This Short Poem Tells Us The Inner Feelings Of A Newly Born Baby

Updated on
This Short Poem Tells Us The Inner Feelings Of A Newly Born Baby

Contributed by Sowmya Uriti

చుట్టూ చీకటి...కొన్ని నెలలుగా ఆ చీకటిలోనే జీవిస్తున్న నేను దానికి భయపడనేలేదు కాని కొన్ని నిమిషాలలోనే నాకు ఎదురైన వెలుతురు నా కళ్ళను తెరవనీయకుండా చేస్తుంది నిశబ్ధ లోకానికి అలవాటు పడిన నన్ను ఈ కొత్త ప్రపంచపు అలికిడులు భయపెడుతున్నాయి నులివెచ్చని వాతావరణంలో పెరిగిన నేను ఈ చలి గాలులకు ముడుచుకుపోతున్నాను అపరిచితుల స్పర్శలు ఇదివరకు మౌనంగా ఉన్ననన్ను గుక్కపట్టి ఏడ్చేలా చేస్తున్నాయి ……. కొద్ది నిమిషాలలో….. ఓ స్పర్శ నా కన్నీటిని చిరునవ్వుగా మార్చింది తన పొత్తిళ్ళలోని వెచ్చదనం నా శరీరానికి సాంత్వన కలిగిస్తుంది నన్ను గుండెకు హత్తుకున్న తన గుండె చప్పుడు నాకు ధైర్యాన్నిస్తుంది ఆ ధైర్యంతోనే వెలుగును జయించి నా కనురెప్పలను మెళ్ళగా తెరచాను... మెరిసే కళ్ళతో ఏంతో ఆత్రంగా నన్నే చూస్తుంది ఆమె... నా మనసులోని హాయిని తెలిపాను ఆమెకు ఓ చిరునవ్వు రూపంలో.. నా బోసి నవ్వుకు మురిసి జగము మరచె ఆమె.. అవును తను మా అమ్మే…..