వ్యక్తిత్వం మార్చడం అత్యంత కష్ఠతరం. కాని శరత్ బాబు గారు ఓపికతో వారిని చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి నడిపించారు. క్రమశిక్షణ, లక్ష్యంపై గురి, మంచి తెలివితేటలలో మార్పును సాధించారు. శరత్ బాబు చేస్తున్న సేవలకు పరవశించిపోయిన గ్రామస్తులు మరో 4.5ఎకారాల స్థలం ఇచ్చి మరింత ప్రోత్సహించారు. ఈ ఆశ్రమంలోనే పిల్లలకు అవసరమయ్యే కూరగాయలను వారే పండించుకుంటారు. గ్రామస్థులు కూడా వీరిని వీధి బాలలు అని చూడకుండా వారి సొంత పిల్లలుగానే ఆత్మీయంగ చూసుకుంటారు. గ్రామస్థుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఈ పిల్లలనే మొదటి అతిధిగా ఆహ్వానిస్తారు.

sarath4

ఇక్కడ కొంతమంది పిల్లల గురుంచి ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ ఉంటూ చదువుకున్న ఒక బాబు తండ్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగి. కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాబు ఇంటినుండి పారిపోయి రైల్వే స్టేషన్ లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. శరత్ గారు ఆ బాబును చేరదీసి మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడంతో దొంగతనాలు చేసిన పిల్లోడే M.Sc. In Organic Chemistryలో Distinction లో Pass అయ్యాడు. ఇప్పుడు National Institute Of Technology, Surathkal, Mangalore లో జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. చిరిగిపోయిన చెడ్డివేసుకుని అడుక్కున్న ఇంకోబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Police Department లో Sub Inspector గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

sarath1

పంచాయితి రాజ్ Departmentలో Work Inspector గా ఒక వ్యక్తి, ఫిజిక్స్ లెక్చరర్ గా ఇంకో వ్యక్తి.... ఇలా ఎంతోమందిని ఉన్నతులుగా తీర్చిదిద్ది వారి తలరాతను మార్చివేసిన అపర బ్రహ్మగా శరత్ బాబు గారు అవతరించారు. తన దగ్గర నుండి చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న పిల్లలను ఆశ్రమం కోసం ఏమైన దానం చేస్తారా.. అని వాళ్ళను అడుగుతారా? అని శరత్ గారిని ప్రశ్నిస్తే "నేను వారి నుండి ఏది కోరుకోవడం లేదు". "శరత్ దగ్గర చదువుకున్న ప్రతిఒక్కరు ఇంకో శరత్ కావాలనే నా కోరిక". ఈ మాటలు వింటుంటేనే అర్ధం అవుతుంది ఆయన సేవలో ఎంతటి నిజాయితి ఉందో అని.. గంజాయి వనంలో తులసి మొక్కను ఎవ్వరైనా గుర్తుపట్టగలరు కాని ఆ గంజాయి వనాన్నే తులసి వనంగా మార్చి దేశానికి గొప్ప పౌరులను అందించిన "అభినవ బ్రహ్మ" మన రామచంద్ర శరత్ బాబు గారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.