Meet The 13-Year-Old Super Talented Classical Dancer Who Seems Unstoppable With A Spree Of Records!

Updated on
Meet The 13-Year-Old Super Talented Classical Dancer Who Seems Unstoppable With A Spree Of Records!

"నువ్వు కేవలం ఆడదానివి నువ్వేం చేయలేవు" అన్న మాటలు తల్లి స్వర్ణశ్రీ గారికి ఎంతో స్పూర్తిని నింపాయి. ఆ మాటలకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నమే 'నిధి'. అందరూ నడక బుడి బుడి అడుగులతో నేర్చుకుంటారు నిధి మాత్రం తల్లి సహాయంతో 9నెలల ప్రాయంలోనే క్లాసికల్ మ్యూజిక్ కు అనుగూనంగా అందుకు తగ్గ స్టెప్స్ తో నడక నేర్చుకున్నది. ఒకసారి చూడగానే నిధి ఒక క్లాసికల్ డాన్సర్ లా మాత్రమే కనిపిస్తుంది కాని స్పోర్ట్స్ లో తనే టాప్, ఎడ్యూకేషన్ లో కూడా తనే టాప్..

మూడున్నర వయసులోనే: నిధి అమ్మగారికి నాట్యంలో అంతగా అనుభవం లేదు కాని తన ఇష్టాన్ని నిధికి ప్రేమతో అందించారు. చిన్నప్పటి నుండి పిల్లలు ఏదైతే చూస్తారో అదే వారికి ఇష్టంగా వారి జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. అలా నిధి కోసం ఇంటిని తీర్చిదిద్దారు. సుమారు రెండు సంవత్సరాల వయసులోనే తనకు నాట్యం చేయాలని మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా గాని "పాప వయసు చాలా చిన్నది కనీసం మూడు సంవత్సరాలు నిండితే తప్ప మేము శిక్షణ ఇవ్వలేము" అని గురువులు సున్నితంగా తిరస్కరించారట. "మీరు అనుకున్నట్టుగానే శిక్షణ మూడు సంవత్సరాల నుండే ఇవ్వండి కాకపోతే ప్రతిరోజు మీరు మిగిలిన పిల్లలకు నేర్పించే నాట్యాన్ని దర్శించనీయండి, తనకు ఎంతో ఉపయోగపడుతుంది" అని గారు అడిగారట. కొంతకాలానికే నిధిలో అనూహ్యమైన మార్పులు రావడం అది గురువుకు నచ్చడంతో అనుకున్న సమయం కన్నా ముందే నాట్య శిక్షణ ప్రారంభించారు.

నిధి మొదటి నాట్య ప్రదర్శన మూడున్నర సంవత్సరాల ప్రాయంలోనే జరిగింది నిధి చదువుకునే స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో.. హరిహర కళామండపంలో తల్లిదండ్రులు, విద్యార్ధుల సమక్షంలో ఆ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నిధి స్టేజ్ మీదకు ఒక ప్లేట్ రెండు క్యాండిల్స్ తో వచ్చేసింది. ప్లేట్ మీద తన సున్నితమైన పాదాలను మోపి రెండు చేతులలో రెండు క్యాండిల్స్ ను వెలిగించి నాట్యం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆ క్యాండిల్స్ లోని వేడికి మైనం కరిగి తన చేతులమీద పడడం ప్రారంభమయ్యింది. నిర్వాహకులు, తల్లి ఆపేయమని సైగలు చేసినా కాని నిధి మాత్రం నాట్యాన్ని దివ్యంగా పూర్తిచేసింది. నాట్యం పూర్తి అయ్యాక పరుగున తల్లి నిధిని చేరుకుని అడిగారు నాట్యం ఆపేయకపోయావ అని.. "నువ్వే చెప్పావు కదా అమ్మ ఒక్కసారి నాట్యం మొదలు పెట్టాక ఎవ్వరు పిలిచిమా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపకూడదు అని" అని నిధి బదులిచ్చిందట. ఈ ఒక్క ఉదాహరణ చాలు నిధి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి.

ఆల్ రౌండర్: ఒకరంగంలో విశేష ప్రతిభ సాధించాలంటే మిగిలిన రంగాన్ని ఒదులుకోవాల్సి ఉంటుందని అంటారు కాని మిగిలిన వారిలా తను కాదు.. నిధి అన్ని రంగాలలో ఉన్నత శ్రేణి ఫలితాలను సాధించింది. స్కూల్ మొత్తంలో చదువులో ఎక్కువ మార్కులు తనవే, సోర్ట్స్ లో అత్యధిక మెడల్స్ తనకే వచ్చేవి, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం పొంది అందులోను శభాష్ అనిపించుకున్నది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో, స్కూల్ అగస్ట్ 15కు, రిపబ్లిక్ డే నాడు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో తనే విజేతగా నిలిచేది. అంతేకాదు Mathematics Abacus లోనూ 5వ తరగతిలో ఉండగానే మాస్టర్స్ పూర్తిచేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రికార్డ్స్: 8సంవత్సరాల వయసులో ఏ విరామం లేకుండా సెమిక్లాసికల్, ఫోక్, క్లాసికల్ ఈ మూడు విభాగాలలో స్టేజ్ మీద డ్రెస్ వెనువెంటనే మారుస్తూ 21 పాటలకు నాట్యం చేశారు. ఈ ఒక్క ప్రదర్శనకే 14 వరల్డ్ రికార్డ్స్ కేవసం చేసుకున్నది. కిందటి సంవత్సరం అబ్దుల్ కలాం గారి జన్మదిన వేడుకలలో ఆపకుండా 6గంటల పాటు నాట్యం చేసింది. ఇందులో ఒక గంట క్లాసికల్, సెమిక్లాసికల్, ఫోక్, లాలిపాటలు ఇలా ఆరు విభాగాలలో నాట్యం చేసింది. నిధి వయసు ప్రస్తుతం కేవలం 13 సంవత్సరాలు మాత్రమే కాని 21 వరల్డ్ రికార్డ్స్, 49 నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్నది.

సి. నారాయణ రెడ్డి గారికి ఎంతో ఇష్టం: "నిన్ను నీ ప్రదర్శనను ఎప్పుడు చూసినా కాని చనిపోయిన నా కన్నతల్లి గుర్తుకువస్తుందమ్మా" అని సి.నారాయణ రెడ్డి గారు నిధిని ఎన్నోసార్లు పోగిడారట. అమ్మ లాలి పాటలకు అద్భుతంగా నృత్యం చేయడంతో తనకు "లాలినిధి" అనే బిరుదును కూడా సి.నా.రె గారు బహుకరించారు.

నిజానికి ప్రతి మనిషిలో అంతులేని ఊహకందని శక్తి దాగున్నది దానిని సక్రమంగా సరైన స్థాయిలో వినియోగించుకుంటే అద్బుతాలు సృష్టించవచ్చు అని వివరించడానికి నిధి(7981443629) జీవితం ఒక చక్కని ఉదాహరణ!