"విజయం కన్నా కష్టాలను, పోరాటాన్ని ఎంజాయ్ చేసేవారిని ఏ పరిస్థితి వారిని అణిచివేయలేదు". నిహారికా రెడ్డి.. ఈ అందమైన రూపం వెనుక అంతులేని విషాదం దాగి ఉన్నది. కస్ట్యూమ్ డిజైనర్ గా సిని వినీలాకాశంలో ఉదయించిన ఈ తార వెలగుల వెనుక ఎన్నో కష్టాల కారు మబ్బులున్నాయి.. తన నిజమైన పోరాటం అమ్మ కడుపు లో నుండి విజయం సాధించడంతోనే మొదలయ్యింది. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి మరణంతో తల్లిప్రేమకు దూరమయ్యారు.. అమ్మ ప్రేమకు దూరమైన అమ్మ తనకో మార్గాన్ని చూపింది. నిహారిక కడుపులో ఉండగానే అమ్మ నిహారిక కోసం డ్రెస్, చిన్న చిన్న కుట్లు, అల్లికలు లాంటివి తయారుచేశారు. ఆ కారకాలే తనని కాస్ట్యూమ్ డిజైనరి చేసింది. ఎక్కడో అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్ సినీ పరిశ్రమకు సాగిన ప్రయాణం ఒక వీరోచిత ప్రయాణం. నిహారిక భీకరమైన వరదలను దాటింది, ఆహారం దొరకని ఎడారిని దాటింది, కారడివిలో కాటేసిన కాల సర్పాల విషాన్ని తట్టుకుంది.. తను కలలు కన్న గమ్యం కోసం ఏనాడు తన పోరాటాన్ని ఆపి చేతులెత్తేయలేదు.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/17021909_10208414075965723_4851110902378142135_n-e1519576845854.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/18056871_1535470613154296_7673355261766235686_n-e1519576868355.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/19146271_10209226794323174_5233727682616708715_n-e1519576882131.jpg)
లేత పసితనంలోనే అమ్మ వెళ్ళిపోయినా గాని పెద్దమ్మ, అమ్మమ్మలు తనని అక్కున చేర్చుకున్నారు. పసితనం నుండి నిహారిక ఆలనా పాలన చూస్తూ స్కూల్ లో కూడా చేర్పించి తన కాళ్ళ మీద తను బ్రతికేందుకు అవసరమయ్యేలా చర్యలు తీసుకున్నారు.. కాని ఓరోజు మరోక ప్రళయం నిహారిక జీవితంలోకి కర్కశంగా ప్రవేశించింది నాన్న రూపంలో..
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/17361597_10208564458085182_2844648369368640430_n-e1519576904219.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/20479919_1260817874030064_4871154972353509541_n-e1519576921932.jpg)
అప్పటికి నిహారిక రెండవ తరగతి చదువుకుంటున్నది. నిహారిక నా కూతురు నా దగ్గరే పెరగాలని చెప్పి నాన్న ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎవ్వరూ చేసేదేమి లేక ఒప్పుకున్నారు. నిహారిక కు ఇదంతా వింతగా తోచింది. అప్పటి వరకు పెద్దమ్మనే తన అమ్మగా భావించింది. తను నిర్మించుకున్న బంధాలు కుప్పకూలిపోయాయి. నాన్న అప్పటికే రెండో పెళ్ళిచేసుకున్నాడు, పిల్లలు కూడా కలిగారు. ఈ కొత్త బంధాలను నిర్మించుకునే తరుణంలో తనకో చేదు నిజం తెలిసింది. "నన్ను తీసుకువచ్చింది కూతురిగా కాదు పనిమనిషిగా" అని.. లోకం కోసం గవర్నమెంట్ స్కూల్ లో చేర్పించి, ఇంటి చాకిరంతా తన చిట్టి చేతులతో చేయించేవారు. ఐన దానికి కాని దానికి ఏదో రకంగా హింస పెట్టేవారు, నిహారిక ఎక్కడో తింటుందోనని బిస్కెట్లను సైతం బిర్వాలో దాచేవారు.. అదుపు ఆజ్ఞలో ఉంచడం కోసం విపరీతంగా కొట్టేవారు. ఇప్పుడు నిహారిక విధినీ బ్రతిమలాడలేదు ఎదురించాలనుకుంది.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/22489983_10210077622473346_5827869241821019222_n-e1519576941384.jpg)
పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వారికి జరిగినదంతా చెప్పి ఎట్టకేలకు అమ్మలోటును తీర్చే పెద్దమ్మ గూటికి చేరింది. చదువును కోనసాగించింది. “నిహారిక జీవితం బాగుపడాలంటే పిన్ని(నాన్న రెండో భార్య) తమ్ముడికిచ్చి పెళ్ళిచేయాల్సిందే” అనే ప్రతిపాదన వచ్చేసింది. ఇలా ఐతే నా జీవితం జీవితాంతం పనిమనిషి బ్రతుకే అని భావించిన నిహారిక హైదరాబాద్ కు వచ్చేసింది. జూనియర్ ఎన్.టి.ఆర్ "సాంబ" సినిమాలో చదువుకునేవారికి సహాయం చేస్తారు. ఈ సినిమా చూసిన నిహారిక తన్ను కూడా ఆదుకుంటారని జూనియర్ ఎన్.టి.ఆర్ ను కలవడానికి వచ్చేసింది కాని ఎన్.టి.ఆర్ ను కలవలేపోయింది.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/26047244_10210563093409816_815536418301573927_n-e1519577069270.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/26165190_10210582013922817_4903582064704197489_n.jpg)
ఐతే ఏంటి చంద్రబాబుగారిని కలిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆపాయింట్మెంట్ కోసం వేచిఉండి మొత్తానికి కలిసి "నీ చదువుకోసం నేను సహాయపడతానని" హామీ తీసుకున్నది. హైదరాబాద్ లోనే లోక్ అదాలత్ నాయకురాలు నిహారిక పరిస్థితి తెలుసుకని తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. కొన్నాళ్ళు బాగానే చూసుకున్నారు కాని ఇంటర్మీడియట్ తప్పిందనే నెపంతో(హాల్ టికెట్ నెంబర్ సరిగ్గా చూడలేదు) నిహారికను ఇంటినుండి ఆ నాయకురాలు పంపివేశారు. ఇక్కడే ఈ ప్రపంచం మీద తన జీవితం మీద విరక్తి కలిగింది. ఒకేసారి ప్రపంచంపై, తన జీవితంపై కోపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/26730874_10210669803597504_1797436856863921985_n.jpg)
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/27972172_1575467282501609_690451402382446174_n.jpg)
ది గమనించి కొంతమంది వ్యక్తులు నిహారికను కాపాడారు. టెలికాలర్ గా ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు. ఐతే సదరు సంస్థ కొన్నాళ్ళకే మూసేయ్యడంతో ఎటువెళ్ళాలో అనే ప్రశ్న వెంటాడింది. సిని ఇండస్ట్రీలో తనకున్న చిన్నపాటి పరిచయాలతో అవకాశాలు అందుకుంది నిహారిక. మొదట తన అందం చూసి యాంకరింగ్, నటన అవకాశాలు వచ్చినా గాని అమ్మ వల్లనే కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలని తన అడుగులు అటువైపు వేశారు. స్వతహాగ తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలతో పోల్చుకుంటే కస్ట్యూమ్ డిజైనర్ గా కష్టాలు చిన్నవి. మరింత రీసెర్చ్ చేసి తన ఇష్టానికి శ్రమను తోడుచేశారు అద్భుతాలు రాబట్టగలిగారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల దగ్గరి నుండి, సింగర్స్, సెలేబ్రెటీలకు వారి అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్ చేయడంతో మంచిపేరు సంపాదించుకున్నారు. ఇదే ప్రయాణంలో తన జీవిత భాగస్వామి దర్శకుడు కన్నన్ ను కలుసుకోవడంతో నిహారిక జీవితం పరిపూర్ణం అయ్యింది.
![](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/28277085_10210949423867836_4540102969431262682_n.jpg)