నిజానికి మనమందరం మన ఆలోచనలలో ఒక సరిహద్దును ఏర్పరుచుకుంటున్నాం.. మన స్థాయి, పరిధి ఇంతే, ఇంతవరకే, ఇక ఇంతకుమించి చేయలేం అని.. కాని అలా కొంత సరిహద్దు వరకే మిగిలిపోతే మనం ఏది కొత్తగా సాధించలేం. అందరూ చీకట్లో మిణుగురు పురుగులు చూసి సంభరపడితే సైంటిస్టులు అది మరింత కాంతివంతంగా వెలుగుతూ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందని బల్బ్ ని కనుగొన్నారు అందరూ ఆకాశంలో ఎగిరే పక్షులనే చూసి ఆశ్ఛర్యపడిపోయి అక్కడే ఆగిపోతే ఈరోజు మనం విమానాలలో తిరిగేవాళ్ళమే కాదు. మన ఊహ మనల్ని ఉన్నతులను చేస్తుంది.. ఈ ప్రపంచాన్ని మార్చివేస్తుంది.. ఇప్పుడు మనం తెలుసుకునే 13ఏళ్ళ విష్ణుచందన్ కూడా ఈ కోవకు చెందకపోయినా గాని ఇంత చిన్న వయసులోనే తన పరిధికి, ఊహకు మించి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు.
8th Class Student అంటే ఎలా ఉంటాడు.? ఎవరో ఎందుకు మనల్నే Example గా తీసుకుందాం.. చదవడం కాదు కదా స్కూల్ కి వెళ్ళడమే ఎక్కువ అన్నట్టు ఉండేది మనలో చాలామందికి.. ఇంటికి రాగానే బ్యాగ్ పడేసి బ్యాట్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పిల్లలకు బ్యాట్ ప్లేస్ లో మొబైల్ వచ్చేసింది అందులోనే గేమ్స్ ఆడుతున్నారు. విష్ణు చందన్ కూడా గేమ్స్ ఆడుతాడు కాని అక్కడితోనే ఆగిపోలేదు నాన్న కొలపర్తి పవన్ Guidanceతో దాదాపు నెలలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 Android Games Create చేసి Google Play Storeలో Upload చేశాడు.
ఏదైనా ఒక రంగంలో ఉన్నతులుగా ఎదగాలనుకుంటే అప్పుడు మనం అందరి కన్నా ముందుగా పనిని ప్రారంభించాల్సి ఉంటుంది. మనోడు మూడు సంవత్సరాల వయసు నుండే కంప్యూటర్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టాడు, ఐదు సంవత్సరాల వయసు నుండి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లకు సంబంధించినవి తెలుసుకోవడం ప్రారంభించాడు.. 11సంవత్సరాలు వచ్చేసరికి కంప్యూటర్ పై మంచి పట్టు సాధించాడు. Software Related Education Complete చేసి కుస్తీలు పడితే తప్ప ఇలా చెయ్యడం సాధ్యం కాదు అనే వారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ తనకెంతో ఇష్టమైన Android Games తయారుచేశాడు.
ఇంత చేశాడంటే విష్ణు ఏ కార్పోరేట్ స్కూల్ లో చదువుతున్నాడేమో అనుకోవచ్చు గాని మనోడు చదువుతున్నది ఒక గవర్నమెంట్ స్కూల్ లో. 13 సంవత్సరాల గవర్నమెంట్ స్టూడెంట్ కోసం ఇప్పుడు IBM, Google, Oracleతో పాటు మరో 30 International Companies ముందుకు వచ్చి మా కంపెనీలో జాబ్ ఇస్తామని వెతుక్కుంటు వస్తున్నాయి. విజయం సాధించడంలో పేద, ధనిక తేడాలను చెరిపేసిన వారిని చూస్తున్నాం, కాని విష్ణు మాత్రం విజయానికి వయసుతో కూడా సంబంధం లేదని నిరూపిస్తున్నాడు.