Contributed By Gandham Srinivasu
ఇప్పటి జనరేషన్ లో యువత అందరూ నేను డాక్టర్ అవుతా పోలీస్ అవుతా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అనే వాళ్లే తప్ప. నేను రైతు అవుతాను అనే వారే లేరు, సుహాస్ అనే కుర్రాడు రైతు ఆవుదాం అనుకుంటాడు కానీ తన చుట్టూ ఉండే పరిస్థితులు తనకి అనుకూలించవు. ఒక రోజు సుహాస్ వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు అప్పుడు..
సుహాస్:-రండి మావయ్య, చాలా రోజుల తరువాత వచ్చారు. ఎలా ఉన్నారు? మావయ్య:-హ బానే ఉన్నాముర, ఇంకేంటి నీకు డిగ్రీ లో 80% వచ్చాయి అంట కదా.. సుహాస్:-ఆ అవును మావయ్య మావయ్య:-మా ఓడికి మంచి మార్కులు వచ్చాయి వాడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.. ఇంతకీ నెక్స్ట్ నువేమ్మి చేద్దాం అనుకుంటున్నావ్??
సుహాస్:-నాన్న ఒకరే పొలం పని చెయ్యలేక పోతున్నారు, ఆయనకి తోడుగా ఉంటూ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను మావయ్య.. మావయ్య:-ఎరా నీకు ఏమైనా పిచ్చా !? మా లాగా నువ్వు కష్టపడకూడదనే కదా మీ నాన్న నిన్ను చదివించింది.. నువ్వెంట్రా వ్యవసాయం చేస్తాను, పొలం దున్నుతాను అంటున్నావు సుహాస్:-లేదు మావయ్య నేను వ్యవసాయం చేస్తాను మావయ్య:-నేను చెప్పాల్సింది చెప్పా, ఇంక నీ ఇష్టం ..
అలా సుహాస్ వాళ్ల నాన్న గారితో వ్యవసాయం చేసుకుంటూ ఉండే వాడు . ఒక రోజు సుహాస్ ని చూసుకోవడానికి పెళ్లి వారు ఇంటికి వస్తారు అప్పుడు
సుహాస్ ఫాథర్:-వీడేనండి మా అబ్బాయి అంకుల్:-హో.. హై ఎం చదువుకున్నావు బాబు? సుహాస్:-డిగ్రీ చేసాను అండి అంకుల్:- మరి ఇప్పుడు ఎం జాబ్ చేస్తున్నావు? సుహాస్:-వ్యవసాయం చేస్తున్నాను అండీ. అంకుల్:-వ్యవసాయమా.. సుబ్బరంగా జాబ్ చెసుకోవచ్చు కదా..
సుహాస్ ఎమోషనల్ గా కోపంగా ఇలా అంటారు
సుహాస్:- ఎహె ఎంటండి, ప్రతి ఓడు జాబ్ జాబ్ జాబ్ అంటారు ..ఏ వ్యవసాయం ఓ జాబ్ కదా?? ఓ పని కదా??.మీలాగే ప్రతీ రైతూ ఆలోచించి ఉంటే ఈ పాటికి మీరు గడ్డి తింటూ ఉండేవారు. జాబ్ ఉన్న వాడికి మీ కూతుర్ని ఇచ్చినంత మాత్రాన తినమని బంగారు బిస్కెట్ లేమి పెట్టడు వాడు పెట్టేది అన్నమే. మనం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం ఒక సోల్జేర్, అదే మనకి టైయనికి నలుగువేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే కారణం పంట పండిస్తున్న ప్రతి రైతు సోల్జేరే. ఈ గవర్నమెంట్ ఉందే.. మంచి పబ్ పెడతాను అన్నవోడికి మంచి బ్రాందీ తయారు చేస్తాను అన్నవోడి లోన్లు ఇస్తారు కానీ కొన్ని వేలమంది కడుపు నింపే రైతుకి మాత్రం లోన్లు ఇవ్వడానికి చేతులు రావు. కంకర రోడ్డు అయినా పర్వాలేదు అని మంచి మార్గం లో వెళ్లే మమ్మల్ని సిమెంట్ రోడ్ వేసి మరీ తప్పుడు మార్గం లో తీసుకు వెళ్లే వాళ్ళు ఉన్నంత కాలం దేశం బాగుపడదు.రైతు అవ్వనక్కర్లెద్దు, రైతుని గౌరవించండి చాలు జై కిసాన్